Remove ads
From Wikipedia, the free encyclopedia
నేరేడు (లేదా గిన్నె చెట్టు) (Jamun) ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు. సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్ దీని శాస్త్రీయ నామము .[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నేరేడు (గిన్నె చెట్టు) | |
---|---|
Jambul (Syzygium cumini) | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | షైజీజియం |
Species: | షై. క్యుమిని |
Binomial name | |
షైజీజియం క్యుమిని (లి.) Skeels. | |
రామాయణం లో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినపుడు, ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకనే భారతదేశంలోని గుజరాత్, వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు.
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.[2][3]
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
ఒక్క పండే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది. బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్.ఎల్ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్.ఎల్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది. జాగ్రత్తలు: నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు.
కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలానే ఇవి రక్తక్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి.
పోషకాలు (వందగ్రాముల్లో)
తేమ: 83.7గ్రా, పిండి పదార్థం: 19 గ్రా, మాంసకృత్తులు: 1.3గ్రా, కొవ్వు: 0.1గ్రా, ఖనిజాలు: 0.4గ్రా, పీచుపదార్థం: 0.9గ్రా, క్యాల్షియం: 15-30మి.గ్రా, ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా, సల్ఫర్: 13మి.గ్రా, విటమిన్ సి: 18మి.గ్రా.
దీని కర్ర (కలప) అనేక విధాలుగా ఉపయోగ పడుతుందుంది. తలుపులు, కిటికీలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఇంటి సామానులు చేయడావిని ఉపయోగిస్తుంటారు.
నేరేడు పండ్లలో చాల రకాలున్నాయి. 1. గుండ్రంగా పెద్దగ వుండే ఒక రకం. 2. కోలగా వుండి పెద్దగా వుండే రకం. వీటిని అల్ల నేరేడు అని అంటారు. 3. గుండ్రంగా వుండి చిన్నవిగా వుంటాయి. వీటి చిట్టి నేరేడు అని అంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.