కందులు
From Wikipedia, the free encyclopedia
కందులు (లాటిన్ Cajanus cajan) నవధాన్యాలలో ఒకటి. భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు. కందులు [1] ఫాబేసి కుటుంబానికి చెందిన పప్పుదినుసు. కనీసం 3,500 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో పెంచడం మొదలు పెట్టినప్పటి నుండి, దాని విత్తనాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సాధారణ ఆహారంగా మారాయి. దీన్ని దక్షిణ ఆసియాలో చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. భారత ఉపఖండంలోని జనాభాకు ప్రోటీన్ యొక్క ప్రధాన వనరు ఇది. ఇది బియ్యం లేదా రోటీ (ఫ్లాట్ బ్రెడ్) తో కలిపి తినే దినుసుల్లో ఇది ప్రధానమైనది. భారతదేశం అంతటా దీన్ని ప్రధానమైన ఆహారంగా వినియోగిస్తారు.
కంది | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | క. కజాన్ |
Binomial name | |
కజానస్ కజాన్ (లి.) Millsp. | |
చరిత్ర
కంది సాగు కనీసం 3,500 సంవత్సరాల నాటిది. దీనికి మూలం బహుశా ద్వీపకల్ప భారతదేశం. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో దీనికి దగ్గరి చుట్టాలు కాజనస్ కాజనిఫోలియా ) ఉన్నాయి.[2] 3,400 సంవత్సరాల క్రితం (14 వ శతాబ్దం BC) కు కంద ఉండేదని డేటింగ్ ద్వారా తెలుస్తోంది. కొత్త రాతియుగ స్థలాలైన కర్ణాటక లోని కలుబురిగి, దాని సరిహద్దు ప్రాంతాల్లో (మహారాష్ట్ర లోని తుల్జాపూర్ గర్హి, ఒరిస్సాలో గోపాల్పూర్) ఇవి కనిపించాయి. కేరళలో దీనిని తోమారా పారు అని పిలుస్తారు.[3] భారతదేశం నుండి ఇది తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలకు ప్రయాణించింది. అక్కడే మొదటగా దీనిని యూరోపియన్లు కనుగొన్నారు. వారు దీనికి కాంగో పీ అనే పేరు పెట్టారు. బానిస వ్యాపారం ద్వారా బహుశా 17 వ శతాబ్దంలో ఇది అమెరికా ఖండానికి వచ్చింది.[4]
ఉత్పత్తి
ప్రపంచ కంది ఉత్పత్తి 4.49 మిలియన్ టన్నులు.[5] ఈ ఉత్పత్తిలో 63% భారతదేశం నుండే వస్తుంది. ఆఫ్రికా కంది ఉత్పత్తికి ద్వితీయ కేంద్రం. ప్రస్తుతం ఇది 1.05 మిలియన్ టన్నులతో ప్రపంచ ఉత్పత్తిలో 21% తోడ్పడుతుంది. మలావి, టాంజానియా, కెన్యా, మొజాంబిక్, ఉగాండాలు ఆఫ్రికాలో ప్రధాన ఉత్పత్తిదారులు.
కంది పండించే మొత్తం విస్తీర్ణం 5.4 మిలియను హెక్టార్లు అని అంచనా వేసారు.[5] 3.9 మిలియన్ హెక్టార్లు లేదా 72%తో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.
ఆహారంలో కంది
భారతదేశంలో, కంది పప్పును తూర్ అని (तूर) మరాఠీ, కందిపప్పు పప్పు (तूर दाल) లేదా 'అర్హర్' (హిందీ), కేరళలో తువర పరిప్ప అని, క్న్నడంలో తొగరి బెలే అని తమిళంలో తువరం పరుప్పు అనీ అంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఇదొకటి. ఎక్కువగా శాకాహారంలో ప్రోటీన్ కు ముఖ్యమైన వనరు ఇది. ఇథియోపియాలో, కాయలు మాత్రమే కాకుండా, లేత రెమ్మలు, ఆకులు కూడా ఉడికించి తింటారు.[6]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.