Remove ads
From Wikipedia, the free encyclopedia
కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది. గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని ఋజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికా రంగములో రాణించగలరు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వరంగములో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగంచగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మక పోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. అధ్యాత్మిక గురువులకు సమ్బంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగములో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. వివాహజీవితములో ఒడి దుడుకులు ఊండక పోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి ఔతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలు ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టములో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధిచిన రచనలు చేయగలరు. ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దటములో కొద్దిపాటి నిర్లక్ష్యము చుపించినా నష్తపోగల అవకాశము ఉంది. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివ్వాదాలు తల ఎత్త వచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. గృహం మీకు నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనా వలన సమస్యలను అధిగమించ వచ్చు.
రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశి అధిపతి భుధుడు .ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమ రాశిగా వ్యవహరిస్తారు. స్వభావం ద్విశ్వభావం, తత్వం భూతత్వం, శభ్ధములు అర్ధ, ఉదయం శీర్షోదయం, జీవులు మనుష్య, నిర్జల తత్వం, పరిమాణం దీర్ఘం, వర్ణములు చిత్రవర్ణం, జాతులు శూద్ర, దిక్కు దక్షిణం, ప్రకృతి వాతం, సంతానం అల్పం, కాలపురుషుని శరీర భాగం ఉదరం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.