Remove ads
From Wikipedia, the free encyclopedia
ఖుంటీ జార్ఖండ్ రాష్ట్రం, ఖుంటీ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దక్షిణ ఛోటానాగ్పూర్ డివిజన్లో ఉంది. 2007 సెప్టెంబరు 12 న రాంచీ జిల్లా నుండి వేరు చేసి ఖుంటి జిల్లాను ఏర్పాటు చేసారు. ఇది చారిత్రికంగా బిర్సా ఉద్యమ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. 2011 నాటికి, ఖుంటీ జిల్లా లోహార్దాగా తర్వాత జార్ఖండ్లో రెండవ అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. ఈ జిల్లా రెడ్ కారిడార్లో భాగం.
ఖుంటీలో ఉష్ణమండల వర్షారణ్యం శీతోష్ణస్థితి ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు అత్యధిక వర్షపాతం జరుగుతుంది. ఇది మొత్తం వర్షపాతంలో 90% కంటే ఎక్కువ.
2001 జనగణన ప్రకారం,[1] ఖుంటీ జనాభా 29,271. జనాభాలో పురుషులు 52%, మహిళలు 48% ఉన్నారు. ఖుంటీ సగటు అక్షరాస్యత రేటు 69%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 61%. ఖుంటీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇది దాదాపు ఖుంటీ నుండి 33 కి.మీ.
ఖుంటీలో రైల్వే స్టేషన్ లేదు. సమీప స్టేషన్ హటియా రైల్వే స్టేషను. బస్సు లేదా టాక్సీల ద్వారా హటియా రైల్వే స్టేషన్, రాంచీ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.