From Wikipedia, the free encyclopedia
హిందూ పురాణంలో ఖ్యాతి, దక్ష ప్రజాపతి, ప్రసూతి కుమార్తె. పురాణాల ప్రకారం, దక్షుడు భార్య ప్రసూతి నుండి 24 మంది కుమార్తెలు [1], అతని మరొక భార్య పంచాజని (విరిణి) నుండి 62 మంది ఉన్నారు.[2][3] దక్షుడు కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఈమె శివ మొదటి భార్య అయిన సతి సోదరి.
ప్రజాపతి భృగు మహర్షి సంబంధం సూత్రం ప్రకారం ఖ్యాతి అనగా దివ్య కాంతి చైతన్యం అనేదే ప్రధాన అర్థం. ఖ్యాతి అర్థం అనంత (ఆల్ రౌండ్) విజ్ఞానాన్ని, దాని యొక్క అందం వ్యక్తపరుస్తుంది, అలాగే కాంతి, దాని యొక్క చర్యగా వర్తించబడుతుంది.
ఈమెకు ప్రజాపతి, సప్తర్షులలో ఒకరు,[4] మొట్టమొదటి జ్యోతిష రచయిత[5], వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త.[6] బ్రహ్మ హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు [7], బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షితో వివాహం జరిగింది.
ఖ్యాతి దంపతులకు ధాత, విధాత అనే పేరు గల ఇద్దరు కుమారులు, శ్రీ అనే కూతురు ఉన్నారు. వీరి కుమార్తె, విష్ణు (నారాయణ)తో వివాహం జరిగింది.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.