Remove ads
From Wikipedia, the free encyclopedia
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ |
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును.ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు.
క్రమ సంఖ్య | అక్షరము | దేవతా మూర్తి | క్రమ సంఖ్య | అక్షరము | దేవతా మూర్తి | |
1 | తత్ | విఘ్నేశ్వరుడు | 13 | ధీ | భూదేవి | |
2 | స | నరసింహస్వామి | 14 | మ | సూర్య భగవానుడు | |
3 | వి | మహావిష్ణువు | 15 | హి | శ్రీరాముడు | |
4 | తుః | శివుడు | 16 | ధి | సీతాదేవి | |
5 | వ | శ్రీకృష్ణుడు | 17 | యో | చంద్రుడు | |
6 | రే | రాధాదేవి | 18 | యో | యముడు | |
7 | ణ్యం | శ్రీ మహాలక్ష్మి | 19 | నః | బ్రహ్మ | |
8 | భ | అగ్ని దేవుడు | 20 | ప్ర | వరుణుదు | |
9 | ర్గోః | ఇంద్రుడు | 21 | చో | శ్రీమన్నారాయణుడు | |
10 | దే | సరస్వతీ దేవి | 22 | ద | హయగ్రీవుడు | |
11 | వ | దుర్గాదేవి | 23 | య | హంసదేవత | |
12 | స్య | ఆంజనేయస్వామి | 24 | త్ | తులసీమాత | |
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.