ఉత్తరాంధ్రలో నది From Wikipedia, the free encyclopedia
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్తని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకు ఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలో ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.
తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద 1963-68 మధ్యకాలంలో[1] నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉంది. విజయనగరం జిల్లాలో 15, 378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం, విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.