Remove ads
From Wikipedia, the free encyclopedia
కోయిల్ సాగర్ (Koil Sagar) ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి.[1][2] జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. మండల కేంద్రమైన దేవరకద్రకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.
1945లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలలోని 12 వేల ఎకరాల సాగు భూమికి నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.276TMC లు.
రెండు కొండల మధ్య నిర్మించబడిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేయడానికి పనులు ప్రారంభమైనవి.[3] కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.