గణపతి అధర్వశీర్షము అనేది గణపతి స్తోత్రం. దీని గోప్యత గూర్చి ఫలశ్రుతిలో వివరించబడింది. ఇది అధర్వణ వేదం లోనిది. ఈ స్తోత్రం త్రిమూర్తులతో సహా పంచభూతాలన్నీ గణపతి స్వరూపమే అంటుంది. "ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథ పతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతయ వరద మూర్తయే నమః" అనేది ఈ అధర్వ శీర్షంలో ముఖ్యమైన మంత్ర పాఠం. స్తోత్ర రూపంలో ఉండే ఈ అధర్వ పారాయణం వేగంగా ఫలితాలనిస్తుందని నమ్ముతారు.[1]

గణపతి అధర్వశీర్షంలో అన్నింటి యందు గణపతిని ఆరోపణ చేయడమంటే గణపతిలో అన్ని గుణాలున్నాయనే. ఇన్ని ఉంటేనే ఆకర్షించే శక్తి ఏర్పడుతుంది. శరీరానికి మూలంగా పీఠస్థానంలో, వెన్నుముక క్రింది భాగంలోని ప్రదేశంలో మూలాధారచక్రం ఉంటుంది. ఏది మౌలికమో ఏది లేకపోతే మిగిలినవాటికి అస్తిత్త్వం  ఉండదో అదే మూలాధారం. దానిపై ఆధారపడి మాత్రమే మిగిలినవి ఉండాల్సి ఉంటుంది. ఈ మూలాధారానికి కూడా అధిపతి గణపతే.[2]కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామును చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. ఈ విషయం ఈ స్తోత్రంలో ఉంది.[3]

"గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము." అని ఈ స్తోత్రంలో చెప్పబడింది.

కొన్ని శ్లోకాలు

ఓం'లం'నమస్థే గణపతయే త్వమేవ ప్రత్యక్ష్యం తత్వమసి,
త్వమేవ కేవలం కర్తాసి,
త్వమేవ కేవలం ధర్థాసి,
త్వమేవ కేవలం హర్థాసి,
త్వమేవ సర్వం ఖల్విదం బ్రంహ్మాసిత్వం సాక్షాదాత్మాసి నిత్యం,
.....................................

.....................................
త్వమ్ బ్రంహ్మా, త్వమ్ విష్నుః, త్వమ్ రుద్రా,.........
.....................................

.....................................
ఏకదంతం చతుర్హస్తమ్ పాశమంకుశ ధారిణం
రధంచ వరదమ్........మూషక ద్వజం
రక్తం, లంబోదరం, శూర్పకర్ణకం,రక్తవాసనం,
రక్తగంధాను లిప్తాంగం, రక్త పుష్పై సుపూజితం,
............................

.........................
శివ సుతాయ శ్రీ వరద మూర్తయే నమః

మూలాలు

బాహ్య లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.