Remove ads
From Wikipedia, the free encyclopedia
కుల్గాం భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా చెెందిన ఒక పట్టణం, అదే జిల్లాకు ముఖ్య పట్టణం.ఇది వేసవి రాష్ట్ర రాజధాని శ్రీనగర్ నుండి 67 కి.మీ.దూరంలో ఉంది.నగరాన్ని16 ఎన్నికల విభాగాలుగా విభజించారు.కుల్గాంలో దాదాపు అన్ని కార్యాలయాలు పనిచేస్తాయి.కుల్గాం ప్రాంతం వివిధ రకాల పండ్లకు, ముఖ్యంగా యాపిల్ పండ్లుకు పేరుపొందింది.[5] ఈ పట్టణం వెషానది ఒడ్డున ఉంది.కుల్గాం ప్రాంతంలో పిర్ పంజాల్ పర్వత ప్రాంతాలు ఉన్నాయి.అహ్రాబల్లో పచ్చికభూములు, జలపాతాలు ఉన్నాయి. పిర్ పంజాల్ రేంజ్ పర్వత శ్రేణిలో ఉన్న కౌన్సర్నాగ్ కొండలు ఈ జలపాతాలకు మూలం.దక్షిణ కాశ్మీర్లో కుల్గాం ఒక ముఖ్యమైన ప్రదేశం.కుల్గాం సరిహద్దులుగా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్, పుల్వామా, అనంతనాగ్ అనే మూడు జిల్లాల కలుపుతూ ఉంది.కుల్గాం స్థలాకృతి సుందరమైంది. ఇది అన్ని వైపులా చిన్న ప్రవాహాలు, తోటలతో ఉంది.వరి పొలాలు, పెద్ద భాగం విజ్ఞాన ప్రణాళిక ప్రాంతలత సుందరమైన ప్రాంతం.కుల్గాం బియ్యం, యాపిల్సు ఉత్పత్తి ఇక్కడ విరివిగా ఉంటుంది.దీనిని "కాశ్మీర్ బియ్యం గిన్నె" అని కూడా పిలుస్తారు.
కుల్గాం | |
---|---|
Coordinates: 33°38′24″N 75°01′12″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లా | కుల్గాం |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | కుల్గాం పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 1,067 కి.మీ2 (412 చ. మై) |
Elevation | 1,739 మీ (5,705 అ.) |
జనాభా (2011 [1]) | |
• Total | 23,584 |
• జనసాంద్రత | 22/కి.మీ2 (57/చ. మై.) |
భాషలు | |
• అధికార భాష | ఉర్దూ, కాశ్మీరీ భాష |
Time zone | UTC+5:30 |
పిన్ కోడ్ | 192231,[2] |
ప్రాంతపు కోడ్ | 01931 [3] |
Vehicle registration | JK18 JK18A, JK18B, JK18C [4] |
Website | https://kulgam.nic.in/ |
దీనికి "కుల్గాం" ("కుల్" అంటే కాశ్మీరీలో "ప్రవాహం"; "గామ్" అంటే "గ్రామం") అని పేరు పెట్టారు.ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ప్రవాహాలు ఉన్నాయి.
కుల్గాం 33 ° 38'24 "N 75 ° 01'12" E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.ఇది సముద్రమట్టానికి 1739 మీ. (5705 అ.) సగటు ఎత్తులోఉంది.పాత కుల్గాం "కావల్" నది ఒడ్డున ఉంది.కుల్గాం దిగువ భాగం వాశివ్ నదికి దూరంగా ఉన్న కావల్ నది ఒడ్డున ఉంది.
కుల్గాంలో మొత్తం 23,584 మంది జనాభా ఉన్నారు.అందులో 12,605 మంది పురుషులు కాగా, 10,979 మంది మహిళలు ఉన్నారు.[6]
కుల్గాంలో ఒక మతసాధువు (సయ్యద్ సిమ్నాన్ సాహిబ్) మంచిపేరు తెచ్చుకున్నారు.సయ్యద్ సిమ్నాన్, ఇరాన్ లోని సిమ్నాన్ అనే ప్రదేశంనుండి వచ్చాడు.కాశ్మీర్ లోయలో ప్రయాణిస్తున్న అతను కుల్గాంకు వచ్చి వెషా నదికి ఎదురుగా ఉన్న ఒకకొండపై ఉన్న స్థలాన్ని ఇష్టపడ్డాడు.అతను కుల్గాంను తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు.అతను మనోహరంగా ఉన్న ఆప్రదేశంలోనే ఖననం చేయబడ్డాడు.అతని 'ఆస్తాన్'ను కుల్గాం చుట్టుపక్కల జనాభా ఏర్పాటుచేశారు.[7] సయ్యద్ సిమ్నాన్ కుటుంబాన్నిఅమున్ అనే సమీప గ్రామంలో ఖననం చేశారు.ఆ రెండు పుణ్యక్షేత్రాలు రాతి పునాదులపై, దేవదార్ల చెక్కతో ఉన్నత నిర్మాణాలుగా నిర్మించారు. అతను తన ఆధ్యాత్మిక శక్తులతో భక్తులను ఆకర్షించాడు.ముస్లింలతో పాటు హిందువుల భక్తులనుకూడా కలిగి ఉన్నాడు.[8]
షేక్ నూర్-ఉద్-దిన్ ను రిషి అనికూడా పిలుస్తారు.అతను కాశ్మీరీ సాధువుల రిషి క్రమానికి చెందినవాడు.దీనిని అలమ్‌దార్-ఎ-కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.ముస్లింలు, హిందువులు గౌరవించే కాశ్మీరీల పోషకుడిగా షేక్-ఉల్-ఆలం 779ఎ.ఎచ్ (ఎడి 1377) లో కుల్గాం కైముహ్ అనే గ్రామంలో జన్మించాడు.షేక్ నూర్-ఉద్-దిన్ కుటుంబాన్ని క్విమోలో ఖననం చేశారు.కుల్ల్గాం ప్రాంతం అల్లామా ఇక్బాల్ (సుపూర్ గ్రామం) పూర్వీకుల జన్మస్థలం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పూర్వీకులు కూడా కుల్గాంలోని నాడి మరగ్ అనే గ్రామానికి చెందినవారు.
సయీద్ అలీ హమ్దానీకి ముందు కుల్గాం ఇస్లాం మతసంస్థ మొదటి బోధకుడుగా పేరు పొందాడు.అతను ఇస్లాం మతం కోసం బోధించడానికి సయీద్ మొహమ్మద్ హుస్సేన్ సిమ్నానిని కాశ్మీర్‌కు పంపాడు.సయీద్ సిమ్నాని కుల్గామ్ను శాశ్వత ప్రదేశంగా ఎంచుకున్నాడు.షేక్ నూర్-ఉద్-దిన్ వాలి తండ్రి సాలార్ సాన్జ్ ఇస్లాం స్వీకరించిన, సాలార్ ఉద్-దిన్ గా పేరు మార్చబడిన ప్రదేశం.సాలార్ ఖీ జోగిపోరా మొహమ్మద్ పోరా కుల్గాం నుండి 7 కి.మీ (4 మైళ్లు) దూరంలో ఉన్న దాదర్కోట్కు చెందిన రాజు కుమార్తె సాడర్ను వివాహం చేసుకున్నాడు.సయీద్ సిమ్నాని ప్రయత్నాల వల్ల ఈ వివాహం జరిగింది.
కుట్బాల్ అనే సమీప గ్రామంలోని ఒక పురావస్తు ప్రదేశంలో పాక్షిక తవ్వకాలు కుషన్ పాలననాటి ప్రాచీనకాలం భౌతిక సంస్కృతిని అందించింది.[9][10] ఆప్రదేశం నుండి త్రవ్వబడిన శిలాఫలకాలు అప్పటి జనాభా అభిరుచులు, జీవన ప్రమాణాలను సూచించాయి.[11][12] ఈ త్రవ్వకాల్లో సా.శ.మొదటి శతాబ్దంలో నివసిస్తున్న ప్రజల ఉన్నత సంస్కృతి, పౌరసేవా భావం, సామాజిక నిబంధనలు, కళలును గురించి తెలియజేసింది.కుషన్ కాలానికి చెందిన కుట్బాల్ ప్రాతం, దాని పరిశోధనలు, అప్పటికి ఉపఖండంలోఅభివృద్ధి చెందిన చాలాదూర ప్రాంతాలకు ప్రయాణించిన అనేక మత, కళాత్మక పద్ధతుల దృష్ట్యా మరింత ముఖ్యమైనవి.లోయలో రాజకీయ అశాంతి కారణంగా మరిన్ని తవ్వకాలు ఆగిపోయాయి.
సుందరమైన నల్లాహా వశివ్ నదుల ద్వారా కుల్గాం ప్రాంతంలోని సారవంతమైన భూములకు సాగునీరు అందుతుంది.కుల్గాంను కాశ్మీర్ లోయ ధాన్యాగారం అని పిలుస్తారు.కానీ దురదృష్టవశాత్తు వ్యవసాయభూమిగా ఉన్న ఈ ప్రాంతం ఉద్యానవనంగా మార్చబడింది.
జిల్లాలో జీవనోపాధికి ప్రధాన వనరు వ్యవసాయం, ఉద్యానవనం. కుల్గాం లోతట్టు ప్రాంతాలు వరిసాగుకు చాలా సారవంతమైనవి (ఉత్తమ దిగుబడికి పేరుగాంచాయి). దీనిని 'కాశ్మీర్ బియ్యం గిన్నె'గా పరిగణిస్తారు. మరోవైపు, పై ప్రాంతాలు నాణ్యమైన ఆపిల్, బేరి ఉత్పత్తికి విరివిగా పండుతాయి.ఎగువ ప్రాంతాలలోని గ్రామీణ జనాభాలోముఖ్యంగా పశువులు, గొర్రెల పెంపకం ఒక అనుబంధ వృత్తిగా ఉంది [5] కుల్గాం జిల్లా వాయవ్య దిశలో శక్తివంతమైన, గంభీరమైన పిర్ పంజాల్ పర్వతశ్రేణిని కలిగిఉంది.ఇది భారీ స్థలాకృతిలో ఆవరించి రక్షణగా పనిచేస్తుంది.ఈ ప్రాంతం గణనీయంగా అటవీ ప్రాంతంలో ఉంది.
కుల్గాం పట్టణం సుమారు శ్రీనగర్ నుండి 68 కి.మీ., అనంతనాగ్ నుండి 17 కి.మీ. దూరంలో ఉంది. దీనికి పొరుగు జిల్లాలైన షాపియన్, పుల్వామా, అనంతనాగ్, రంబాన్ మొదలైన వాటితో రహదారి అనుసంధానం కలిగిఉంది.పట్టణంతో పాటు జిల్లాలోని చాలా దూర ప్రాంతాలుకు నెట్వర్కు ద్వారా అనుసంధానించబడింది.ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న ప్రదేశాలతో పాటు, జిల్లాలో "అహ్రాబల్ వాటర్ ఫాల్" వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, కుల్గాం జిల్లా నైరుతి దిశలో అమ్నూ ఈద్ గహ్ చూడవచ్చు. కొంగ్వాటన్, గుర్వట్టన్, నందిమార్గ్ ఎత్తైన పచ్చిక బయళ్ళు కూడా కుండ్ నుండి లాడిగసన్ (అహెర్బల్ చీలికల కంటే ముందు) లోని కన్య పచ్చికభూములు పర్యాటక ఆకర్షణలు.కౌన్సేర్నాగ్ (అహెర్బల్ కంటే ముందు), వాసేక్నాగ్ (కుండ్), ఖీ నాగ్ (ఖీ జోగిపోరా), వంటి వివిధ నీటి బుగ్గల ఆకారంలో సహజ నీటి వనరులు ఈ ప్రాంతంలో ఎక్కువుగా ఉన్నాయి
కుల్గాం జిల్లాలో నూరాబాద్, కుల్గాం, హోమ్షైలిబుగ్, దేవ్సర్ అనే నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.కుల్గాం శాసనసభ సభ్యుడు సిపిఐఎం నాయకుడు మొహమ్మద్ యూసుఫ్ తారిగామి. జిల్లా అభివృద్ధిలో అతను ముఖ్య పాత్ర పోషించాడు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభలో ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్న నజీర్ అహ్మద్ లావే కూడా కుల్గాంకు చెందినవ్యక్తి
కుల్గాం జనాభాలో ఎక్కువ భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.సేవల రంగం కూడా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.జిల్లాలోని ఎగువ ప్రాంతాల భూమి ఉద్యానవనానికి సారవంతమైంది.వరి పంటకు దిగువ ప్రాంతాలు. ఫ్రూట్ మండి కుల్గాంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇక్కడ ప్రజలు ఆపిల్, చెర్రీ మొదలైన వాటిని స్థానిక, జాతీయ కొనుగోలుదారులకు విక్రయిస్తారు.
కుల్గాం వివిధ శాసనసభ నియోజకవర్గాలకు జాతీయ రహదారి 1ఎ (జిల్లా రహదార్లు) తో అనుసంధానించే రహదారులను కలిగిఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.