Remove ads
భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర కొత్త జిల్లా. From Wikipedia, the free encyclopedia
కాంగ్పోక్పి జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర కొత్త జిల్లా. 2016, డిసెంబరు నెలలో సేనాపతి జిల్లాలో భాగమైన సదర్ హిల్స్ ప్రాంతం నుండి ఏర్పాటుచేయబడింది.[1][2][3][4][5][6]
కాంగ్పోక్పి జిల్లా | |
---|---|
మణిపూర్ రాష్ట్ర జిల్లా | |
Coordinates: 25.15°N 93.97°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ముఖ్య పట్టణం | కాంగ్పోక్పి |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
Website | https://dckpidistrict.gov.in/ |
కాంగ్పోక్పి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరానికి 45 కి.మీ.ల దూరంలో ఉంది.[7]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 36,000 గృహాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 1,93,744 మంది జనాభా ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో 7వ స్థానంలో ఉంది. ఇందులో 96% జనాభా గ్రామీణ ప్రాంతంలో, 4% జనాభా పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ మొత్తం జనాభాలో 80% మంది షెడ్యూల్ తెగలు, 20% మంది సాధారణ ప్రజలు ఉన్నారు. జిల్లా జనాభాలో 98,908 (51%) మంది పురుషులు, 94,836 (49%) మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 989:1000 ఉంది. జిల్లా అక్షరాస్యత 85% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషులు అక్షరాస్యత 89% కాగా, స్త్రీల అక్షరాస్యత 80.34% గా ఉంది.[7]
ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 79.90%, హిందువులు 17.68%, బౌద్ధులు 0.92%, ముస్లింలు 0.45%, సిక్కులు 0.06%, జైనులు 0.02%, ఇతరులు 0.96% ఉన్నారు.
ఈ జిల్లాలో తడౌ కుకి 52.85%, నేపాలీ 15.96%, వైఫీ 5.08%, తంఖుల్ 5.02%, లియాంగ్మీ 3.56%, యిమ్చుంగ్రే 2.64%, ఇతరులు 14.9% ఉన్నారు.
ఈ జిల్లా 9 ఉప విభాగాలు ఉన్నాయి.[7]
ఈ జిల్లాలో 534 గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లాలో మూడు (సైకుల్ - 46, కాంగ్పోక్పి - 47, సైతు - 48) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.