అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఉన్న ఒక హిందూ దేవాలయం. From Wikipedia, the free encyclopedia
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం, అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో, ఫ్రిస్కోలోని రెండు హిందూ దేవాలయాలలో ఇదీ ఒకటి.
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | టెక్సస్ |
ప్రదేశం: | ఫ్రిస్కో |
అక్షాంశ రేఖాంశాలు: | 33.178510°N 96.748377°W |
ఇతిహాసం | |
సృష్టికర్త: | గణపతి సచ్చిదానంద స్వామీజీ |
డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ప్రవాస భారత హిందువుల కోసం 2007లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమై, 2009లో[1] పూర్తయింది. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం హనుమంతుడు. 2015, జూలై 23న ఈ దేవాలయం తెరవబడింది. ఒక వారం తర్వాత, ఆగస్టు 1న 24 గంటలపాటు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.[2] గణపతి సచ్చిదానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం స్వామీజి 3వ ప్రపంచ రికార్డు.
$11 మిలియన్ ఖర్చుతో ఈ దేవాలయంలో యోగా, కర్ణాటక సంగీతం, భారతీయ నృత్యం, భారతీయ మంత్రోచ్ఛారణలు, హిందూ మతంపై తరగతులతోపాటు పూజా సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ భాషలలో శిక్షణ తరగతులు కూడా ఉంటాయి.[3] ఆలయంలో ప్రార్థనా మందిరం, ఫలహారశాల, భోజనశాల, ఆడిటోరియం, వేదిక ఉన్నాయి. దేవాలయానికి 72 అడుగుల ఎత్తైన "రాజగోపురం" నిర్మించబడింది. సూర్యకాంతి ఒక చివర నుండి మరొక చివరకి వెళ్ళేలా ఈ గోపురాన్ని నిర్మించారు.[4] ఆలయం వారంలో ప్రతిరోజు తెరిచి ఉంటుంది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.