From Wikipedia, the free encyclopedia
రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల తలరాతను మార్చే తీర్పు మరి కొద్ది గంటల్లో వెలువడనుంది. దశాబ్ద కాలానికి పైగా కృష్ణా నది జలాల వివాదాలతో సతమతమవుతోన్న రాష్ట్రానికి ఊరడింపు లభిస్తుందా... ఎగువ రాష్ట్రాల డిమాండ్లే నెగ్గుతాయా అనే ఉత్కంఠ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది అవార్డును ప్రకటించనున్నారు. ఐదేళ్ల సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత కృష్ణా నదీ జలాల పంపిణీ., నీటి లభ్యత., వినియోగంపై వెలువడుతోన్న తీర్పు కోసం ఆంధ్రా., కర్ణాటక., మహారాష్ట్ర ప్రభుత్వాలు., ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మూడు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చుకు కారణమైన కృష్ణా నదీజలాల వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. మిగులు జలాల పంపిణీ., వాస్తవ నీటి లభ్యత., ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుతో పాటు పలు కీలక వివాదాల్ని పరిష్కరించే దిశగా ట్రిబ్యునల్ అవార్డును (తీర్పు) ప్రకటించనుంది. 35ఏళ్ల క్రితం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జరుగుతోన్న నీటి వినియోగంపై వివాదాలు ముదరడంతో 2004లో కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2006 ఫిబ్రవరి నుంచి పని ప్రారంభించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ తో పాటు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్పీ శ్రీవత్సవ., కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి డికెసేథ్ లతో కూడిన ట్రిబ్యునల్ తుది తీర్పును రేపు ప్రకటించనుంది. నిజానికి ఈ ఏడాది జనవరి 31 నాటికే ట్రిబ్యునల్ అవార్డును ప్రకటించాల్సి ఉన్నా వాదనలు పూర్తికాకపోవడం., ఆల్మట్టి ఎత్తు నిర్ధారణలో ఆంధ్రా., మహారాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలతో తీర్పు వెలువడటంలో జాప్యం జరిగింది. కృష్ణా నదీ జలాల విషయంలో 30వరకు అభ్యంతరాలను ట్రిబ్యునల్ పరిశీలించినా వాటిలో నదీ జలాల పంపిణీ., లభ్యత., మిగులు జలాలపై హక్కులు ఇప్పుడు ప్రధానాంశాలు కానున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ప్రకటించిన సమయంలో నూరేళ్లలో 75 సంవత్సరాల నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయడంతో పాటు మిగులు జలాలపై పూర్తి హక్కుల్ని రాష్ట్రానికే కేటాయించింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర., కర్ణాటకలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ లో పేర్కొన్నట్లు నీటి లభ్యత 2060 టిఎంసీలు కాదని., 50ఏళ్ల లభ్యత ఆధారంగా 2612టిఎంసీల నీరు కృష్ణా బేసిన్ లో లభిస్తోందని కర్ణాటక వాదిస్తోంది. మహారాష్ట్ర కూడా 112ఏళ్ల లభ్యత ఆధారంగా ఆ మొత్తం 2600 టిఎంసీలని ఆ ప్రకారమే కొత్తగా రాష్ట్రాలకు కేటాయింపులు ఉండాలని పట్టుబడుతోంది. మరోవైపు మన రాష్ట్రం వాస్తవ నీటి లభ్యత 2402టిఎంసీలేనని., అందులో 75ఏళ్ల నికర లభ్యత చూస్తే 2057 టిఎంసీలేనని., రాష్ట్రానికి మిగులు జలాలే రావడం లేదని వాదిస్తోంది.
మరో వైపు ఆల్మట్టి ఎత్తు విషయంలో కూడా మూడు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 519.6 మీటర్లు ఉన్నపుడే తమకు ముంపు ఉంటోంది కనుక ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని మహారాష్ట్ర తేల్చి చెబుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వను 516 మీటర్లకే పరిమితం చేయాలని వాదిస్తోంది. కర్ణాటక మాత్రం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్లకు సుప్రీం కోర్టు అనుమతించిందని వాదిస్తోంది. దీంతో పాటు కృష్ణా నదిలో దాదాపు 517 టిఎంసీల మిగులు జలాలు ఉంటున్నాయని., వాటిలో కూడా కర్ణాటకకు వాటా దక్కాలని వాదిస్తోంది. మిగులు జలాలను నిల్వ చేసుకునేలా ప్రాజెక్టు ఎత్తును 524.256 మీటర్లకు అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద మూడు రాష్ట్రాలు తమకున్న సాగు భూమి., ఆయకట్టు నీటి అవసరాలను బట్టి నీటి కేటాయింపు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగా కర్ణాటక 2218.7టిఎంసీలు., మహారాష్ట్ర 1168టిఎంసిలు., ఆంధ్రప్రదేశ్ 2225టిఎంసిల నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ట్రిబ్యునల్ కు నదీ జలాల పంపిణీ వ్యవహారం కత్తి మీద వ్యవహారంలా మారింది. మిగులు జలాలపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సాగు నీటి ప్రాజెక్టులకు బ్రిజేష్ కుమార్ అవార్డులో అంత మొత్తంలో నీళ్లు దక్కకపోతే ఆ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రమాదం ఉంది. మొదట వినియోగించుకుంటున్న వారికి మొదటి హక్కు సూత్రాన నదీ జలాల పంపిణీ జరపాలంటూ వాదిస్తోన్న రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుందా లేదన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. 1961 నాటికి రాష్ట్రంలో వినియోగంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటి రక్షణ కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ మేరకు కేటాయింపులు కొనసాగుతాయా..., ఎగువ రాష్ట్రాల వాదనలతో బ్రిజేష్ కుమార్ ఏకీభవిస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
ఎండ్ విత్ పీ టూ సీ గ్రాఫిక్స్ కోసం..... రాష్ట్రం..............బచావత్ అవార్డు కేటాయింపు..........మొత్తం ఆంధ్రప్రదేశ్..............800టిఎంసిలు 811 కర్ణాటక................700టిఎంసిలు.................734 మహారాష్ట్ర...............560టిఎంసిలు................585టిఎంసిలు మొత్తం................2060టిఎంసిలు...........................2130టిఎంసిలు
రాష్ట్రం.................. నదీ పరీవాహక ప్రాంతం....................... ప్రయాణ దూరం.....................నీటి లభ్యత మహారాష్ట్ర.............26,805చదరపు మైళ్లు............................186మైళ్లు..................760.9టిఎంసిలు కర్ణాటక...............43,734చదరపు మైళ్లు............................300మైళ్లు..................962.5టిఎంసిలు ఆంధ్రప్రదేశ్.............28,719చదరపు మైళ్లు............................358మైళ్లు..................336.6టిఎంసి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.