కుంటాల సోమేశ్వర ఆలయం

From Wikipedia, the free encyclopedia

Remove ads

కుంటాల సోమేశ్వర ఆలయం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి అనుకొని గుహలో సోమేశ్వర ఆలయం ఉంది[1].ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు మరియూ పూష్యమాసమంలో ఆదివాసీ లు ఇక్కడ పూజలు చేస్తారు [2][3].

త్వరిత వాస్తవాలు కుంటాల సోమేశ్వర ఆలయం, పేరు ...
Remove ads

స్థల పురాణం

పూర్వం కైలాసంలో ఒక రోజు గంగాదేవి, పరమేశ్వరులు ఆడిన చదరంగంలో పరమశివుడు ఓటమి చేందుతాడు. ఓడిపోయిన శివుణ్ణి గంగాదేవి హేళన చేస్తుంది. అప్పుడు కైలాసం వదిలి ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న సహజంగా ఏర్పడిన గుహలో తన ఆత్మలింగాన్ని నిలుపుతాడు.భర్త జాడ వెదుకుతూ గంగాదేవి ,పార్వతీదేవి నారద మహర్షి కి ఈ విషయం తెలుపుతుంది. శివుని ఎవరైతే హేళన చేసి బాధ పెట్టారో వారే కైలాసానికి తీసుకొస్తానంటే శివుడి జాడ చెప్తాడు.గంగాదేవి శివుడున్న గుహకు చేరి శివునికి పాలు,పళ్ళు,మారేడు పండ్లు, పత్రి సమర్పించి సేవలు చేస్తుంది.అప్పుడు దేవతలు,నారదుడు వచ్చి గంగాదేవి కి అసలు విషయం చెబుతాడు అప్పుడు గంగాదేవి తన తప్పు మన్నించుమని వేడుకుంటుంది.శివుడు క్షమించి ఆనందింపజేస్తాడు.అప్పుటి నుంచి శివుడు ఆత్మలింగానికి సోమేశ్వర లింగం సోమన్న లింగం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

Remove ads

భక్తుల విశ్వాసం

కుంటాల జలపాతం లో స్నానం చేసి సోమేశ్వర దేవుని అర్చిస్తే పుణ్యం వస్తుందని భార్యాభర్తల మధ్య ఉన్న కోపతాపాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం.

జాతర

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం గుహలో సోమేశ్వర ఆలయంలో[4] మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఘనంగా జాతర జరుగుతుంది.మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు స్థానిక భక్తులు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఆలయానికి అనేక ప్రాంతాల నుండి వేలాది భక్తులు తరలివస్తారు. రాతిగుహలో ఉన్న ఈ సోమేశ్వర ఆలయంలో ఆత్మలింగంతో పాటు గంగాదేవి విగ్రహాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు[5]. ఇక్కడ ప్రత్యేక రుద్రాభిషేకాలు,పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికులు పూర్తి ఏర్పాట్లు చేస్తారు.

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads