తెలంగాణ-శాసనసభ స్పీకర్ From Wikipedia, the free encyclopedia
గడ్డం ప్రసాద్ కుమార్ [2] తెలంగాణ రాష్ట్రానికి చెందిన వికారాబాద్ శాసన సభ సభ్యుడు, స్పీకర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత, లఘు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు.[3]
జి. ప్రసాద్ కుమార్ | |||
తెలంగాణ రాష్ట్ర శాసనసభ -స్పీకర్ | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 14 - ప్రస్తుతం | |||
మాజీ చేనేత, జౌళి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2012 - 2014 | |||
తెలంగాణ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ముందు | మెతుకు ఆనంద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | వికారాబాద్ నియోజకవర్గం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2008 - 2014 | |||
ముందు | ఎ.చంద్రశేఖర్ | ||
తరువాత | బి. సంజీవరావు | ||
నియోజకవర్గం | వికారాబాద్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1964 బెల్కటూరు, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎల్లమ్మ, ఎల్లయ్య | ||
జీవిత భాగస్వామి | కే.శే.శైలజ | ||
సంతానం | అనన్య[1],ఈశ్వర్ | ||
నివాసం | వికారాబాద్ |
జి. ప్రసాద్ కుమార్ 1964లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం, బెల్కటూరు గ్రామంలో పాల ఎల్లమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తాండూరు విలియమూన్ హైస్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్, జహీరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు.[4]
జి. ప్రసాద్ కుమార్ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రంగారెడ్డి జిల్లా యువన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ సెల్ జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్‌గా వివిధ హోదాల్లో పనిచేసి 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలం కొంశెట్పల్లి నుంచి ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ కుమార్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించగా, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పొత్తులో భాగంగా వికారాబాద్ స్థానం టీఆర్ఎస్ కు దక్కగా, ఆ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ విజయంలో కీలకంగా పనిచేశాడు.
తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[5]
గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశాడు.[6] ఆయన 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7] గడ్డం ప్రసాద్‌కుమార్ 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[8][9]
గడ్డం ప్రసాద్ కుమార్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాదు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[10], 2023 డిసెంబరు 07న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యాడు.[11][12][13] ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా డిసెంబరు 13న నామినేషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపింది.[14] గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై, డిసెంబరు 14న బాధ్యతలు చేపట్టాడు.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.