From Wikipedia, the free encyclopedia
" మహారాణి గాయత్రీదేవి " కూచ్ బెహర్‌లో రాకుమారి గాయత్రీదేవిగా (1919 మే 23- 2009 జూలై 29) జన్మించింది.ఆమె జైపూర్ మహారాజా రెండవ సవై సింగ్‌ను వివాహమాడి మహారాజా మూడవభార్యాగా జీవించింది. [1] భర్త మరణించిన తరువాత జైపూర్ రాజ్యం సమైక్య్యభారతంలో విలీనం చేయబడింది.మహారాజా మరణించిన ఆమె సవతి కుమారుడు 1970లో సింహాసనం అధిష్టించాడు. ఆమె జయపూర్ రాజ్యానికి " రాజమాత " గా మహారాణి గాయత్రీదేవిగా గౌరవపదవిలో కొనసాగింది.
గాయత్రీదేవి కూచ్ రాజ్బంగ్షి వమ్శానికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మహారాజా జితేంద్ర నారాయణ్(పశ్చిమ బెంగాలు లోని కూచ్ బెహర్ మహారాజు). ఆమె తల్లి మరాఠా రాకుమారి " ఇందిరా రాజే (బరోడా).ఆమె మాహారాజా మూడవ సయాజీరావ్ గేక్వర్డ్ ఏకైక కుమార్తె.
ఇండియాకు స్వతంత్రం వచ్చిన తరువాత రాజవంశ పాలన రద్దు చేయబడింది. తరువాత ఆమె విజయవంతమైన రాజకీయనాయకురాలుగా మారింది. సంప్రదాయ సౌందర్యం కలిగిన గాయత్రీదేవి యవ్వనదశలో సౌందర్యచిహ్నంగా గుర్తింపు పొందింది.
ఆమె 2009 జూలై 29న జయపూరులో పరమపదించింది.ఆమె పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడింది.[2]
సంప్రదాయంగా హిందూ కుటుంబమైన కోచ్ రాజ్బంక్షి రాజవంశంలో జన్మించింది. ఆమె పశ్చిమ బెంగాలులోని (పురాతన అస్సాం) కూచ్ బెహర్ రాకుమారుడు జితేంద్ర నారాయణ్ కుమార్తెగా జన్మించింది. జితేంద్ర నారాయణ్ కూచ్ బెహర్ యువరాజు కనిష్ఠసోదరుడు. ఆమె తల్లి మారాఠా (బరోడా) రాకుమారి ఇందిరా రాజే కుమార్తె. ఆమె బరోడా మాహారాజు మూడవ సాయాజీరావు గేక్వర్డ్ ఏకైక కుమార్తె. ఆమె అత్యంత సౌందర్యవతి, ప్రబల సాంఘికవాదిగా గుర్తించబడింది.గాయత్రీదేవి బాల్యంలో ఆమె పెదతండ్రి మరణించిన తరువాత ఆమె తండ్రి సిహాసనం అధిష్ఠించాడు.గాయత్రీదేవి లండన్‌లోని " గ్లెండౌర్ ప్రిపరేటరీ స్కూల్ " ,[3] విశ్వభారతి, శాంతినికేతన్ లలో విద్యాభ్యాసం చేసింది.[4] తరువాత ఆమె తల్లి, సహోదరులతో ప్రయాణించే సమయంలో క్యూసన్నే, స్విడ్జర్లాండులలో కూడా విద్యను కొనసాగించింది.తరువాత లండన్‌లోని " లండన్ స్కూల్ ఆఫ్ సెక్రటరీస్ " సెక్రట్రీస్ స్కిల్స్ అభ్యసించింది.
ఆమె తన 12సంవత్సరాల ప్రాయంలో మహారాజా రెండవ సవై మాన్ సింగ్‌ను మొదటిసారిగా కలుసుకుంది.తరువాత ఆయన పోలో ఆడడానికి కొలకత్తా వచ్చి వారి కుటుంబంతో నివసించాడు.[5] ఆన 1940 మే 9న రెండవ సవై మాన్ సింగ్‌ను వివాహం చేసుకున్నది.[1]
గాయత్రీదేవి అద్భుతమైన రైడింగ్ నైపుణ్యం, పోలోక్రీడా సామార్ధ్యం కలిగిన మహిళగా గుర్తించబడింది.ఆమె శిఖరాలను అధిరోహించి అనేకదినాలు అక్కడ గడిపింది.ఆమెకు కారు అంటే మక్కువ ఎక్కువ. ఆమె మొదటి మెర్సిడెస్ బెంజ్ డబల్యూ 126 కారును దిగుమతి చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది.ఆమె పలు రోల్స్ రాయిస్ కార్లు, ఎయిర్ క్రాఫ్టును స్వంతం చేసుకుంది.[1]
వాగ్యూ మాగజిన్ ఒకసారి 10 భారతీయ అత్యంత సౌందర్యవతులలో ఒకరిగా గాయత్రీదేవిని పేర్కొన్నది.[6]
గాయత్రీ దేవి జయపూరులో 1943లో " మహారాణి గాయత్రీ దేవి పబ్లిక్ స్కూల్ " స్థాపించింది.[7]
ఆమె అంతరించిపోతున్న బ్లూపాటరీ అనే డయింగ్ వర్కును ఆదరించి పునరుద్ధరించింది.
1947లో భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత గాయత్రీదేవి పార్లమెంటు నియోజకవర్గం తరఫున పోటీచేసి 1962లో విజయం సాధించింది.ఎన్నికలలో పోలైన 2,46,516 ఓట్లలో ఆమె 1,92,909 ఓట్లను సాధించింది.[8] దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించింది.ఆమె 1967 నుండి 1971 వరకు పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగింది.[4]
1965లో " లాల్ బహదూర్ శాస్త్రిని " కలుసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయాలని లాల్‌బహదూర్ శాస్త్రి నుండి సూచన అందుకుంది. ఆసమయంలో ఆమె భర్త స్పెయిన్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన కారణంగా లాల్ బహదూర్ సూచనను స్వీకరించలేదు.1967లో స్వతంత్ర పార్టీ భైరన్ సింగ్ నాయకత్వంలో నిర్వహించబడుతున్న జనసంఘ్ పార్టీతో చేతులు కలిపింది.1967లో ఈ కూటమి పెద్ద సంఖ్యలో పార్లమెంటు స్థానాలను సాధించింది. అసెంబ్లీ ఎన్నికలలో గాయత్రీదేవి మల్పురాలో దామోదర్ లాల్ వ్యాస్‌తో పోటీచేసి ఓటమి పొందినప్పటికీ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించింది.
1971లో రాజభరణాల రద్దు కారణంగా అన్ని రాజరిక విశేషాధికారాలకు, బిరుదులకు తెరపడింది.దేశణ్లోఅత్యవసర పరిస్థితి విధించిన సమయంలో గాయత్రీదేవి ఖైదు చేయబడింది.ఆమె మీద పన్నుచట్టాలను అతిక్రమించినట్లు నేరం ఆరోపించబడింది. ఆమె 5 మాసాలకాలం జైలుజీవితం అనుభవించింది.[9]
ఆమె రాజకీయాల నుండి విరమించి 1976లో " ప్రింసెస్ రిమెంబర్స్ " పేరిట ఆత్మకథను ప్రచురించింది. ఫ్రాంసిస్ లెవీ దర్శకత్వం వహించిన " మెమరీస్ ఆఫ్ ఆ హిందూ ప్రింసెస్ " లో ఆమె జీవితకథనం చోటుచేసుకుంది.
1999లో ఆమె తిరిగి రాజకీయాలలో ప్రవేశిస్తుందని పుకార్లు తలెత్తాయి.కూచ్ బెహర్ ట్రినాముల్ పార్లమెంటు సభ్యురాలిగా వారి ప్రతినిధిగా ఆమె పేరును ప్రతిపాదించింది. అయినప్పటికీ గాయత్రీదేవి ఆప్రతిపాదనకు ప్రతిస్పందన తెలియజేయలేదు.[10]
ఆమెకు " ప్రింస్ జగత్ సింగ్ " అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన 1949 అక్టోబరు 15 - 1997 ఫిబ్రవరి 5 వరకు ఇసర్దా రాజాగా పదవి వహించాడు. 1978 మే 10న జగత్ సింగ్ మాం రాజవంశానికి చెందిన జయనందనా రంగ్సిత్ (1952) ను వివాహం చేసుకున్నాడు. ఆమె పియరంగ్సిత్ రంగ్సిత్, రాకుమారి వైభవాడి రంగ్సిత్ (తాయ్ లాండ్) కుమార్తె. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు.
మహారాణి గాయత్రీదేవి భారతదేశంలోని పలు రాజకుటుంబాలతో సంబంధబాంధవ్యాలు కలిగి ఉంది. ఆమె కూచ్ బెహర్ రాజవంశ సంతతికి చెంది ఉండడమే కాక ఆమె తల్లి మహారాణి ఇందిరారాజే తరఫున బరోడా రాజవంశ సంబంధాలను కలిగి ఉంది.ఆమె తాత మాహారాజా మూడవ సయాజీరావ్ గేవర్డ్, మహారాణి చింబాబాయ్ (మహారాష్ట్రాకు చెందిన గేక్వర్డ్ వమ్శానికి చెందిన మహిళ) కుమార్తె.
ఆమె తండ్రి తరఫున తాత మహారాజా నేపేంద్ర నారాయణ్ భూప్ బహదూర్, మహారాణి సునీతి దేవి కూచ్ బెహర్ రాజవంశానికి చెందిన మహిళ.సునీతీ దేవి బ్రహ్మసమాజానికి చెందిన సంఘసంస్కర్త కేసెబ్ చంద్రసేన్ కుమార్తె.
ఆమెకు జగద్దిపేంద్రనారాయణ్, ఇంద్రజితేంద్ర నారాయణ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారి తండ్రి మరణం కారణంగా 1922లో జగద్దిపేంద్రనారాయణ్ పిన్న వయసులోనే కూచ్ బెహర్ సింహాసం అధిష్ఠించాడు.
ఆమె తల్లి తరఫున బాంధవ్యంతో బరోడాకు చెందిన గేక్వర్డ్ రాజవంశంతో సంబంధాలు ఉన్నాయి. ఆమె సోదరి ఇలా దేవి త్రిపురా రజవంశీకుని వివాహమాడింది. ఆమె చిన్న చెల్లెలు మేనకా దేవి దేవాస్ రాజవంశస్థుడిని వివాహమాడింది. ఆమెకు కోట్ రాజ్యం, సవత్వాడి రాజ్యం, అక్కల్కోట్ రాజ్యం, జాత్ రాజ్యం, దేవాస్ రాజ్యం, జస్దాన్ రాజ్యం, సందూర్ రాజాస్థానం, తెహ్రీ- గర్వాల్, మయూర్బంజ్, ధార్ రాజ్యం, ఖోలాపూర్ రాజ్యం, ల్యునావాడే రాజ్యం, బరియా రాజ్యం, రాజా పయగ్పూర్ రాజ్యాలతో బాంధవ్యాలు ఉన్నాయి.
ఆమె లండన్‌లో గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్సను అందుకున్నది. ఆమె గ్యాస్ట్రిక్ డిసార్డర్ భీతితో జయపూర్ తిరిగి వెళ్ళాలని కోరుకుంది. తరువాత ఆమె జయపూర్ చేరుకుంది. తరువాత 2009 జూలై 17న ఆమె సంతోక్బా దుర్లభ్జీ మెమోరియల్ హాస్పిటల్లో చికిత్సకొరకు అనుమతించబడింది. 2009 జూలై 29న ఆమె తన 90వ సంవత్సరంలో మరణించింది.[11][12]
గాయత్రీదేవి తనజీవితకాలంలో ఈ క్రింది బిరుదులను పొందింది:
1919-1940:హర్ హైనెస్ ప్రింసెస్ గాయత్రీదేవి ఆఫ్ కూచ్ బెహర్.
1940-1949: 'హర్ హైనెస్ ది మహారాణి జయపూర్
1949-2009:హర్ హైనెస్ మహారాణి గాయత్రీ దేవి, రాజ్ మాతా ఆఫ్ జయపూర్ ' (జయపూర్ రాజమాత)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.