From Wikipedia, the free encyclopedia
ఓనమాలు 2012, జూన్ 27 న విడుదలైన తెలుగు చిత్రం. స్వచ్ఛమైన మనిషి కథ' అనేది ఉప శీర్షిక. నూతన దర్శకుడు క్రాంతి మాధవ్ సహ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం. ఈచిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది.
ఓనమాలు | |
---|---|
దర్శకత్వం | క్రాంతి మాధవ్ |
రచన | తమ్ముడు సత్యం |
నిర్మాత | క్రాంతి మాధవ్ కె.దుర్గా దేవి |
తారాగణం | గద్దె రాజేంద్ర ప్రసాద్ కళ్యాణి |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | కోటి |
పంపిణీదార్లు | సన్షైన్ సినిమా బ్లూ స్కై (విదేశాలు)[1] |
విడుదల తేదీ | జూన్ 27, 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నారాయణరావు మాస్టారు ఒక పల్లెటూరిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతడు తన విద్యార్థుల, గ్రామస్థుల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అందులోనే తృప్తిని పొందుతుంటాడు. ఆయన పదవీవిరమణ అనంతరం కొడుకు వద్దకు అమెరికా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తర్వాత తిరిగి తన ఊరికి వచ్చిన అతను పూర్తిగా మారిపోయిన పరిస్థితులను ఎదురుచూశాడు. అభిమానాలు, ప్రేమల స్థానంలో స్వార్ధం, వ్యాపార దృక్పథం విజృంభించాయి. మార్పుకు చాలా బాధపడిన మాస్టారు దానిని బాగుచేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు చేయాల్సిన మార్పును ప్రజలలో తీసుకొని రాగలిగాడా అనేది చిత్ర కథనం.[2]
ఈ సినిమాలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.
సం. | పాట | Artist(s) | పాట నిడివి |
---|---|---|---|
1. | "సూరీడు" | సాలూరి కోటీశ్వరరావు | |
2. | "అరుదైన" | శ్రీ కృష్ణ | |
3. | "పండుగంటే" | చైత్ర, కృష్ణ చైతన్య | |
4. | "హే యమ్మ" | మాళవిక | |
5. | "పిల్లలు బాగున్నారా" | నిత్య సంతోషిని |
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: సాలూరి కోటీశ్వరరావు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.