గంగూబాయి హనగల్ (5 మార్చి 1913 - 21 జూలై 2009) కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు.ఈమెను అందరూ "లేడీ ఆఫ్ ఖయాల్" అని పిలుస్తారు. ఖయాల్ సంగీతం చాలావరకు పురుషులకే పరిమితమైనదని భావిస్తారు. అలాంటి పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన గంగూబాయి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, "లేడీ ఆఫ్ ఖయాల్" అనిపించుకోవడం అంటే చాలా గొప్పవిషయమే. పడవ నడిపే వారి కులములో జన్మించిన గంగూబాయి కులవివక్షను, లింగవివక్షను సమర్థంగా ఎదుర్కొని సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు సంపాదించింది. మగవారికి దీటుగా ఉన్న గాత్రం ఈవిడ విలక్షణత. ఈవిడ కర్ణాటకలోని ధార్వాడలో జన్మించింది. ఈమె తల్లి కూడా గాయకురాలే[5].
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గంగూబాయి హంగల్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | [1][2] హంగల్, కర్ణాటక, భారత దేశము[3] | 1913 మార్చి 5
మూలం | ధార్వాడ్, కర్ణాటక, భారత దేశము[1][2] |
మరణం | 2009 జూలై 21 96) హుబ్లీ, కర్ణాటక, భారత దేశము[2] | (వయసు
సంగీత శైలి | హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1931–2006[4] |
విశేషాలు
ఈమె చిన్ననాటనే తల్లి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టింది. గంగూబాయికి కర్ణాటక సంగీతం మీదకన్నా హిందుస్తానీ సంగీతం మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. అందువల్ల గ్రాంఫోన్లు అమ్మే దుకాణాల నుండి వినిపించే మరాఠీపాటలు, హిందుస్తానీ సంగీతం వింటుండేది. కూతురు ఆసక్తిని, అభిరుచిని అర్థం చేసుకున్న తల్లి అంబాబాయి ఆమెను కృష్ణాచార్య హల్గూరు దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకోవడానికి పంపింది. ఆ సమయంలోనే రెండేళ్ళు కథక్ నృత్యం కూడా అభ్యసించింది. అయితే నృత్యాభ్యాసంతో సంగీత సాధన కుంటుపడుతుందనే భయంతో నాట్యాన్ని వదులుకుంది. తన 16వ యేట సవాయి గంధర్వ వద్ద సంగీత అభ్యాసం మొదలుపెట్టింది. మూడేళ్లపాటు కొనసాగిన ఈ శిక్షణకు గాను ఆమె గురుదక్షిణగా 20 తులాల బంగారం సమర్పించుకుంది[5].
ఈమె తొలిప్రదర్శన బెల్గాంలో జరిగింది. కాంగ్రెస్ సభలలో ఈమె పాడినప్పుడు ఆ సభకు మహాత్మాగాంధీ కూడా హాజరయ్యాడు. ఈమె స్వరంలో స్త్రీత్వం కన్నా పురుషత్వమే ఎక్కువ కనిపిస్తుంది.
భారత ప్రభుత్వం ఈమెను పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది[5].
ఈవిడ మరణానంతరం తన నేత్రదానానికై ఆదేశించింది.
అవార్డులు
- కర్ణాటక సంగీత నృత్య అకాడమీ అవార్డు, 1962[1]
- పద్మ భూషణ్, 1971
- పద్మ విభూషణ్, 2002
- సంగీత నాటక అకాడమీ అవార్డు, 1973[6]
- సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1996[7]
- తాన్సేన్ అవార్డు
మూలాలు
ఇతర లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.