గల్లా జయదేవ్
గుంటూరు నుండి 16వ లోక్ సభ సభ్యులు. తెలుగు దేశం పార్టీ. From Wikipedia, the free encyclopedia
గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం నాయకుడు. 2014 నుండి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడిగా ఉన్నాడు. ఈయన తల్లి [[గల్లా అరుణకుమారి]] మాజీమంత్రి, బావ మహేష్ బాబు నటుడు.
గల్లా జయదేవ్ | |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 28 జనవరి 2024 | |||
ముందు | రాయపాటి సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | పెమ్మసాని చంద్రశేఖర్ | ||
నియోజకవర్గం | గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | దిగువమాఘం,చిత్తూరు | 2 జూన్ 1961||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఘట్టమనేని పద్మావతి | ||
బంధువులు |
| ||
సంతానం | 2 | ||
వృత్తి | వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు | ||
మతం | హిందూ | ||
జూన్ 5, 2014నాటికి |
గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం అభ్యర్థిగా గుంటూరు నుండి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై 2024 జనవరి 28న రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.[1][2]
వ్యక్తిగత జీవితం
గల్లా జయదేవ్ 1961 జూన్ 2 న చిత్తూరు జిల్లా, దిగువమాఘంలో జన్మించాడు. తండ్రి [[గల్లా రామచంద్ర నాయుడు]] ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన తిరుపతి సమీపంలో రేణిగుంట మండలం, కరకంబాడి దగ్గర అమరరాజా బ్యాటరీస్ అనే సంస్థ స్థాపించాడు. తల్లి [[గల్లా అరుణ కుమారి]] మాజీ శాసనసభ సభ్యురాలు. మొదట్లో ఈమె కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా పనిచేసింది. 1970 లో జయదేవ్ మూడేళ్ళ వయసులో ఉండగా వాళ్ళ కుటుంబం అమెరికాకు తరలి వెళ్ళింది.[3] 1984 లో తండ్రి భారత్ లో కంపెనీ పెట్టడం కోసం వచ్చేశాడు. అప్పుడు జయదేవ్ ఇల్లినోయ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తర్వాత మళ్ళీ పొలిటికల్ సైన్సు, ఎకనమిక్స్ కి మారాడు. ఈయనకు ఒక అక్క, పేరు : రమాదేవి. 1991 లో ప్రముఖ నటుడు కృష్ణ కుమార్తె ఘట్టమనేని పద్మావతితో ఈయన వివాహం జరిగింది.
జయదేవ్ తాత పాతూరి రాజగోపాల నాయుడు ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పిగా కూడా పనిచేశాడు.
వృత్తి
చదువు పూర్తయిన తర్వాత జిఎన్బి అనే బ్యాటరీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఈసంస్థ అప్పట్లో అమరరాజాకు సాంకేతిక భాగస్వామి. అందులో రెండేళ్లపాటు పనిచేశాడు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.