భారతీయ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
కన్నా లక్ష్మీనారాయణ భారతదేశ రాజకీయనాయకుడు, గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు [3] అతడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, వ్యవసాయ సాంకేతిక మిషన్ విభాగానికి కేబినెట్ మంత్రిగా ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు సమక్షంలో 2023 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4][5]
కన్నా లక్ష్మీనారాయణ | |||
వ్యవసాయ మంత్రి [1] | |||
పదవీ కాలం 2012 ఫిబ్రవరి 1 – 2014 ఫిబ్రవరి 27 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | నగరంపాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1955 ఆగస్టు 13||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ[2] | ||
నివాసం | బంజారా హిల్స్, హైదరాబాదు. | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | http://www.kannalakshminarayana.com |
కన్నా లక్ష్మీనారాయణ 1955 ఆగస్టు 13న గుంటూరు జిల్లా లోని నగరంపాలెంలో రాఘవయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించాడు. వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభను కనబరచేవాడు. పిన్నవయసులోనే రాజకీయాలపై ప్రభావితుడైనాడు.[6]
కన్నా లక్ష్మీనారాయణ 2009లో గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదవసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతడు 1989 నుండి 2004 వరకు నాలుగు సార్లు అతిపెద్ద నియోజవర్గమైన పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2014 అక్టోబరు 27న న్యూఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7]
అతడి భార్య కన్నా విజయలక్ష్మి. వారికి ఇద్దరు కుమారులు. కుమారులు కన్నా నాగరాజు గుంటూరు కార్పొరేషన్ కు మేయర్ గా, కన్నా ఫణీంద్ర వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.