తెలంగాణ, సిద్ధిపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
కొండపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. కొండపాక ఈ మండలానికి కేంద్రం.
కొండపాక మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.972957°N 78.858426°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | కొండపాక |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,592 |
- పురుషులు | 24,216 |
- స్త్రీలు | 24,376 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.59% |
- పురుషులు | 60.29% |
- స్త్రీలు | 32.75% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 48,592, పురుషులు 24,216, స్త్రీలు 24,376. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 228 చ.కి.మీ. కాగా, జనాభా 48,592. జనాభాలో పురుషులు 24,216 కాగా, స్త్రీల సంఖ్య 24,376. మండలంలో 10,922 గృహాలున్నాయి.[3]
దాదాపు 900 సం.ల. క్రితం కొండపాకలో నిర్మితమైన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైందిగా పేర్గాంచింది. సా.శ.1094వ సంవత్సరంలో మొదటి కాకతీయ రుద్రదేవుడు, తన పరిపాలనాకాలంలో,కాకతీయ సామ్రాజ్యం నలుదిశలా రుద్రేశ్వరస్వామికి పలు ఆలయాలను నిర్మింపజేశాడు. ఆ పరంపరలోనిదే ఈ కొండపాక రుద్రేశ్వరాలయం.[4] 14, 15, 2006 అక్టోబరు 16లో స్థానిక రుద్రేశ్వరాలయ ప్రాంగణంలోనే బ్రహ్మశ్రీ శ్రీరామ సిద్ధాంతిగారి శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.