From Wikipedia, the free encyclopedia
ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానంలో అనేక మార్పుల వలన, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పుల వలన ఈ ఆధునిక కాలంలో మధుమేహం, స్థూలకాయం, ధైరాయిడ్, సంతానలేమి అనే సమస్యలు ఎలా సాధారణం అయిపోయాయో, అలాగే కాలేయ సంబంధ సమస్యలు ఎక్కువ అయ్యాయి.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అనగా ఉదరంలో కాలేయగ్రంథి అనేది ముఖ్యమైన అవయం, కుడివైపున ఉంటుంది. ఇది అన్నింటి కంటే చాలాపెద్దగ్రంథి. అలాగే జీర్ణప్రక్రియలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్నది. మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతోంది. తర్వాత అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారుతున్న చెక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంలో ఉండే కణాలు తమ గణాన్ని కార్యమును కోల్పోయి, కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీలివర్‌గా వైద్య పరిభాషలో వ్యవహరిస్తారు దీనిలో అనేక దశలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3 దశలు.
ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం, మద్యపానం ఎక్కువగా చెయ్యటం, ప్రమేహం, స్థూలకాయం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేదా లివర్‌క్యాన్సర్‌గా మారవచ్చు.
ఫ్యాటీలివర్ మొదటిదశ నుండి రెండవ దశ అయిన ఎన్.ఏఎస్.హెచ్‌కు. అక్కడి నుండి 3వ దశ అయిన సిరోసిస్‌కు దారి తీస్తుంది అనుకోకూడదు. చాలాసందర్భాలలో 1 నుండి 3 వరకు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కన్పించగానే తగు జాగ్రత్త తీసుకోవాలి.
బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. స్థూలకాయం ఉన్న 90% వ్యక్తులలో ఫ్యాటీలివర్, ఫ్యాటీలివర్ మొదటిదశ కనిపిస్తుంది. స్థూలకాయం ఉన్న 20% వ్యక్తుల్లో రెండవ దశగా పేర్కొన్న ఎన్.ఏ.ఎస్.హెచ్. దశ ఉంటుంది.ఫ్యాటీలివర్ వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే వారిలో దాదాపు 50% మందికి డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిర్రోసిస్ వచ్చిన వారిలో 50% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే.
పూర్తి వ్యాసం కామెర్లులో చూడండి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.