గర్భస్రావం

గర్భవిచ్చిత్తి From Wikipedia, the free encyclopedia

గర్భం ద్వారా ఏర్పడిన పిండం, దాని సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం (ఆంగ్లం: Abortion) అంటారు. గర్భస్రావం కొన్ని కారణాల వల్లనూ, కొన్ని సార్లు ఏ కారణం లేకుండా జరగవచ్చు. పిండం బరువు ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాములకంటే తక్కువకు పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషిస్తారు. సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇలా జరగడానికి పలు కారణాలుంటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భస్రావం జరగడానికి అనేక కారణాలున్నాయి.

త్వరిత వాస్తవాలు గర్భస్రావం, Synonyms ...
గర్భస్రావం
Intervention
Synonymsప్రేరేపిత గర్భస్రావం, గర్భం యొక్క ముగింపు
ICD-10-PCSమూస:ICD10PCS
ICD-9-CM779.6
MeSHD000028
MedlinePlus007382
మూసివేయి

కారణాలు

తల్లి వయసు
19 నుంచి 24 ఏళ్ల వయసు గర్భం దాల్చడానికి అన్నింటి కన్నా క్షేమమైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.
జన్యుపరమైనవి
కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్‌.
గర్భసంచిలో లోపాలు
పుట్టుకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల, అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
కంతులు
ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
ఇతర కారణాలు
అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోం, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు.

రక్తం గడ్డకట్టడంలో తేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పని ఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

బలవంతపు గర్భస్రావం

స్వయంగా మనుగడ సాగించగల సామర్థ్యానికి ముందే పిండాన్ని లేదా ప్రారంభ దశ పిండాన్ని గర్భసంచి నుండి తీసివేయటం లేదా బలవంతంగా తొలగించటం అనేది గర్భం యొక్క ముగింపు అయిన గర్భస్రావంగా ఉంది. గర్భస్రావం అనేది ఆకస్మికంగా సంభవించవచ్చు. ఈ సందర్భంలో దీన్ని తరచుగా గర్భవిచ్ఛిత్తి అని పిలుస్తారు. ఇది ఉద్దేశపూర్వకంగా కూడా జరగవచ్చు. ఈ సందర్భంలో దీన్ని బలవంతపు గర్భస్రావం అని పిలుస్తారు. మానవ గర్భం యొక్క బలవంతపు గర్భస్రావాన్ని అత్యంత సాధారణంగా గర్భస్రావం అనే పదం సూచిస్తుంది. పిండము తరువాత స్వయంగా మనుగడ సాగించగలగవచ్చుననే అదే పద్ధతిని వైద్యపరంగా "ఆలస్యంగా గర్భం తొలగింపు" అని పిలుస్తారు.[1]

పద్ధతులు, భద్రత

ఆధునిక వైద్యం బలవంతపు గర్భస్రావం కోసం ఔషధాలను లేదా శస్త్రచికిత్స పద్ధతులను ఉపయోగిస్తుంది. మొదటి త్రైమాసికంలో మిఫెప్రిస్టోన్, ప్రోస్టాగ్లాండిన్ రెండు ఔషధాలు శస్త్రచికిత్స పద్ధతంత సమర్థవంతమైనవిగా ఉన్నాయి.[2][3] రెండవ త్రైమాసికంలో ఔషధాల వినియోగం ప్రభావవంతంగా ఉండగా, [4] శస్త్రచికిత్సా విధానాలతో దుష్ప్రభావాల ప్రమాదవకాశం తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది.[3] గర్భస్రావం అయిన తరువాత మాత్ర, గర్భాశయ పరికరాలతో సహా కుటుంబ నియంత్రణను వెంటనే ప్రారంభించవచ్చు.[3] అభివృద్ధి చెందిన ప్రపంచంలో గర్భస్రావం, స్థానిక చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు, వైద్యంలో గల సురక్షిత విధానాలో భద్రతను కలిగియున్నసుదీర్ఘ చరిత్ర గర్భస్రావానికి ఉంది.[5][6] సరళమైన గర్భస్రావాలు దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్యలను లేదా శారీరక సమస్యలను కలిగించవు.[7] ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షితమైన, చట్టబద్ధమైన ఇదే స్థాయి గర్భస్రావాలు ప్రపంచవ్యాప్తంగా అందరి మహిళలకు అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.[8] అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సురక్షితంగాలేని గర్భస్రావాల వల్ల దాదాపు 47,000 ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి[7], 5 మిలియన్ల మంది ఆసుపత్రి పాలవటం జరుగుతుంది.[9]

ఎపిడెమియాలజీ

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4.4 కోట్లు గర్భస్రావాలు జరుగుతున్నాయని అంచనా వేస్తుండగా, వీటిలో సగం కంటే కొంచెం అంతగా సురక్షితం కాని పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి.[10] ఇంతకుముందు గడచిన దశాబ్దాలలో [10] మెరుగుపరచబడిన కుటుంబ నియంత్రణ ప్రణాళిక, కుటుంబ నియంత్రణకు సంబంధించిన విద్య కోసం, తిరస్కరించబడిన ప్రాప్యతను పొందిన తరువాత 2003, 2008 మధ్యకాలంలో గర్భస్రావం యొక్క రేట్లు చాలా కొద్దిగా మారాయి.[11] As of 2008 ప్రపంచ మహిళలలో నలభై శాతం మంది "కారణంతో సంబంధం లేకుండా పరిమితులు లేని" చట్టపరమైన బలవంతపు గర్భస్రావాలకు ప్రాప్యతను పొందారు.[12] ఏది ఏమైనప్పటికీ, గర్భవతిగా ఉన్నప్పుడు దీన్ని ఎంత వరకు చేయవచ్చు అనేదానికి సంబంధించి పరిమితులు ఉన్నాయి.[12]

చరిత్ర, సమాజం, సంస్కృతి

బలవంతపు గర్భస్రావానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పురాతన కాలం నుండి, వివిధ రకాలైన పద్ధతులైన మూలిక ఔషధములు, పదునైన పరికరాల వినియోగం, శారీరక గాయం, ఇతర సంప్రదాయ పద్ధతులు వంటి వాటి ద్వారా ఇవి నిర్వహించబడుతున్నాయి.[13] గర్భస్రావం కోసం వ్యాప్తి చెందిన చట్టాలు, ఎంత తరచుగా అవి అమలు చేయబడుతున్నాయి, సాంస్కృతిక, మతపరమైన హోదా వల్ల అవి ఎంత తరచుగా చాలా ఎక్కువగా మారుతూఉంటాయి. కొన్ని సందర్భాలలో, వావివరసలు లేని వారి మధ్య లైంగిక చర్యలు, అత్యాచారం, పిండం యొక్క సమస్యలు, సామాజిక ఆర్థిక అంశాలు లేదా తల్లి ఆరోగ్యానికి ప్రమాదం వంటి ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి గర్భస్రావం చట్టబద్ధం అవుతుంది.[14] ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గర్భస్రావం యొక్క నైతికపరమైన, చట్టపరమైన గర్భస్రావ సమస్యలపై ప్రజా వివాదం ఉంది. గర్భస్రావ వ్యతిరేక ఉద్యమాలు పిండం లేదా ప్రారంభ దశ పిండం అనేది జీవించే హక్కు ఉన్న ఒక మనిషని, గర్భస్రావాన్ని హత్యతో పోల్చవచ్చునని సాధారణంగా గర్భస్రావ వ్యతిరేకులు చెబుతారు.[15][16] గర్భస్రావ హక్కులకు మద్దతునిచ్చేవారు మహిళ తన యొక్క సొంత శరీరానికి సంబంధించిన విషయాలను నిర్ణయించటంలో ఆమెకు హక్కు ఉందని నొక్కి చెబుతున్నారు.[17] అలానే అవి మానవ హక్కులు అని ఉద్ఘాటిస్తున్నారు.[8]

చికిత్స

రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం దాల్చవచ్చు. గర్భస్రావం అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించవచ్చు.

గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వవచ్చు.

గల్ఫ్‌లో నిషేధం

  • మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన నేరంపై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియాలో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు.[18]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.