From Wikipedia, the free encyclopedia
నీటిలో ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని కషాయం అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది. కషాయం భారతీయ పురాతన వైద్యం , ఇది జలుబు, దగ్గు, గొంతు, అజీర్ణం , అవసరమైన విధముగా ప్రజలు భారతీయుల ఇళ్లలో ప్రతివారు చేసుకునే సామాన్య చిట్కా వైద్యం . అల్లం తో చేసే కషాయం అజీర్ణం నుండి బయటపడటానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మిరియాల కషాయం , ఎండిన అల్లం తో వచ్చే శొంఠి కాషాయం, మన కు కావాల్సిన రీతిలో కషాయం చేసుకొనవచ్చును . తగిన విధముగా బెల్లం, చక్కెరను కషాయం లో వేసుకొని త్రాగవచ్చును . కషాయం లో వాడే ప్రతి పదార్ధం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి ,రోగనిరోధక శక్తిని పెంచడానికి నివారణగా ఉపయోగించబడింది [1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉదారణకు మనము జిలకర కషాయం తో ప్రసరణ , మనిషిలో ఉండే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం లో అవసరమైనప్పుడు లేదా రోజూ భోజనం చేసిన తర్వాత కూడా జీరా నీరు తాగుతూ ఉంటారు. జీరా కషాయం ఎసిడిటి, అజీర్తి , గ్యాస్ వంటి వ్యాధులను నివారించ వచ్చును . జీరా లేదా జీలకర్ర విత్తనాలు భారతీయ వంటగది యొక్క మసాలా దినుసులలో ఒకటిగా ఉండటం సాధారణం,జీరా కషాయం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తరువాత, ఇది ఆరోగ్య సంరక్షణ అని చెప్పవచ్చును. తక్కువ ఖర్చుతో ప్రజలు పొందే ప్రయోజనం ఎక్కువ [2]
ఆయుర్వేదం లో కషాయములు చూస్తే నీలవేంబు కషాయము ఇది రోగనిరోధక శక్తిని పెంచే , మొత్తం శరీర ఆరోగ్యానికి తోడ్పడే మూలికల నుండి తయారవుతుంది. ఈ మూలికా కషాయం పురాతన కాలం నుండి వైద్యం లో ఉపయోగించబడింది. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పి , అలసటకు ఇది ఉపయోగకరం . ఈ కషాయం ( టానిక్ ) COVID-19 ని నివారించడానికి రోజుకు రెండుసార్లు 60 మి.లీ నీలవేంబు కషాయాలను ప్రజలు వాడ వచ్చునని ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ కషాయం మధుమేహ నివారణకు , జీర్ణ వ్యాధులు , మలేరియా , డెంగీ ,కాన్సర్, ఊపిరి పీల్చుకోవడం లో , హెపటైటిస్ వాడుతారు . వ్యాధులను బట్టి ఈ కషాయం వైద్యుల సలహాతో వాడవలెను [3] [4] ఇతర కషాయాలు చూస్తే కీళ్ల నొప్పులు, ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్న రోగులకు అష్టవర్గ కషాయము , మలబద్ధకం, హేమోరాయిడ్లు,ఇతర మల సమస్యలకు చికిత్స చేయడానికి చిరువిల్వాడి కషాయము ను ఉపయోగిస్తారు.శ్వాసకోశ జీర్ణ సమస్యలు, ఛాతీ నొప్పి, జ్వరాలు, తలనొప్పితో బాధపడుతున్న రోగులకు దాసమూలకదుత్రయ కషాయము, ధన్వంథరం కషాయము ప్రసవానంతర సంరక్షణ కోసం, రుమాటిక్ ఫిర్యాదులు, జీర్ణక్రియ సమస్యలు పాక్షిక పక్షవాతం చికిత్స కోసం విస్తృతంగా వాడుతారు. దగ్గు, ఉబ్బసం ఉన్న రోగులకు ఎలకనాడి కషాయము ,గాంధర్వహస్థది కషాయము మలబద్ధకమునకు , ఇది రుమాటిక్ ఫిర్యాదులకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది.ఇందూకాంత కషాయము శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, క్షయ, పేగు కీళ్ళ నొప్పుల చికిత్సలో సహాయపడుతుంది.రుమటాయిడ్ ఆర్థరైటిస్, చర్మ రుగ్మతలు , రక్తహీనత కు మంజిష్టాడి కషాయము , నాడీ కషాయను ప్రసవానంతర ఉపయోగిస్తారు, కీళ్ల నొప్పులు, పేగుల దుస్సంకోచాలకు ,నయోపయ కషాయ అన్ని రకాల ఉమ్మడి సమస్యలు, ఉబ్బసం, దగ్గుకు, చర్మ వ్యాధులు, మంటలు, కుష్టు వ్యాధి, మలబద్దకాన్ని నయం చేయడానికి పడోలమూలడి కషాయము వాడతారు [5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.