కడియం (గ్రామం)
ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
కడియం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదేపేరుగల మండలానికి కేంద్రం. పూల తోటలకూ, పూల వ్యాపారానికీ ప్రసిధ్ధి.కడియంలో రైల్వే స్టేషను ఉంది.
కడియం (గ్రామం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°55′N 81°50′E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | కడియం |
విస్తీర్ణం | 20.33 కి.మీ2 (7.85 చ. మై) |
జనాభా (2011) | 37,149 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,700/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 18,527 |
• స్త్రీలు | 18,622 |
• లింగ నిష్పత్తి | 1,005 |
• నివాసాలు | 10,067 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 533 126 |
2011 జనగణన కోడ్ | 587550 |
ఇది సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం అక్షాంశ రేఖాంశాలు 16.9167°N 81.8333°E.సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 8 మీటర్లు (29 అడుగులు).
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 10067 ఇళ్లతో, 37149 జనాభాతో 2033 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 18527, ఆడవారి సంఖ్య 18622.[2]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 32,856. ఇందులో పురుషుల సంఖ్య 16,376, మహిళల సంఖ్య 16,480, గ్రామంలో నివాసగృహాలు 7,913 ఉన్నాయి.
గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రాజమహేంద్రవరంలోను, ఇంజనీరింగ్ కళాశాల వెలుగుబండలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్ బొమ్మూరులోను, మేనేజిమెంటు కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల బొమ్మూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి.
జాతీయ రహదారి 16, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పైన ఈ ఊరు ఉంది.
కడియంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
వరి, పూలు, కేబుళ్ళు
జి.వి.కె. ఇండస్ట్రీస్ వారి 400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కర్మాగారం కడియం సమీపంలో జేగురుపాడు వద్ద ఉంది. 1997లో ఇది ప్రారంభమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు పవర్ ప్రాజెక్టు
ఇది నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.