ప్రొఫెసర్ మరియు రచయిత. From Wikipedia, the free encyclopedia
కంచ ఐలయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగపు అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త, రచయిత. భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈయనను అనేకమంది విమర్శకులు (హిందువులూ, ముస్లింలు కూడా) [1] హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు.[2] తాను హిందూ మతాన్ని ద్వేషిస్తానని ఐలయ్య స్వయంగా చెప్పుకున్నాడు.[3] ఐలయ్య ఇంగ్లీషులో "Why I am not a Hindu?" పేరుతో వ్రాసిన పుస్తకం తెలుగులో నేను హిందువు నెట్లయిత? అనేపేరుతో ప్రచురితమయ్యింది.
కంచ ఐలయ్య | |
---|---|
జననం | పాపయ్యపేట, చెన్నారావుపేట మండలం, వరంగల్ గ్రామీణ జిల్లా | 1952 అక్టోబరు 5
విద్య |
|
వృత్తి | డైరక్టరు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్ష్లూజన్ అండ్ ఇంక్లూజివె పాలసీ (CSSEIP), మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాదు. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతీయ రాజకీయ విశ్లేషణ రచయిత, వక్త. దళిత-బహుజన ఉద్యమాల సిద్ధాంత కర్త, ఉద్యమకారుడు. |
సన్మానాలు | మహాత్మా జ్యోతీరావు పూలే అవార్డు.
నెహ్రూ ఫెలోషిప్ 1994-97 మాన్యవర్ కాన్షీరాం స్మృతి మాహానాయక్ పురస్కారం |
ఐలయ్య 1952, అక్టోబరు 5న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం లోని పాపయ్యపేట గ్రామంలో కురుమ గొల్ల కుటుంబంలో జన్మించాడు. ఈయన కుటుంబ వృత్తి గొర్రెల పెంపకం. ఐలయ్య గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతిశాస్త్రంలో డాక్టరేటు పొందాడు.
రెండవ తెలంగాణా ఉద్యమ నాయకత్వంలో భూస్వామ్య యుగపు ఛాయలున్నాయని, ఈ నాయకత్వంతో తెలంగాణ ఏర్పడితే షెడ్యూల్ తెగలు, జాతులు, వెనుకబడిన తరగతులు మరింత వెనకబడతారని ఐలయ్య అభిప్రాయం.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.