కసింద లేదా కసివింద ఒక కాసియా ప్రజాతికి చెందిన మొక్క. తక్కువ కొమ్మలుగా ఉండే స్వల్పకాలిక శాశ్వత మొక్క 0.5-2 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది . కసింద కాండం ఎర్ర,ముదురు రంగులలో ఉండి , లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది. ఈ మొక్క బలమైన ప్రాధమిక మూలాన్ని కలిగి ఉంది. ఆకులు ఎర్రటి కాండాలపై లేత ఆకుపచ్చగా ఉంటాయి.ఆకులలో 2నుంచి 6 వరకు మనకు పువ్వులు కనిపించగలవు. పండు ముదురు గోధుమ రంగుసుమారుగా 75-130 మి .మీ పొడవు , 8-10 మి.మీ వెడల్పు లో ఉంటాయి. ఒక వరుసలో 25-35 విత్తనాలను కలిగి ఉంటాయి. విత్తనాలు ముదురు గోధుమ రంగు, , 5 మి.మీ పొడవు ,3 మి.మీ వెడల్పుతో ఉంటాయి [1] కసింద మొక్కలు మన దేశంలో రాజస్థాన్ లో ఎక్కువ ఉష్ణోగ్రత వాతావరణం లో వర్షంలు కురిసిన వెంటనే బంజరు భూములలో ఎక్కువగా పెరుగగలవు [2] అమెరికాలోని( తూర్పు, దక్షిణ) ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది .రోడ్డు పక్కన, వ్యర్థ , ప్రదేశాలు, పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు, బహిరంగ అడవులలో, తీరప్రాంత పరిసరాలు ప్రాంతాలలో పెరిగే మొక్క. అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలలో పర్యావరణ చెట్లుగా పరిగణిస్తున్నారు [3] మన దేశములో దీని అస్సాం లో హాట్ తెంగా , కుసుమ్, జోంజోనిగోచ్, ఇంగ్లీష్ లో కాఫీసెన్నా, సెప్టిక్వీడ్, నీగ్రో కాఫీ, ఫెటిడ్ సెన్నా, హిందీలో కసోన్డి, మళయాళం లో పొన్నారివీరం, పొన్నియోంతకర, మత్తంతకర, పయవిరామ్, నాథ్రామ్‌తకర, పొన్నారి, కరింతకర, తమిళంలో పాయవరై అని కసింద ను పిలుస్తారు [4]
కసింద | |
---|---|
కసింద మొక్క | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
(unranked): | Eudicots |
Order: | |
Family: | |
Subfamily: | సిసాల్పినాయిడే |
Tribe: | Cassieae |
Genus: | Senna |
Species: | S. occidentalis |
Binomial name | |
Senna occidentalis (L.) Link, 1829 | |
Synonyms | |
Cassia caroliniana, C. ciliata Raf.
|
కసింద ఉపయోగం కసింద విత్తనములు, ఆకులు, బెరడు ( కాండములో వుండే) ఆయుర్వేదిక్ మందుల తయారీలో వాడుతున్నారు. మలేరియా, కాలేయ రుగ్మతలను నయం చేయడానికి, చెడు బాక్టీరియా ను నిర్ములించడానికి ,, రోగనిరోధక శక్తిని శరీరం లో పెంచడానికి , దగ్గు, మూర్ఛల వంటి మందుల లాంటివి చేయడానికి వాడుతున్నారు [5]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.