ఐటి
From Wikipedia, the free encyclopedia
ఐటి పూర్తి పేరు ఇన్ఫొర్మేషన్ టెక్నాలజీ (Information Technology) . దీనిని ఐసిటి ( Information and Communication Technology) అని కూడా పిలుస్తారు. ఈ రంగంలోని పొరుగు సేవలలో భారతదేశం, ప్రపంచంలో పేరుగాంచింది. ఇది మొదట సాఫ్ట్వేర్ సేవలతో, ఎగుమతి ప్రధానంగా ప్రారంభమైనా, తరువాత దీని ఆధారంగా కల బిపిఒ రంగంతో అనేక వ్యాపార రంగాలలోకి , జాతీయ/స్థానిక వ్యాపారాలలోకి విస్తరించింది. ఉద్యోగాల కల్పనలో ఈ రంగం ప్రధాన పాత్ర వహిస్తున్నది.

అంధ్రప్రదేశ్ లో ఐటి
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, హైద్రాబాద్ వారి గణాంకాల ప్రకారం[1]ఆంధ్ర ప్రదేశ్ [2]లో ఐటి పరిశ్రమ ఈ క్రింది విధంగా ఉంది.
సంవత్సరము | ఎగుమతులు (రు కోట్లలో) | ప్రత్యక్ష ఉద్యోగులు |
---|---|---|
2002-03 | 3668 | 71445 |
2003-04 | 5025 | 85945 |
2004-05 | 8270 | 126920 |
2005-06 | 12521 | 151789 |
2006-07 | 18582 | 187450 |
2007-08 | 26122 | 239000 |
2008-09 | 32509 | 251786 |
2008-09 లో రు. 32, 509 కోట్ల ఎగుమతులతో, 24.5% వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో పెరుగుదల 20.65 శాతంగా ఉంది. జాతీయ ఐటి ఎగుమతులలో రాష్ట్రం వాటా 15 %. 55శాతం ఐటి సేవలు, 20 శాతం బిపిఒ, 25శాతం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ , ఇతరాలుగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఎగుమతులలో 52.09% ఐటి రంగానికి చెందినవి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టిసిఎస్, విప్రో, జెన్పాక్ట్, ఒరాకిల్, డెల్, యుబిఎస్, సీమెన్స్. సొనాటా, పాట్నీ, యూనిసిస్, కన్వర్జిస్, గూగుల్ ప్రముఖ సంస్ధలు హైద్రాబాద్లో, తమ కార్యకలాపాలను విస్తరించాయి. 2, 51, 786 మంది ప్రత్యక్ష ఉద్యోగులతో దేశంలో ఐటి-బిపిఒ ఉద్యోగులలో రాష్ట్రం వాటా 11.44శాతం. అనుబంధ పరిశ్రమ (లేక పరోక్షంగా) ఉద్యోగులు 7, 92, 000తో, మొత్తం 9, 06, 430 మంది ఉపాధి పొందుతున్నారు.ఐటి పరిశ్రమ హైద్రాబాద్ , విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, వరంగల్ లలో ప్రధానంగా ఉంది.
ప్రారంభ దశలోఉద్యోగాల నియామకం
ఐటిలో పెద్దసంస్థలు ప్రముఖ వృత్తి విద్య కాలేజీ ప్రాంగణాలలో చివరి సంవత్సర విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఎక్కువ మార్కులు సాధించిన వారికిఅవకాశాలు ఎక్కువ. ఆ తరువాత స్థాయిలో సిడాక్ డిప్లొమా లాంటి కోర్సులు చదివినవారినికూడా కాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆ పై, రిఫరల్ ద్వారా, నేరుగా ఆఫీసులో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
- బిపిఒ నియామకాలకు చూడండి
- బిపిఒ
జెకెసి
2004లో జవహర్ విజ్ఞాన కేంద్రాలను (Jawahar knowledge Centre JKC), ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో, ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్ గవర్నెన్స్ (Institute of Electronic Governance) [3] ద్వారా ప్రారంభించారు.విద్యార్థి పాఠ్యప్రణాళికద్వారా నేర్చుకొనే నైపుణ్యాలకి, ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలకి వున్న ఖాళీని పూరించటానికి ఇవి ఉ పయోగపడ్తాయి. ఆధునిక కంప్యూటర్ లాబ్, సాఫ్ట్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజిమెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలులో శిక్షణ ఇస్తారు.2004 నుండి 2009 వరకు 2, 01, 320 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.[2]
ఇవీ చూడండి
- సమాచార సాంకేతిక , ప్రసారాలశాఖ (ఆంధ్రప్రదేశ్)
వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.