మహారాష్ట్ర వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
కమలనయన్ బజాజ్ (1915 జనవరి 23-1972 మే 1) మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.
కమలనయన్ బజాజ్ | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1957-1971 | |
నియోజకవర్గం | వార్థా లోక్‌సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1915 జనవరి 23 |
మరణం | 1972 మే 1 57) | (వయసు
సంతానం | రాహుల్ బజాజ్ |
తల్లిదండ్రులు | జమ్నాలాల్ బజాజ్ జానకీ దేవి బజాజ్ |
కమలనయన్ బజాజ్ బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ పెద్ద కుమారుడు.[1] కమలనయన్ 1915 జనవరి 23న జన్మించాడు.[2] 1954లో తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన బజాజ్ గ్రూప్ కు నాయకత్వం వహించాడు.[3] అతను ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేశాడు.
త్రీ-వీలర్స్ సిమెంట్, అల్లాయ్ కాస్టింగ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో బజాజ్ గ్రూప్ ప్రముఖ పాత్ర పోషించింది .[3]
కమలనయన్ బజాజ్ కు రాహుల్ బజాజ్, సుమన్ జైన్, శిశిర్ బజాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[4][5] రాహుల్ బజాజ్ కమలనయన్ బజాజ్ పెద్ద కుమారుడు.[2]
కమలనయన్ బజాజ్ వార్ధా లోక్ సభ నియోజకవర్గం నుండి 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు ఎంపీగా గెలిచాడు. 1969 లో తన రాజకీయ సహచరుడు మొరార్జీ దేశాయ్‌తో కలిసి కాంగ్రెసులో చేరాడు. 1971 పార్లమెంట్ ఎన్నికలలో కమలనయన్ బజాజ్ ఓడిపోయారు. ఆ తరువాత అతను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.[2]
కమలనయన్ బజాజ్ 1972 మే 1 న 57 సంవత్సరాల వయసులో మరణించాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.