Remove ads

గిసెప్పి గరిబాల్డి (జూలై 4, 1807 - జూన్ 2, 1882) ఒక ప్రఖ్యాత ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. ఈయన ఈటలీ చరిత్రలో ముఖ్య పాత్ర పోషించాడు. కామిల్లో కావూర్, విక్టర్ ఇమ్మాన్యూల్ II, గిసెప్పి మాజినిలతో కలిపి ఈయనను కూడా ఇటలీ ఫాదర్స్ ఆఫ్ పాదర్స్ లాండ్ అని అంటారు

త్వరిత వాస్తవాలు గిసెప్పీ గారీబాల్డీ, జననం ...
గిసెప్పీ గారీబాల్డీ
Thumb
గిసెప్పీ గారీబాల్డీ
జననం(1807-07-04)1807 జూలై 4
నైస్, మొదటి ఫ్రెంచి సామ్రాజ్యం
మరణం1882 జూన్ 2(1882-06-02) (వయసు 74)
కాప్రియా, ఇటలీ రాజ్యం
మూసివేయి

గారిబాల్డి ఇటలీ దేశ ఏకీకరణలో ప్రముఖ పాత్రను పోషించాడు. ఇటలీ ఏకీకరణకు దారితీసిన అనేక యుధ్ధాలలో పాల్గొనాడు. అంతేగాక సైనిక దళాలకు స్వయంగా నాయకత్వం వహించాడు. .1848 లో మిలాన్ నగర తాత్కాలిక ప్రభుత్వం గారిబాల్డిని జనరల్ గా నియమించింది. 1849 లో రోమన్ రిపబ్లిక్ యుద్ధమంత్రిత్వ శాఖ ఇతనిని జనరల్‌గా నియమించింది. విక్టర్ ఇమ్మాన్యూల్ IIకు మద్దత్తుగా వెయ్యి మందితో ఒక సాహసయాత్రకు నాయకత్వం వహించాడు.

దక్షిణ అమెరికాలో ఐరోపా లలో అనేక పోరాటాలలో పాల్గొన్నందున ఈయనను "హీరో ఆఫ్ టు వరల్డ్స్" అని పిలుస్తారు. ఈ సాహసోపేతమైన చర్యల వలన ఈయన ఇటలీలోను విదేశాలలోను గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు. వీటికి ఆ సమయంలోని అంతర్జాతీయ మీడియా విపరీతమైన ప్రాచుర్యం కలిపించింది.. ఆనాటి గొప్ప మేధావులన విక్టర్ హ్యూగో, అలెగ్జాండర్ డ్యూమాస్, జార్జ్ సాండ్ అతనికి గొప్ప అభిమానులు. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు అతనికి చాలా విధాలుగా సహాయం పడ్డాయి.ఆపత్సమయంలో ఆర్థిక సైనిక సహాయాన్ని అందించి ఆదుకున్నాయి.

నిజం చెప్పాలంటే అతని వాలంటీర్లు యూనిఫాంగా ధరించిన ఎరుపు రంగు చొక్కాలతో అతని కథ ముడిపడి ఉంది.

Remove ads

ప్రారంభ సంవత్సరాలు

Thumb
నైస్ లోని ఈ ఇంట్లోనే గారిబాల్డి జన్మించాడు.

గిసెప్పి గారిబాల్డి నైస్ లో 1807 జూలై 4న జన్మించాడు. ఆ సమయంలో నైస్ ఫ్రాన్స్ పరిపాలన ఉంది.[1] ఆయన తల్లిదండ్రుల పేర్లు జియోవాని డొమినికో గారిబాల్డి, మారియా రోసా నికోలెట్టా రైమాండో[2] 1814 లో, వియన్నా కాంగ్రెస్ నైస్ ను సార్డీనియాకు చెందిన ఒకటవ విక్టర్ ఇమ్మాన్యూల్ కి ఇచ్చింది. అయితే విక్టర్ ఇమ్మాన్యూల్ II ఇటలీ ఏకీకరణలో ఫ్రెంచ్ వారి సహాయానికి ప్రతిఫలంగా కౌంటీ ఆఫ్ నైస్ ని సవాయ్ తో కలిపి ఫ్రాన్స్ కు ఇచ్చివేసాడు.

గరిబాల్ది కుటుంబం సముద్ర వ్యాపారం నిర్వహించేది. దీని ప్రభావం వలన గారీబాల్డి తన సముద్ర జీవితాన్ని ఆరంభించాడు. ఆయన నిజ్జార్డో ఇటాలియన్ అనే సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1832 లో మర్చెంట్ మెరైన్ కెప్టెన్ సర్టిఫికేట్ పొందాడు.

ఏప్రిల్ 1833లో గరిబాల్ది స్కూనర్ క్లోరిండా అనే నౌకలో నారింజ పళ్ళ సరకుతో రష్యాలోని తాగాన్ రోగ్ అనే రేవు పట్టణానికి చేరుకున్నడు. ఆయన అక్కడ పది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఓనెగ్లియాకు చెందిన గియోవాన్ని బట్టిస్టా కునియోను కలిసాడు. ఆయన చురుకైన ప్రవాస రాజకీయ నాయకుడు. అంతేగాక గిసెప్పి మాజినికి చెందిన యంగ్ ఇటలీ సభ్యుడు. గిసెప్పి మాజిని ఇటలీ ఏకీకణను గట్టిగా సమర్థించేవాడు. ఆయన రాజకీయ సామాజిక మార్పుతో కూడిన ఉదారవాద ఇటాలియన్ రిపబ్లిక్ ను కోరుకునాడు. గారీబాల్డీ ఈ సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఆయన తన మాతృభూమిని విముక్తం చేసి దాని ఏకీకరణకు తోడ్పడతానని ప్రమాణం చేసాడు. ఆయన ఆస్ట్రియా ఆధిపత్యం లేని ఇటలీని కోరుకున్నాడు.

Thumb
గారిబాల్డి మాజినీల మొదటి సమావేశం

నవంబరు 1833 లో జెనీవాలో, గరిబాల్ది గియుసేప్ మాజినిని కలుసుకున్నారు. దీనితో సుదీర్ఘమైన వారి స్నేహం మొదలైంది. తరువాత అది సమస్యాత్మకమైందిగా మారింది. తరువాత అతను కార్బోనరీ విప్లవ సంస్థలో చేరాడు, ఫిబ్రవరి 1834 లో పీడ్మొంట్ లో మాజిని ప్రారంభంచిన తిరుగుబాటులో తిరుగుబాటు పాల్గొన్నారు. కాని ఆ తిరుగుబాటు విఫలమైంది. తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఒక జెనీవా కోర్టు ఆయనికి మరణం శిక్ష విధించింది. దానితో గారిబాల్డి దేశం వదిలి మార్సెల్ కు పారిపోయాడు.

Remove ads

దక్షిణ అమెరికాలో గారిబాల్డి

గరిబాల్ది మొదట ట్యునీషియా చేరుకున్నాడు. చివరికి బ్రెజిల్ కు వెళ్ళాడు.అక్కడ కొత్తగా స్వతంత్రం పొందిన బ్రెజిల్ కు వ్యతిరేకంగా స్వతంత్ర దేశం కోసం రియో ​​గ్రాండే డో సుల్ రాష్ట్రం జరిపిన తిరుగుబాటులో పాల్గొన్నాడు. అక్కడ ఫారప్పొస్ అనే పిలవబడే గౌచో తిరుగుబాటుదారులలో చేరాడు. ఈ ఫారప్పొస్ తిరుగుబాటుదారులే 1839 అక్టోబరులో ఇంకొక బ్రెజిలియన్ ప్రావిన్ శాంటా కాతరినాను స్వతంత్ర రిపబ్లిక్ గా ప్రకటించేందుకు ప్రయత్నించారు. ఈ యుద్ధ సమయంలో ఆయన అనితా అనబడె అనా రిబెరో డ సిల్వాను కలుసుకున్నారు. అనిత రియో ​​పార్డో అతని నౌకలో అతనిని కలిసింది.ఆమె ఇంబిటుబా, లాగున వద్ద యుద్ధాలలో గారిబాల్దితో పాటు పోరాడింది..

1841 లో, గరిబాల్ది, అనితా గరిబాల్ది ఉరుగ్వేలోని మోంటెవీడియోకు చేరుకున్నారు. అక్కడ గారిబాల్డి వ్యాపారిగాను, స్కూల్మాస్టర్ గాను పనిచేసాడు. జంట తరువాత సంవత్సరంలో మోంటెవీడియోలో వారు వివాహం చేసుకున్నారు. వారికి నాలుగు పిల్లలు .[3] మెనిట్టో (1840 లో జననం), రోసిటా (1843 లో జననం), టేరెసితా (1845 లో జననం), రికియోట్టి (1847 లో జననం) . అనిత ఒక నైపుణ్యం గల అశ్వికురాలు. కనుక ఆమె గియుసేప్ తో కలసి గౌచో సంస్కృతిని అనిత దక్షిణ బ్రెజిల్, ఉరుగ్వే అంతటా వ్యాప్తి చేసింది. ఈ సమయంలో గారిబాల్డి తన ట్రేడ్మార్క్ దుస్తులైన ఎరుపు రంగు చోక్కా, పోంచో అనబడే ఊలు కంబళి, సాంబ్రెర్రో అనబడే మెక్సికన్ టొపీని ధరించడం మొదలుపెట్టాడు. వీటిని సాధారణంగా గౌచోలు ధరించేవారు.

Thumb
రియో గ్రాండే డోసుల్ యుధ్ధం సందర్భంగా లాస్ పాంటోస్ సరస్సు నుండి ట్రమాండహి సరస్సుకు పడవలను మోసుకు వెళుతున్న గారిబాల్డి అతని మనుషులు.

గరిబాల్ది ఉరుగ్వన్ అంతర్యుధ్ధంలో పాల్గొన్నాడు. దీనిలో 1842లో ఉరుగ్వే నావికా దళానికి నేతృత్వం వహించాడు. అంతేగాక ఒక ఇటాలియన్ లెజియన్ ను స్థాపించాడు. ఆయన తన దళాలను ఉరుగ్వే కొలోరాడోలు, ఆర్జెంటినా యూనిటార్లతో కూడిన సంకీర్ణానికి అనుకూలంగా వ్యవహరించాడు. కొలోరాడోలకు ఫ్రక్టోసొ రివెరా నాయకత్వం వహించాడు. ఈయన ఒకానొక సమయంలో బ్రెజిల్ ఉరుగ్వేను అక్రమించినపుడు బ్రెజిల్ ను సమర్థించాడు. వీరికి ఫ్రెంచి, బ్రిటీష్ సామ్రాజ్యాలనుంచి కొంత మద్దత్తు లభించింది. వీరు కన్సర్వేటివ్లతో కూడిన బాల్కనోలు, ఆర్జెంటినా ఫెడరల్స్ కు వ్యతిరేకంగా పోరాడారు. వీరిలో బాల్కనోలకు మాజీ ఉరుగ్వన్ అధ్యక్షుడు మాన్యుల్ ఓరిబె ఆర్జెంటినా ఫెడరల్స్ కు బ్యూనస్ ఎయిర్స్ నాయకుడు జువాన్ మాన్యుల్ డి రోసాస్ నాయకత్వం వహించారు.

దీనిలోనే ఇటాలియన్ లెజియన్ తన గుర్తుగా నల్ల జెండాను స్వీకరించింది. ఈ జెండా ఇటలీ గురించిన విచారాన్ని చూపిస్తుంది. మధ్యలోని అగ్ని పర్వతం వారి స్వదేశం యొక్క నిద్రాణమైన శక్తిని సూచిస్తుంది. సమకాలీన ప్రస్తావనలలో లేకపోయినప్పటికి ప్రముఖ చరిత్ర గ్రంథాలు ఉరుగ్వేలోనే మొదట ఈ లెజియన్ ఎరుపు చొక్కాను ధరించ ప్రారంభించింది అని ఒక్కాణించి చెప్పాయి. వీటిని మోంటెవీడియోలోని ఒక ఫ్యాక్టరీలో తయారుచేసారు. దీని వలన వారిని ఆర్జెంటినాలోని కబేళాకు ఎగుమతి చేస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. తరువాత ఈ ఎరుపు రొంగు చొక్కా గరిబాల్ది, అతని అనుచరులు చిహ్నంగా మారింది. 1842, 1848 మధ్య, గరిబాల్ది మోంటెవీడియో మీద దాడి చేసిన ఓరిబె నేతృత్వంలోని దళాలకు వ్యతిరేకంగా పోరాడి మోంటెవీడియోను శతృ వశం కాకుండా రక్షించాడు.

Thumb
1846లో ఉరుగ్వేలో జరిగిన శాన్ ఆంటోనియో యుద్ధం - దీనిలో గారిబాల్డి పాల్గొన్నాడు

1845నాటికి అతను కాలానియో డెల్ శాక్రమెంటో, ఇస్లా మార్టిన్ గార్సియా ఆక్రమించగలిగాడు. రియో ​​డి లా ప్లాటాపై ఆంగ్లో-ఫ్రెంచ్ దిగ్బంధం సమయంలోనే గాలేగౌచుపై వివాదాస్పదమైన దాడి చేసాడు. గెరిల్లా ఎత్తుగడలను ఉపయోగించి అతను 1846 లో సెర్రో, శాన్ ఆంటోనియో డెల్ శాంటో వద్ద జరిగిన యుద్ధాలలో రెండు విజయాలు సాధించగలిగాడు.

అయితే అతని మాతృభూమిలోని విషయాలు గరిబాల్దిలో ఆందోళనను కలిగించాయి .1846 లో జరిగిన పోప్ పియస్ IX ఎన్నిక దేశంలోనీ దేశం బయటగల ఇటాలియన్ దేశభక్తులలో ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించింది. పోప్ యొక్క ప్రారంభ సంస్కరణలు ఆయనను ఒక ఉదారవాదిగా నిరూపించాయి. Vincenzo Gioberti చెప్పినట్టుగా ఆయన ఇటలీని ఏకీకరణ దిశగా నడిపింస్తాడు అనిపించింది. పోప్ యొక్క ఆధునిక సంస్కరణలకి సంబంధించిన వార్తలు మోంటెవీడియో చేరుకునాయి, గరిబాల్ది ఈ క్రింది విధంగా ఒక లేఖ రాశాడు.

పోరాటానికి ఉపయోగించే ఈ చేతులను పవిత్రత పొప్ అంగీకారించగలిగితే మేము కృతజ్ఞతాపూర్వకంగా వాటిని ఆయన సేవకు అంకితం చేస్తాను, ఆయన చర్చి, జన్మ భూమి యొక్క సంక్షేమానికి పాత్రుడు . పోప్ పియస్ IX యొక్క విముక్తి పోరాటంలో మేము మా రక్తాన్ని చిందించటానికి అవకాశం ఇస్తే నేను నా అనుచరులు ఆనందిస్తాము (అక్టోబర్ 12, 1847)[4]

ప్రవాసంలో ఉన్న మాజిని కూడా పియస్ IX ప్రారంభ సంస్కరణలను ప్రశంసించాడు. 1847 లో ద్వీపకల్పం విముక్తి కోసం అతని ఇటాలియన్ లెజియన్ యొక్క సేవలకు గాను గరిబాల్దికి బెడినిలోని రియో ​​డి జనీరో వద్ద అపోకలిప్ట్ నున్కియో అనబడే పొప్ రాయబారి బిరుదు ఇవ్వడం జరిగింది. అప్పుడు జనవరి 1848 లో పాలెర్మోలో విప్లవం మొదలైన వార్తలు ఇటలీలో మిగిలిన ప్రాంతాల్లో విప్లవాత్మక ఆందోళనలు గరిబాల్ది ఇంకా తన లెజియన్లోని అరవై మంది సభ్యులను ఇంటికి తిరిగిరావటానికి ప్రోత్సహించాయి.

Remove ads

ఇటలీ తిరిగి రావటం మరల రెండవ ప్రవాసం

Thumb
గారిబాల్డి రోమన్ ముట్టడి

గరిబాల్ది 1848 జరిగిన విప్లవాల సమయంలో మధ్య ఇటలీ తిరిగి వచ్చాడు, సార్దీనియాకు రాజైన చార్లెస్ ఆల్బర్ట్ తన సేవలు అందిచడానికి ముందుకువచ్చాడు. ఆ సమయంలో రాజ్యం ఉదారవాదానికి కొంతవరకు మొగ్గుచూపింది కానీ వారు అతనిని ఈర్ష్యతోను అపనమ్మకంతోను చూసారు. పీడ్మాంటీల చేత నిరాదరించబడిన తరువాత అతను, అతని అనుచరులు లోమ్బార్దికి వెళ్ళిపోయారు. అక్కడ ఆస్ట్రియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇది మిలన్ తాత్కాలిక ప్రభుత్వం సహాయం అందించారు, విఫలమైన మొదటి ఇటాలియన్ స్వాతంత్ర్య సమరం జరిగిన సమయంలో అతను లుయినో, మొరాజ్జెనెల వద్ద రెండు చిన్న విజయాలను తన లెజియన్ కు సాధించిపెట్టాడు.

Thumb
1849లో రోమ్ రక్షణకు పోరాడుతున్న గారిబాల్డి అతని భార్య అనిత

1849 మార్చి 23న నొవారా వద్ద పీడ్మాంటీల భారీ ఓటమి తర్వాత, గరిబాల్ది రోమ్ వెళ్ళి అక్కడ పాపల్ స్టేట్స్ లో కొత్తగా ఏర్పడ్డ రిపబ్లిక్ కు మద్దతు ప్రకటించాడు, కానీ ఈ విప్లవాన్ని అణచడానికి లూయిస్ నెపోలియన్ (భవిష్యత్తు నెపోలియన్ III) ఒక ఫ్రెంచ్ దళాన్ని పంపించాడు. మాజిని ప్రోద్బలం వల్ల, గరిబాల్ది రోమ్ రక్షణకు నేతృత్వం వహించాడు. వెల్లెట్రీ సమీపంలో జరిగిన పోరాటంలో, అకిల్లే కాంటాని అతని ప్రాణాన్ని కాపాడాడు. Mentana వద్ద జరిగిన యుద్ధంలో కాంటాని మరణించిన తరువాత గరిబాల్ది కాంటాని ఇల్ వాలంటారియో అనే నవలను రాశాడు.

1849 ఏప్రిల్ 30న గరిబాల్ది నేతృత్వంలోని రిపబ్లికన్ సైన్యం తనకన్నా చాలా పెద్దదైన ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించగలిగింది. తరువాత ఫ్రెంచ్ సైన్యానికి సహాయంగా మరిన్ని దళాలు వచ్చాయి, దీనితో జూన్ 1 న రోమ్ యొక్క ముట్టడి ప్రారంభమైంది. రిపబ్లికన్ సైన్యం యొక్క ప్రతిఘటిమ్చినప్పటికీ, ఫ్రెంచ్ జూన్ 29 న ఆధిపత్యం చూపగల్గింది. జూన్ 30 న రోమన్ అసెంబ్లీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. వారు మూడు రకాల ఆప్టన్ల గురించి చర్చించారు. అవి లొంగిపోవటం, వీధుల్లో పోరాటం కొనసాగించటం, లేదా రోమ్ నుండి పారిపోయి అపెన్నైన్ పర్వతాల నుండి ప్రతిఘటన సాగించటం, గరిబాల్ది మూడవ ఎంపికకు అనుకూలంగా ఒక ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఆపై ఈ విధంగా అన్నారు:[5] మేము ఎక్కడైతే ఉంటామో అక్కడే రోమ్ ఉంటుంది.

Thumb
శాన్ మారినోకు పారిపొతున్నగియుసేప్, అనితా గరిబాల్ది .

జూలై 1 న శాంతి ఒప్పందం కుదుర్చుకోబడింది. జూలై 2 న గరిబాల్ది తన 4, 000 దళాలతో రోమ్ ను వదిలి వెళ్ళిపోయాడు. ఫ్రెంచ్ సైన్యం 3 జూలైన రోమ్ లో ప్రవేశించి హోలీ సీ అనబడే పవిత్రమైన పోప్ యొక్క సర్వోన్నత అధికారాన్ని తిరిగి స్థాపించింది. గరిబాల్ది, అతని దళాలను ఆస్ట్రియన్ ఫ్రెంచ్, స్పానిష్, నియాపోలిటన్ దళాలు వెంటాడి వేటాడాయి. దానితో గరిబాల్ది అతని మనుష్యులు వెనిస్ ను చేరుకోవలనే ఉద్దేశంతో ఉత్తరం వైపుగా పారిపోయారు. ఆ సమయంలో వెనీషియన్లు ఆస్ట్రియన్ ముట్టడి ఎదిర్కొంటున్నారు. వారు చరిత్రలో నిలిచిపోదగ్గ ఒక ప్రయాణం తరువాత గరిబాల్ది శాన్ మారినోను చేరుకన్నాడు. ఆ సమయయంలో అతనితో పాటు ఇంకా 250 మంది అతని అనుఛరులు అనుసరిస్తూనే ఉన్నారు. అక్కడ వారు అక్కడ కొంతకాలం ఆశ్రయాన్ని పొందారు. ఇలా వారు పలాయనంలో సాగిస్తున్న సమయంలో అనిత కొమాచ్చి సమీపంలో మరణించింది. ఆ సమయంలో ఆమె ఐదవసారి గర్భాన్ని ధరించి ఉంది.

అమెరికా, పసిఫిక్ లో గారిబాల్డి

గరిబాల్ది చివరికి లా స్పెజియా సమీపంలో పోర్టోవెనెరాకు చేరుకోవడంలో సఫలం అయ్యాడు. కానీ పీడ్మాంటీస్ ప్రభుత్వం ఒత్తిడి వలన అతను దేశాన్ని వదిలి వలస వెళ్ళవలసివచ్చింది.

అయన టాంజిర్ కు వ్ర్ళ్ళిపోయాడు. అక్కడ కార్పెంట్టో ఫ్రాన్సిస్కో అనే ఒక సంపన్న ఇటాలియన్ వ్యాపారిని కలిసాడు. కార్పెంట్టో గారిబాల్డిని అతని సహచరులు కొంతమందిని కలిసి ఒక వ్యాపారి నౌకను కొనుగోలుచేయమని, దానికి గరిబాల్ది నాయకత్వం వహించాలని సూచించాడు. గరిబాల్ది తాను ఆ సమయంలో తన రాజకీయ లక్ష్యాలను సాధించలేనని తెలుసుకున్నాడు. అతను కనీసం తన సొంత అవసరాల కోసం అయినా సంపాదించాలి అనుకున్నాడు.[6]

కాని ఓడను యునైటెడ్ స్టేట్స్ లో కొనుగోలు చేయవలసి ఉంది, కాబట్టి గరిబాల్ది 1850 జూలై 30 నాటికి న్యూయార్క్ కు చేరుకన్నాడు. అక్కడ అతను కొంతమంది ఇటాలియన్ స్నేహితుల దగ్గర ఉన్నాడు. వారిలో బహిష్కరింపబడిన విప్లవకారులు కూడా ఉన్నారు. అయితే ఓడ కొనుగోలు కోసం ధనం ఇంకా సమకూరలేదు.

Thumb
న్యూయార్క్ లో గారిబాల్డి నివసించిన ఇంటిని గారిబాల్డి - మెయుక్కి మ్యూజియంగా మార్చారు.

పరిశోధకుడయిన అయిన ఆంటోనియో మెయుక్కి స్తాటేన్ ద్వీపంలోని తన కొవ్వొత్తుల కర్మాగారంలో గరిబాల్దికి ఉద్యోగం ఇచ్చాడు.[7] స్తాటేన్ ద్వీపంలో ఆయన నివసించిన ఇల్లు యూఎస్ కు చెందిన చారిత్రిక ప్రాంతాలకు సంధించిన నేషనల్ రిజిస్టర్ లో నమోదైఉంది. దీనిని గరిబాల్దికి జ్ఞాపకచిహ్నంగా సంరక్షించ బడుతోంది.గరిబాల్ది ఇది సంతృప్తిగా అనిపించలేదు లేదు. అందుకని ఏప్రిల్ 1851 లో అతను న్యూయార్క్ ను వదిలి కార్పెంట్టో ఫ్రాన్సిస్కోతో కలిసి మధ్య అమెరికాకు వెళ్ళాడు. అక్కడ కార్పెంట్టోతన వ్యాపార కార్యకలాపాలను ఆరంభించాడు, వారు మొదట నికరాగువా వెళ్ళారు. ఆపై ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రయాణంలో గరిబాల్ది Carpanetto స్నేహితుడు గానే ఉన్నాడు కాని వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకోలేదు. కావున వారికి గిసెప్పి పేన్ అను పేరు వచ్చింది.[6]

1851 చివరిలో Carponetto గరిబాల్దితో కలసి పెరులోని లిమాకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఒక ఓడకు సరిపోయే తన వస్తువులను తీసుకురావలసి ఉంది. మార్గంలో అండీయన్ తిరుగుబాటు నాయకురాలైన మాన్యుల సాయెంజా నుండి పిలుపువచ్చింది.లిమాలో గరిబాల్ది సాదరంగా స్వాగతించారు. అక్కడ స్థానిక ఇటాలియన్ వ్యాపారి అయిన పియట్రో డెనెగ్రి కార్మెన్ అనే పేరు గల తన ఓడకు నాయకత్వం వహించవలసిందిగా కోరాడు. ఆ నౌక వ్యాపారం కోసం ఫసిఫిక్ సముద్రం గుండా ప్రయాణించాల్సి ఉంది. గరిబాల్ది నాయకత్వంలో ఆ నౌక గువానో ఆనే ఎరువుల లోడ్ కోసం చించా ద్వీపాలను కార్మెన్ చేరుకుంది. తరువాత 1852 జనవరి 10న పెరు నుండి బయలుదేరి వారు ఏప్రిల్ లో చైనాలోని కాంటన్ రేవును చేరుకున్నాడు.[6]

అమోయ్ మనీలా కూడా వెళ్ళివచ్చిన తరువాత గరిబాల్ది హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ ద్వారా ప్రయాణించి పెరుకు కార్మెన్ ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ ప్రయాణంలో ఆయన ఆస్ట్రేలియా దక్షిణ తీరం చుట్టూ తిరిగి రావలసి వచ్చింది, ఈ ప్రయాణంలో ఆయన బాస్ స్ట్రైట్ లోని మూడు హమాక్ ద్వీపాలను సందర్శించాడు.[6] గరిబాల్ది కార్మెన్ యొక్క రెండవ సముద్ర ప్రయాణంనికి కూడా నాయకత్వం వహించాడు. ఈ ప్రయాణంలో ఆయన చిలీ నుండి రాగి, ఉన్నిని కేప్ హార్న్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ కు తీసుకువెళ్ళవలసి వచ్చింది. గరిబాల్ది మొదట బోస్టన్ చేరుకునాడు. తరువాత న్యూయార్క్ కు వెళ్ళాడు. అక్కడ అతను Denegri నుండి నిరసనతో కూడిన లేఖను అందుకున్నాడు. దానితో ఆయన ఓడ నాయకత్వానికి రాజీనామా చేశాడు.[6] మరొక ఇటాలియన్, కెప్టెన్ ఫాగిరి ఓడను కొనుగోలు చేయడానికి అమెరికా సంయుక్త రాష్టాలకు వచ్చాడు. అతను గరిబాల్దినితన ఓడను యూరోప్ తీసుకువెళ్ళడానికి నియమించుకున్నాడు. ఫాగిరి, గరిబాల్ది బాల్టిమోర్ లో కామన్వెల్త్ అనే నౌకను కొనుగోలు చేసారు.[7] గరిబాల్ది నవంబరు 1853 లో చివరిసారిగా న్యూయార్క్ నుంచి బలుదేరి వెళ్ళిపోయాడు.ఆయన కామన్వెల్త్ లో లండన్ కు చేరుకున్నాడు. తరువాత ఓడకు కావలసిన బొగ్గు కోసం టైనే నది ఒడ్డున గల న్యూకాజిల్ కు చేరుకున్నారు.[6]

టైనెసైడ్ లో గారిబాల్డి

కామన్వెల్త్ 1854 మార్చి 21 న టైనెసైడ్ కు చేరింది. గరిబాల్ది టైన్సైడ్ లో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. కాబట్టి అతనికి స్థానిక పనివారినుంచి ఘనస్వాగతం లభించింది. అయితే న్యూకాజిల్ కోరన్ట్ చెప్పినదాన్ని బట్టి అతను నగరంలో ఉన్నతాధికారులతో భోజనం చేయవలసిందిగా అందిన ఆహ్వానాన్ని నిరాకరించాడు అని తెలుస్తుంది. గరిబాల్ది టైన్సైడ్ న దక్షిణ షీల్డ్స్ఒక నెల ఉన్నాడు. అతను ఏప్రిల్ 1854 చివరిలో బయలుదేరాడు, ఆయన అక్కడ ఉన్న సమయంలో ఒక లిఖించిన ఖడ్గాన్నిగరిబాల్దికి బహుకరించారు. తరువాత అతని మనుమడు ఆ ఖడ్గంతోనే బ్రిటిష్ తరుపున బోర్ యుద్ధంలో పాల్గొన్నాడు.[8] తరువాత అతను మే 1854న ప్రవాసంలో జెనోవాకు చేరుకున్నాడు. దీనితో తన ఐదు సంవత్సరాల ప్రవాస జీవితం ముగిసింది.[6]

Remove ads

రెండవ ఇటాలియన్ స్వాతంత్ర్య యుద్ధం

Thumb
ఆల్ఫ్స్ పర్వతాలలో గారిబాల్డి

గరిబాల్ది 1854 లో ఇటలీకి మరల తిరిగి వచ్చాడు. అతని సోదరుని మరణం తరువాత అతనికి కొంత ధనం సంక్రమించింది. దానిని ఉపయోగించి కాప్రియో ద్వీపంలోని సగ భాగాన్నికొనుగోలు చేసాడు. కాప్రియో ద్వీపం సార్దీనియా ఉత్తర భాగంలో ఉంది. అతను కొంతకాలం వ్యవసాయం చేస్తూ కాలం గడిపాడు. 1859 లో రెండవ ఇటాలియన్ స్వాతంత్ర్య యుద్ధం (దీనిని ఆస్ట్రియా-సార్డీనియన్ యుద్ధం అని కూడా పిలుస్తారు) ప్రాంభమైంది. సార్డీనియన్ ప్రభుత్వంలోని అంతర్గత ప్లాట్ల వలన ఈ యుధ్ధం ప్రాంభమైంది. ఈ యుధ్ధంలో గరిబాల్ది సార్డీనియన్ ప్రభుత్వం చేత మేజర్ జనరల్ గా నియమించబడ్డాడు. హంటర్స్ ఆఫ్ ఆల్ప్స్ అనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేసాడు. అప్పటినుండి గరిబాల్ది మాజిని యొక్క రిపబ్లికన్ వలన ఇటలీ విముక్తి కలుగుతుంది అనే నమ్మకాన్ని వదిలివేసాడు. పీడ్మాటీల రాచరికం మాత్రమే ఇది సాధ్యమౌతుందని నమ్మాడు.

గరిబాల్ది తన వాలంటీర్లతో సహాయంతో వారెస్, కోమో, ఇతర ప్రదేశాలలో ఆస్ట్రియన్లు పై విజయాలు సాధించాడు.

కీలకమైన ఫ్రెంచ్ సైనిక సహాయం కృతజ్ఞతగా గరిబాల్ది తన సొంత నగరమైన నైస్ ను (ఇటాలియన్ లో నిజ్జా) ఫ్రాన్స్ కు ఇవ్వడం జరిగినది, దీనిని గరిబాల్ది తీవ్రంగా గర్హించాడు. ఏప్రిల్ 1860 లో, ట్యూరిన్ వద్ద గల పార్లమెంట్ లో నైస్ కు చెందిన డిప్యూటీగా అతను కౌంటీ అఫ్ నైస్ ను ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ నెపోలియన్ ఇచ్చివేసే విషయంలో కావూర్ తో తీవ్రస్థాయిలో వాదించడం జరిగింది. తరువాత సంవత్సరాలలో గరిబాల్ది నిజ్జార్డో ఇటాలియన్ల అనే ఇతర ఆందోళనకారులతో కలిసి తన నిజ్జాలో ఇటాలియన్ ఇర్రెండెంటిసమ్ ను ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. వీరి వలన 1872 లో అల్లర్లు తలెత్తాయి.

Remove ads

1860లో ఉద్యమం

Thumb
1860లో సాహస యాత్రకు బయలుదేరుతున్న గారిబాల్డి

1860 జనవరి 24లో గరిబాల్ది 18 ఏళ్ళ గిసెప్పిని రైమాండీని వివాహం చేసుకున్నాడు. ఈమె లాంబార్డీలోని ఒక ఉన్నత వంశానికి చెందినది. అయితే వివాహ వేడుక ముగిసిన తరువాత ఆమె తాను మరొక వ్యక్తి వలన గర్భవతిని అయ్యాను అని చెప్పింది. దానితో గరిబాల్ది ఆమెను అదే రోజు వదిలివేసాడు.[9]

1860 ఏప్రిల్ ప్రారంభంలో రెండు సిసిలీస్ రాజ్యంలోని మెస్సినా పాలెర్మో నగరాలలో తిరుగుబాట్లు తలెత్తాయి. దీని వలన గరిబాల్ది మంచి అవకాశం లభించింది. అతను ఒక వేయి మందిని స్వచ్ఛంద సైనికులను సమీకరించాడు ( వీరిలో ఉత్తర ఇటలీలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరిని ఐ మిల్లె (వేయి మంది) అంటారు. వీరు రెడ్ షర్ట్స్ అని ప్రసిధ్ధి చెందారు), మే5 సాయంత్రాన వీరు ఫిమాంటె, లాంబార్డో అను పేరు గల రెండు ఓడలలో జెనోవా నుండి బయలుదేరారు. ఈ నౌకలు మే 11 న, సిసిలీ పశ్చిమ తీరాన గల మర్సాలా వద్ద తీరాన్ని చేరాయి.

Thumb
కలాటఫిమి యుధ్ధం

స్థానిక తిరుగుబాటుదారులకు చెందిన చెదురుమదురు దళాలతొతో అతని సైనికుల సంఖ్య పెరిగిపోయింది, మే 15 న గరిబాల్ది కలాటఫిమి దగ్గర కొండ మీద 800 వాలంటీర్లతో 1500 గల శత్రు దళాన్ని ఓడించగలిగాడు. సంప్రదాయ విరుధ్ధమైన వ్యూహాన్ని ఉపయోగించి విజయం సాధించాడు. దీని ప్రకారం కొండ ఎక్కిన తరువాత బాయ్ నెట్ ఛార్జ్ చేయాలి. శత్రువులు గడ్డి దిబ్బలపై స్థావరాలు ఏర్పరుచుకున్నారని అతనికి తెలిసింది. ఈ గడ్డి దిబ్బలే తన అనుచరులు దాగిఉండటానికి పనికివచ్చాయి. పాలెర్మో, మిలాజ్జో, వాల్టర్నో వద్ద ఘర్షణలతో పోల్చుకుంటె చిన్నది అయినప్పటికి ఈ యుద్ధం ద్వీపంలో గరిబాల్ది యొక్క అధికారాన్నిఏర్పాటుచేయటానికి కీలకమైనది. ఒక అనుమానా స్పదమైన నిజ వృత్తాంతం ప్రకారం గరిబాల్ది తన లెఫ్టినెంట్ నినో బిక్సియోకు ఇక్కడ మనం ఇటలీని తీసురావాలి లేకపోతే చనిపోవాలి అని చెప్పాడు అని చెపుతుంది. వాస్తవానికి నియాపోలిటన్ దళాలు తప్పుగా మార్గనిర్దేశనం చేయబడ్డాయి. అంతేగాక చాలామంది ఉన్నత అధికారులను కొనివేయటం జరిగింది. తరువాత రోజు అతను విక్టర్ ఇమ్మాన్యూల్ II పేరు మీద తనను తాను సిసిలీ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. అతను ద్వీపం రాజధాని అయిన పాలెర్మో వైపుగా ముందుకి కదిలి మే 27 న నగరాన్నిముట్టడిడించాడు. అక్కడ ఉండే సైనిక శిబిరానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పలువురు నగర నవాసులు మద్దతు అతనికి లభించింది, కాని నగరం వశం కావడానికి ముందే, నియాపోలిటన్ దళాలకు సహాయంగా ఇతర దళాలు వచ్చాయి. వారు నగరం పూర్తిగా శిథిలమయ్యేదాకా ఫిరంగులతో దాడి చేసారు. ఈ సమయంలో, ఒక బ్రిటీష్ అడ్మిరల్ ఒకరు జోక్యం చేసుకుని ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చాడు. దీని ప్రకారం నియాపోలిటన్ రాజ దళాలు, యుద్ధనౌకలు నగరాన్ని వదిలి వెళ్ళిపోయాయి.

Thumb
నేపుల్స్లో ప్రవేశిస్తున్న గారిబాల్డికి స్వాగతం పలుకుతున్న ప్రజలు

గరిబాల్ది అప్పటికి ఒకే ఒక విజయాన్ని సాధించాడు. అతను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని, ఇటాలియన్ల ముఖస్తుతి పొందగలిగాడు. తన పరాక్రమం గల భయం వలన నియాపోలిటన్ కోర్టులో అనుమానం, గందరగోళం, ఆదుర్దాను రేకెత్తించాయి. ఆరు వారాల తరువాత, అతను ద్వీపం యొక్క తూర్పు భాగంలో ఉన్న మెస్సినాకు తన దళాలను నడిపించాడు. అక్కడ జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో కష్టసాధ్యమైన విజయాన్ని సాధించాడు. జూలై చివరికి సిటాడెల్ ను స్వాధీనం చేసుకున్నాడు.

Thumb
1860 అక్టోబరు 29న టియానో బ్రిడ్జ్ వద్ద విక్టర్ ఇమ్మాన్యుయేల్ని కలసిన గారిబాల్డి.

సిసిలీ ఆక్రమించిన తరువాత, అతను బ్రిటిష్ రాయల్ నేవీ సహాయంతో మెస్సినా జలసంధి దాటి, ఉత్తర ఇటలీకి చేరుకున్నాడు. గరిబాల్ది యొక్క పురోగతి ప్రతిఘటనలాగా కాక ఒక వేడుకలా జరిగింది, సెప్టెంబరు 7 న అతను రైలులో ప్రయాణించి నేపుల్స్ రాజధాని నగరంలో ప్రవేశించాడు. అయితే నేపుల్స్ గారిబాల్డి స్వాధీనం ఛెసుకున్నప్పటికి నియాపోలిటన్ సైన్యం ఓడించలేకపోయాడు. 24, 000 మంది వాలంటీర్లతో కూడిన గరిబాల్ది సైన్యం సెప్టెంబరు 30 న వాల్టర్నో వద్ద జరిగిన యుద్ధంలో 25, 000 మంది గల నియాపోలిటన్ ఆర్మీ పూర్తిగా ఓడించడంలో విఫలమైంది. ఈ యుద్ధం ఆయన పోరాడిన వాటిల్లో అతిపెద్దది, కానీ పీడ్మాట్ సైన్యం వచ్చిన తరువాతనే వారికి పూర్తి విజయం లభించింది. దీని తరువాత రోమ్ తన సైన్యాన్ని నడిపించాలన్న వరకు గరిబాల్ది యొక్క ప్రణాళికలు పీడ్మాంటీల ఒత్తిడి వలన ఆపివేయబడ్డాయి, సాంకేతికంగా తన మిత్రదేశం ఫ్రాన్స్ తో యుద్ధం చేయవలసివస్తందన్న భావనతో పీడ్మాంటీలు దీనికి ఇష్టపడలేదు. ఆ సమయంలో పొప్ కు రక్షణగా ఫ్రాన్స్ దళాలు ఉన్నాయి. కానీ గరిబాల్దిని చేరుకునేందుకు దక్షిణ దిశగా జరిగిన మార్చిలో పీడ్మాంటీలు పోప్ యొక్క భూభాగాలను చాలా వరకు ఆక్రమించుకున్నారు. కాని అవి ఉద్దేశపూర్వకంగానే పొప్ రాజధాని అయిన రోమ్ పై దాడి చేయలేదు. గరిబాల్ది దక్షిణాన తాను ఆక్రమించిన అన్ని ప్రాంతాలను పీడ్మాంటీల పరంచేసి తాను కాప్రియాకు వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా తన పనిని ఆపివేసాడు. కొందరు ఆధునిక చరిత్రకారుల ఆభిప్రాయం ప్రకారం గరిబాల్డి తాను ఆక్రమించిన అన్ని ప్రాంతాలను పీడ్మాంటీల పరంచేయటం అనేడీ అతనికి రాజకీయ ఓటమిగా భావిస్తారు, కానీ అతను ఇటాలియన్ ఐక్యత పీడ్మాంటీల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది అని నమ్మాడు. టియానో వద్ద గరిబాల్ది, విక్టర్ ఇమ్మాన్యూల్ II మధ్య సమావేశం ఆధునిక ఇటాలియన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అంశం, కానీ ఈ సమావేశం కచ్చితంగా ఎక్కడ జరిగింది చెప్పలేకపోవటం వలన ఇది వివాదాస్పదం అయి కొంతవరకు దీని ప్రాధాన్యత తగ్గింది.

Remove ads

అనంతర పరిణామాలు

Thumb
కాప్రియాలో గారిబాల్డి

గరిబాల్ది సార్డీనియన్ ప్రధాన మంత్రి కౌంట్ ఆఫ్ కావూర్ అయిన కామిల్లో బెంసొ అంటే అసలు పడేదికాదు. ఒక దశలలో, అతను కావూర్ యొక్క ప్రాగ్మాటిజాన్ని, రియల్ పొలిటికాని కూడా తిరస్కరించాడు, అంతేగాక అతనికి అంతకు ముందు సంవత్సరం తన సొంత నగరంమైన నైస్ ఫ్రెంచ్ కు దారపొయడం వలన అతనికి కామిల్లోపై వ్యక్తిగతకక్ష కూడాఉన్నది. మరోవైపు, ఆయన పీడ్మాంటీల రాజరికం వైపు ఆకర్షింతుడాయ్యాడు. అతని అభిప్రాయంలో ఇటలీని వారు మాత్రమే చేయగలరు అని భావించాడు. 1860 అక్టోబరు 26 న టీనో వద్ద విక్టర్ ఇమ్మాన్యూల్ II, గరిబాల్ది మధ్య జరిగిన తన ప్రసిద్ధ సమావేశంలో గరిబాల్ది విక్టర్ ఇమ్మాన్యూల్ IIను ఇటలీ రాజుగా అభినందించాడు. తన చేతిని పైకిఎత్తి అతనికి స్వాగతం పలికాడు. నవంబరు 7 న రాజుతో కలసి నేపుల్స్ లో తన గుర్రంపై స్వారీచేసాడు. తరువాత గరిబాల్ది రాళ్ళ ద్వీపమైన కాప్రియాకి వెళ్ళిపోయాడు. తన సేవలకు ప్రతిఫలాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు,

అక్టోబరు 5 న గరిబాల్ది అంతర్జాతీయ లెజియన్ ఏర్పాటు చేసాడు. దీనిలో ఫ్రెంచ్, స్విస్ జర్మన్, వివిధ ఇతర దేశలకు చెందిన దళాలు ఉన్నాయి. వీరి ఉద్దేశం కేవలం ఇటలీని విముక్తం చేయటమే కాదు వారి స్వదేశలను కూడా విముక్తి చేయడం, వీరి నినాదం "ఆల్ప్స్ నుండి అడ్రియాటిక్ వరకు విముక్తం చేద్దాం" ఏకీకరణ ఉద్యమకారుల చూపు రోమ్, వెనిస్ నగరాలపై పడింది. మాజిని ఈ రాజరిక ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగటం వలన అసంతృప్త చెందాడు ఒక గణతంత్ర కోసం ఆందోళన కొనసాగించారు. గరిబాల్ది రాజుగారి నిష్క్రియాపరత్వానికి విసుగుచెందాడు నానాటికి తాను అనుభవించిన చీత్కారాలకు ఆగ్రహించాడు. అంతేగాక ఒక కొత్త కార్యాన్ని చేయ తలపెట్టాడు. ఈ సారి ఇది పాపల్ రాజ్యాలకు సంబంధించింది.

1861 లో అమెరికన్ అంతర్యుధ్ధం గరిబాల్ది అధ్యక్షుడు అబ్రహం లింకన్ కు సంభవించినప్పుడు గారిబాల్డి తన సేవలను అందించటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. గారిబాల్డికి యూఎస్ అర్మీలో మేజర్ జనరల్ గా కమిషన్ ను ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన లేఖను 1861 జూలై 17 అమెరికా సంయుక్త రాష్టాల కార్యదర్శి విలియం హెచ్ సెవార్డ్ బ్రస్సెల్స్ లో ఉన్న విలియం హెచ్ ఎస్ సాన్ ఫోర్డ్కు మంత్రికి పంపాడు.[10]

ఇటాలియన్ చరిత్రకారుడు పెటాక్కో చెప్పిన దాని ప్రకారం, " గారిబాల్డి ఈ లింకన్ యొక్క ప్రతిపాదనను అంగీకరించడానికి సిద్ధపడ్డాడు. కాని ఒక షరతును విధించాడు. అది ఏమిటంటే యుద్ధం ముగిసిన తరువాత బానిసత్వాన్ని రద్దు చేస్తానని ప్రకటించాలని కోరాడు. కానీ ఈ సమయంలో ఇటువంటి ప్రకటన చేస్తే యవసాయ రంగం సంక్షోభం కలుగుతుందనే భయంతో లింకన్ దీనికి అంగీకరించలేక పోయాడు".[11]

Remove ads

రోమ్ కు వ్యతిరేకంగా దండయాత్ర

Thumb
ఆస్పర్మాంటి పర్వతాలలో గాయపడిన గారిబాల్డి

పోప్ పవిత్ర భూభాగానికి ఎదురైన సవాలును ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కుల ద్వారా గొప్ప అపనమ్మకంతో చూచారు. కాని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ III రోమ్ లో ఒక ఫ్రెంచ్ దళాన్ని రోమ్ కు రక్షణగా ఉంచాడు. ఈ విధంగా ఇటలీ నుండి రోమ్ స్వతంత్రానికి హామీ ఇచ్చాడు. విక్టర్ ఇమ్మాన్యూల్ పాపల్ రాజ్యాల మీదికి దాడికి దిగితే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుంటుందని భయపడ్డాడు. అందువలన రోమ్ పై జరిగేదాడిలో తన అనుచరులు పాల్గొనేందుకు ఆయన అంగీకరించ లేకపోయాడు. ఏదేమైనా, గరిబాల్ది తనకు ప్రభుత్వ రహస్య మద్దతు లభింస్తుంది అని నమ్మాడు.

జూన్ 1862 లో అతను జెనోవా నుండి సముద్ర మార్గాన పయనమయ్యాడు. పాలెర్మో వద్ద తీరాన్ని చేరాడు. రోమ్ లేదా మరణం నినాదంతో జరగబోయే దండయాత్రకు స్వచ్ఛంద కార్యకర్తలను సేకరించడానికి ప్రయత్నించాడు. ఔత్సాహికులైన కొంతమంది అతనితో చేరారు. ప్రధాన భూభాగానికి చేరాలనే ఉద్దేశంతో గారిబాల్డి మెస్సినాకు పయనమయ్యాడు. అతను మెస్సినాకు వచ్చినప్పుడు అతని వద్ద రెండు వేల మంది గల సైనిక బలం ఉంది. కానీ అక్కడ ఉన్న రక్షక దళం రాజు పట్ల విశ్వాసం చూపించింది. ఆయన సూచనలకు అనుగుణంగా వారి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దానితో గారిబాల్డి దక్షిణ దిశగా మరలాడు. కాటాలియా నుండి సముద్ర మార్గాన పయనమయ్యాడు. అక్కడ గరిబాల్ది తాను రోమ్ లో విజేతగా ప్రవేశిస్తానని లేదా గోడల కింద నశించిపోతానని ప్రకటించాడు. అతను ఆగస్టు 14 న మెలిట్టాలో లాండ్ అయ్యాడు. మరోసారి కాలాబ్రియన్ పర్వతాలు లోకి మార్చి చేసారు.

Thumb
ఆస్పర్మాంటి వద్ద గాయపడిన తరువాత గారిబాల్డి

ఇటాలియన్ ప్రభుత్వం ఈ ప్రయత్నానికి సహాయ పడటానికి పూర్తిగా తిరస్కరించింది. ఇటాలియన్ జనరల్ ఎన్రికో సియాల్డిని ఈ స్వచ్ఛంద దళాలకు వ్యతిరేకంగా, కల్నల్ పల్లావికినో నేతృత్వంలో ఒక రెగ్యులర్ సైనిక విభాగాన్ని పంపాడు. ఆగస్టు 28 న రెండు దళాలు మిట్టపల్లాలతో కూడిన అస్ప్రామోంటే పర్వతాల దగ్గర కలుసుకున్నారు. రెగ్యులర్ సైనికులలో ఒకడు మొదటి షాట్ ను కాల్చాడు. దీని తరువాత అనేక వ్యాలీలు కాల్చడం జరిగింది. దీని వలన కొద్దిమంది కార్యకర్తలు మరణించారు. ఇటలీ రాజ్యానికి చెందిన తోటి సైనికులపై తన అనుచరుల కాల్పులు జరపటానికి గరిబాల్ది ఒప్పుకోలేదు. దీనితో ఈ పోరాటం త్వరగానే ముగిసింది. గారిబాల్డికి పాదాలకు ఒక షాట్ తగలటం వలన ఆయన గాయపడ్డాడు. గరిబాల్దితో సహా చాలామంది వాలంటీర్లు బందీలుగా దొరికారు.

దీనివలన గారిబాల్డి ఫు ఫెరిటో (గారిబాల్డి గాయపడ్డాడు) అనే ప్రసిద్ధమైన నర్సరీ పద్యం పుట్టింది. ఇది నేటికి ఇటలీ దేశములో గల బాల బాలికలచే ఆలపించబడుతున్నది.

Remove ads

ఆస్ట్రియాతో ఆఖరి యుధ్ధం, ఇతర సాహసాలు

1866లో గారిబాల్డి మరొకసారి ఆస్ట్రియాకు వ్యతిరేకంగా పోరాటానికి సిధ్ధమయ్యాడు. కానీ ఈసారి ఇటలీ ప్రభుత్వం నుడి ఆయనకు పూర్తి మద్దత్తు లభించింది. అదే సమయంలో ఆస్ట్రియా ప్రష్యాల మధ్య యుధ్ధం మొదలైంది. ఆస్ట్రియా నుంచి వేనీషియాను పొందవచ్చన్న ఆలోచనతో ఇటలీ ఆస్ట్రియా - హంగరీలకు వ్యతిరేకంగా ప్రష్యా పక్షాన చేరింది.గారిబాల్డి తన హంటర్స్ ఆఫ్ ఆల్ఫ్స్ ను మరల సమీకరించాడు. ఇప్పుడు వారి సంఖ్య 40, 000. వారితో ట్రెనెటోకు బయలుదేరాడు. ఆయన బెజ్జెకా వద్ద ఆస్ట్రియన్ లను ఓడించాడు. ఇదే ఈ యుధ్ధంలో ఇటలీకి కలిగిన ఏకైక విజయం. ట్రెనెటోకు రాజధాని ట్రెంటో దిశగా బయలుదేరాడు. ఈ యుద్ధంలో ఇటలీలకి కలగిన ఏకైక విజయము ఇది. ట్రెనిటోను స్వాధినం చేసుకున్నాడు.

ఇటలీయన్ రాజు గారి సైనిక దళాలు లెస్సా వద్ద సముద్రంలో జరిగిన యుద్ధములో ఓడిపోయాయి, పదాతిదళాలు పెద్దగా పురోగతి సాధించలేక పోయాయి. వారికి కుస్తొజా వద్ద గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తరువాత ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందము కుదిరింది. ఆస్ట్రియా వెనెషియాను తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ దీనికి ఉత్తర దిశన ప్రష్యా సాధించిన విజయాలే కారణం. అప్పటికి గారిబాల్డి ట్రెనెటోను ఆక్రమిస్తూ ముందుకు వెళుతున్నాడు. కానీ అతనినివెనుతిరిగి రావలసిందిగా ఆదేశించడం జరిగింది.దానికి గారిబాల్డి నేను శిరసావహిస్తున్నాను అని తంతి ద్వారా సమాధానం పంపాడు.

Reference

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads