From Wikipedia, the free encyclopedia
కథ కంచికి మనం ఇంటికి 2022లో విడుదలైన తెలుగు సినిమా. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమాకు చాణక్య చిన్న దర్శకత్వం వహించాడు. అరుణ్ అదిత్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అరుణ్ అదిత్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేసి,[1] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.[2]
కథ కంచికి మనం ఇంటికి | |
---|---|
దర్శకత్వం | చాణక్య చిన్న |
స్క్రీన్ ప్లే | చాణక్య చిన్న |
నిర్మాత | మోనిష్ పత్తిపాటి |
తారాగణం | అరుణ్ అదిత్ పూజిత పొన్నాడ వినోద్ కుమార్ మహేష్ మంజ్రేకర్ |
ఛాయాగ్రహణం | వైయస్ కృష్ణ |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | యమ్.పి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2022 ఏప్రిల్ 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమ్ (అరుణ్ అదిత్) తన పేరులో తప్ప జీవితంలో ప్రేమ లేదని, పెళ్లి కావడం లేదని ఫీలయ్యే యువకుడు. బెట్టింగ్ అంటే చాలు ఎంత రిస్క్ అయినా టేకప్ చేసే అమ్మాయి అమ్మాయి దీక్ష (పూజితా పొన్నాడ). కన్నయ్య ('గెటప్' శీను) దొంగ. నంది ('మిర్చి' హేమంత్) రైటర్. వేర్వేరు కారణాల చేత ఈ నలుగురూ ఓ రాత్రి స్మశానానికి వెళతారు. భయపడుతూ ఒకరికొకరు పరిచయం అవుతారు. తర్వాత స్మశానం పక్కనున్న బంగ్లాలోకి వెళతారు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది? ఆమెలోకి ఎవరెవరి ఆత్మలో ప్రవేశిస్తూ ఈ నలుగురినీ ముప్పు తిప్పలు పెడతాయి. అసలు, ఆ అమ్మాయి ఎవరు? ఆమెలో ఆత్మలు ఎవరివి? ఆత్మల పగ ఎవరి మీద? ఆ ఆత్మల నుంచి, బంగ్లా నుంచి ఆ నలుగురూ ఎలా బయటపడ్డారు? అనేది మిగతా సినిమా కథ.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.