తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
కోహెడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] కోహెడ ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 37 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. కోహెడ, ఈ మండలానికి కేంద్రం.
కోహెడ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.13°N 79.33°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | కోహెడ (సిద్ధిపేట జిల్లా) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 44,645 |
- పురుషులు | 22,334 |
- స్త్రీలు | 22,311 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.56% |
- పురుషులు | 66.59% |
- స్త్రీలు | 38.48% |
పిన్కోడ్ | 505473 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 44,645 - పురుషులు 22,334 - స్త్రీలు 22,311. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 205 చ.కి.మీ. కాగా, జనాభా 44,645. జనాభాలో పురుషులు 22,334 కాగా, స్త్రీల సంఖ్య 22,311. మండలంలో 11,563 గృహాలున్నాయి.[3]
లోగడ కోహెడ్ గ్రామం/ మండలం కరీనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోహెడ్ మండలాన్ని (1+15) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.