Remove ads
From Wikipedia, the free encyclopedia
జన్యుశాస్త్రము యీనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగల్ మెండల్ (జూలై 22, 1822 - జనవరి 6, 1884) . యీయన ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి. అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని పెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.
గ్రెగర్ జోహన్ మెండల్ | |
---|---|
జననం | జోహాన్ మెండల్ జూలై 22, 1822 హీన్ జెన్ డోర్ఫ్, ఆస్ట్రియా సామ్రాజ్యము |
మరణం | జనవరి 6, 1884 Brno (Brünn), Austria-Hungary (now Czech Republic) |
జాతీయత | Empire of Austria-Hungary |
జాతి | Silesian-German |
రంగములు | జన్యు శాస్త్రము |
వృత్తిసంస్థలు | Abbey of St. Thomas in Brno |
చదువుకున్న సంస్థలు | University of Olomouc University of Vienna |
ప్రసిద్ధి | Creating the science of genetics |
మెండల్ ఆస్ట్రియాకు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, ఒక సన్యాసి. జూలై 22, 1822 న హీన్ జెన్ డోర్ఫ్ లో పుట్టాడు. వియెన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. చెకోస్లోవేకియాకి చెందిన బ్రన్ (ఇప్పుడు బ్ర్నో అని పిలుస్తున్నారు) లో స్థిరపడ్డాడు.
ఆయన పరిశోధనలు, ప్రయోగాలు చాలా సామాన్యంగా ఉంటాయి. కాని వీటిద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈయన వెలువరించిన పరి కల్పనలు మాత్రం చాలా గొప్పవి. బఠానీ మొక్కలను ప్రాయోగిక సామాగ్రిగా ఈయన స్వీకరించాడు. పొడుగు రకం, పొట్టిరకం, మధ్య సంకరం జరిపించాడు. మొదటి తరంలో అన్నీ పొడుగు మొక్కలే వచ్చాయి. మాతృతరానికి, మొదటి తరానికి మధ్య మళ్లీ సంకరం జరిపించాడు. రెండవ తరంలో పొడుగు, పొట్టి మొక్కల నిష్పత్తి 3:1 లో వచ్చింది. పొడుగును నిర్దేశించిన కారకం ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. పొట్టిని నిర్దేశించే కారకం ఉన్నప్పటికీ పొడుగును నిర్దేశించిన కారకానిదే పై చేయి అని తెలిసింది.
అలాగే మెండల్ రెండు లక్షణాలను, గుండ్రంబి విత్తనాలు, పసుపు రంగు ఒక రకం మొక్క లో, ముడతలు పడ్డ విత్తనాలు, ఆకుపచ్చ రంగు ఇంకో మొక్కలో ఎన్నుకుని రెండు తరాల వరకు పరిశోధించాడు. మొదటి తరంలో ప్రభావ కారకాలదే పై చేయి అయింది. అంటే అన్ని మొక్కలకూ గుండ్రని విత్తనాలు, పసుపు రంగే ఉంది. కాగా ఈ తరాన్ని, మాతృతరంతో సంకరం చెందించగా రూపొందిన రెండవ తరం నిష్పత్తి 9:3:3:1 లో ఉంది. గుండ్రని పసుపు పచ్చని విత్తనాలవి తొమ్మిది మొక్కలైతే, గుండ్రని ఆకుపచ్చ విత్తనాలవి మూడు మొక్కలైతే, ముడతలు పడ్డ పసుపుపచ్చ విత్తనాలు మూడు మొక్కలైతే, ముడతలు పడ్డ ఆకుపచ్చ విత్తనాలు గలది ఒకమొక్క రూపొందింది. ఈ నిష్పత్తుల ఆధారంగా మెండల్ కొన్ని పరికల్పనలు వెల్లడించాడు.
ఒక లక్షణాన్ని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. ఉదాహరణకు పొడుగు, పొట్టి అనుకుందాము. పొడుగును నిర్దేశించే కారకాలు రెండు, పొట్టిని నిర్దేశించే కారకాలు రెండు ఉంటాయి. అందులో పొడుగు లక్షణానికి అభివ్యక్తీకరించే ప్రభావం ఎక్కువ. కాబట్టి పొడుగు కారకం ఒకటి పొట్టి కారకం ఒకటి జతగా యేర్పడితే పొడుగుకే ప్రభావం ఎక్కువ. పొట్టి లక్షణం బయట పడాలంటే రెండు కారకాలూ పొట్టిని సూచించేవి అయి ఉండాలి. ఎదే అభివ్యక్తీకరణ ప్రభావ సిద్ధాంతంలోని ప్రధానాంశం.
జతగా ఏర్పడిన కారకాలు రెండూ ఒకే లక్షణాన్ని నిర్దేశించేవి అయితే పేచీయే లేదు. అలాకాక రెండు కారకాలూ రెండు వేరు వేరు లక్షణాలను నిర్దేశించేవి అయితే ఆ రెండింటిలో ఒక లక్షణం బహిర్గతమైనప్పటికీ ఆ రెండో కారకం తన లక్షణాన్ని కోల్పోదు. అంటే కారకాల లక్షణాలు విశిష్టంగా ఉంటాయే కాని ఎప్పటికీ కలవవు. వేటి ప్రతిపత్తిని అవే నిలుపుకుంటాయి.
విశిష్ట లక్షణాలను ప్రదర్శించే కారకాలు స్వయం ప్రతిపత్తిని కూడా కలిగి ఉంటాయి. కారకం విశిష్టంగ ప్రవర్తించడంలో ఏదీ అడ్దురాదు. మూడు, నాలుగు లక్షణాలను ప్రదర్శించే కారకాలు కలసినప్పుడు కూడా వేటికవే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
ఈ కారకాలను ఇప్పుడు జన్యువులుగా గుర్తిస్తున్నారు. 1865 లోనే మండలం యీ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈయన జనవరి 1884 న ఒక గొప్ప శాస్త్రజ్ఞుడనే విషయం లోకానికి తెలియకుండానే మరణించాడు. 1900 ప్రాంతంలో మెండల్ ప్రతిపాదలలు సరైనవేనని ఎంతో మంది ధృవీకరించారు. సంతానం తల్లి దండ్రులనే పోలి ఉన్నా కొన్ని విషయాలలో తేడాలను చూపుతుంది. ఈ లక్షణం వైవిధ్యంగా రూపొందుతుంది. ఈ వైవిధ్యానికి జన్యువులే కారణం. అంతే కాదు యీ వైవిధ్యం వల్లే పరిణామం సంభవం ఇవన్నీ ఇప్పుడు తేలికగా చెప్పేస్తున్నారు కాని మెండల్ కాలానికి ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితిల్లో అమూల్యమైన విషయాలను మెండల్ చెప్పినప్పటికీ మనం పట్తించుకోకపోవటం దురదృష్టం. ఏదీ ఏమైనా ఆయన ప్రతిపాదనలు నిత్య సత్యాలుగా జీవం పోస్తున్నాయి. ఈయనను చరితార్థుడ్ని చేశాయి.
మెండల్ మూడు అనువంశిక సూత్రాలను పేర్కొన్నాడు 1.సారూప్య నియమం 2.వైవిధ్యత నియమం3.ప్రతిగమన నియమం
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.