కొత్త కాపురం

1975లో విడుదలైన తెలుగు సినిమా. From Wikipedia, the free encyclopedia

కొత్త కాపురం

కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, భారతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను జి. వెంకటరత్నం ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు.[1] పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్ని, వారి కుటుంబాల్ని, అందులోని తగదాల్ని ప్రధానంగా ఆవిష్కరించిందీచిత్రం.

త్వరిత వాస్తవాలు కొత్త కాపురం, దర్శకత్వం ...
కొత్త కాపురం
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాతజి. వెంకటరత్నం
తారాగణంకృష్ణ,
భారతి
సంగీతంకె. వి. మహదేవన్
నిర్మాణ
సంస్థ
ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 18, 1975 (1975-04-18)
భాషతెలుగు
మూసివేయి

తారాగణం


సాంకేతిక వర్గం

దర్శకుడు: పి.చంద్రశేఖర్ రెడ్డి

సంగీతం: కె.వి.మహదేవన్

నిర్మాత: జి.వెంకటరత్నం

నిర్మాణ సంస్థ:ప్రసన్నలక్ష్మి పిక్చర్స్

సాహిత్యం:కొసరాజు,దాశరథి, సి. నారాయణ రెడ్డి, మోదుకూరి జాన్సన్

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి

విడుదల:18:08:1975 .

నిర్మాణం

దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[3]

పాటలు

ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.[4]

  • కాపురం కొత్త కాపురం - ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ముంతంత కొప్పులో మూడు సేమంతి పూలు , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • కాడి జోడెడ్ల అవడా కరుకైన కుర్రవాడా , రచన: మోదుకూరి జాన్సన్, గానం. పులపాక సుశీల
  • దంచుకో నాయనా ధనియాల పప్పు , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ రంగుల రామచిలుక ఇటురావే బంగారు , రచన:కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.