గణతంత్ర రాజ్యం

From Wikipedia, the free encyclopedia

గణతంత్ర రాజ్యం

గణతంత్ర రాజ్యం లేదా గణతంత్రం అనేది ఒక పరిపాలనా విధానం. ఇందులో రాజ్యాధికారం ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రతినిధులది.[1] గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు. ఈ పద్ధతిలో ఏ కుటుంబానికో, లేక సమూహానికో పరిపాలన మీద అపరిమిత అధికారాలు ఉండవు. ఇక్కడ ప్రజాస్వామ్యం, మిశ్రమ ప్రభుత్వం, ఓలిగార్కీ, లేదా నిరంకుశత్వం ద్వారా అధికారాన్ని చేపట్టవచ్చు. ఆధునిక గణతంత్ర రాజ్యం రాచరికానికి పూర్తిగా వ్యతిరేకం అందువల్లనే గణతంత్ర రాజ్యాల్లో రాజులు, దేశాధినేతలు లేదా ప్రభువులు ఉండరు.[2][3][4]

Thumb
A map of the Commonwealth republics

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.