క్రెడిట్ కార్డు
From Wikipedia, the free encyclopedia
క్రెడిట్ కార్డు సొమ్ము చెల్లించడానికి సాధారణంగా బ్యాంకులు అందించే సేవ. క్రెడిట్ కార్డు ద్వారా పలు రకాలైన వస్తువులు, సేవలు కొనుగోలు చేయవచ్చు, డబ్బు కూడా అప్పుగా తీసుకోవచ్చు. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు పెట్టినది తర్వాత క్రమమైన వ్యవధిలో తిరిగి చెల్లించాలి.[1] అలా చెల్లించని పక్షంలో బ్యాంకులు చెల్లించని మొత్తానికి వడ్డీని విధిస్తాయి.
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో పోలిస్తే భిన్నమైనవి. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసేటపుడు ఖాతాలో డబ్బు లేకపోయినా పరవాలేదు, కానీ డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేసేటపుడు ఖాతాలో సొమ్ము ఉండాలి. కాబట్టి డెబిట్ కార్డు వాడకం ఒకరకంగా డబ్బులు చెల్లించడం లాంటిదే. క్రెడిట్ కార్డులు ప్రపంచ వ్యాప్తంగా డబ్బులు చెల్లించడానికి విరివిగా వాడుతున్నారు.[2]
నిర్మాణం
చాలా వరకు క్రెడి కార్డులు ISO/IEC 7810 ID-1 ప్రామాణికతను అనుసరించి 85.60 x 53.98 మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఎటిఎం కార్డులు, డెబిట్ కార్డులు, ఇతర చెల్లింపు కార్డులు కూడా సాధారణంగా ఇదే పరిమాణాన్ని కలిగి ఉంటాయి. చాలావరకు కార్డులు ప్లాస్టిక్ తో తయారైనవే ఉంటాయి. ఏవో కొన్ని మాత్రం లోహంతో తయారైనవి ఉంటాయి.[3][4]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.