గిరిజాదేవి

భారతీయ సాంప్రదాయ గాయని From Wikipedia, the free encyclopedia

గిరిజాదేవి
Remove ads

గిరిజాదేవి (జననం 8 మే 1929) సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటుగా టుమ్రీలను గానం చేస్తుంది.

త్వరిత వాస్తవాలు గిరిజాదేవి, వ్యక్తిగత సమాచారం ...
Remove ads

బాల్యం

గిరిజాదేవి వారణాశిలో ఒక జమీందారీ కుటుంబంలో మే 8, 1929లో జన్మించింది.[1] ఈమె తండ్రి రాందేవ్ రాయ్ హార్మోనియం వాయించేవాడు. అతడే ఈమెకు ప్రథమ సంగీత గురువు. తరువాత ఈమె తన ఐదవ యేట నుండి ప్రముఖ సారంగి విద్వాంసుడు సర్జు ప్రసాద్ మిశ్రా వద్ద ఖయాల్ , టప్పాలు పాడడం నేర్చుకుంది.[2] పిమ్మట శ్రీచంద్ మిశ్రా వద్ద వివిధ రీతుల సంగీతాన్ని అభ్యసించింది. తన తొమ్మిదవ యేట "యాద్ రహే" అనే సినిమాలో నటించింది.[2]

సంగీత ప్రస్థానం

ఈమెకు 1946లో ఒక వ్యాపారస్థునితో వివాహం జరిగింది. ఈమె తొలి సారి ఆకాశవాణి అలహాబాద్ కేంద్రం ద్వారా 1949లో బహిరంగంగా పాడింది. కానీ ఉన్నత తరగతి ప్రజలు ఇలా బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి, అమ్మమ్మలనుండి వ్యతిరేకత రావడంతో కొంతకాలం ఈమె సంగీతం నాలుగు గోడలకే పరిమితమయ్యింది.[1][2][3] చివరకు 1951లో బీహార్‌లో ఈమె తన తొలి సంగీత ప్రదర్శన చేసింది.[2] ఈమె శ్రీచంద్ మిశ్రా వద్ద అతడు 1960లలో మరణించేవరకు శిష్యరికం చేసింది. 1980లలో కలకత్తాలోని ఐ.టి.సి.సంగీత్ రీసర్చ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది. 1990 తొలినాళ్లలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత శాఖలో పని చేసి పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపుకుంది.[2] ఈమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది.[2][4]

ఈమె బెనారస్ ఘరానా పద్ధతిలో, పూరబీ అంగ్, టుమ్రీ పద్దతులలో పాడి ఆ శాస్త్రీయ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించింది.[3][5] ఈమె కచేరిల్లో కజ్రి, చైతీ, హోళీ, ఖయాల్, జానపద గీతాలు, టప్పా మొదలైన పాక్షిక సాంప్రదాయ శాస్త్రీయ పద్ధతులలోని పాటలు ఉంటాయి.[3][6] ఈమె "క్వీన్ ఆఫ్ టుమ్రీ"గా పరిగణించబడింది. ఈమె శిష్యురాలు మమతా భార్గవ అలంకార్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా అనేక మందికి సంగీత శిక్షణ ఇస్తున్నది.

Remove ads

అవార్డులు

మరణం

ఈమె తన 88వ యేట అక్టోబర్ 24, 2017కోల్‌కాతాలో గుండెపోటుతో మరణించింది.[10]

మూలాలు

Loading content...

ఇదీ చదవండి

బయటి లింకులు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads