ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది. ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు కూడా. యునెస్కోలో 193 సభ్యులు, 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.
త్వరిత వాస్తవాలు Established, రకం ...
ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) , సాంస్కృతిక సంస్థ (United Nations Educational, Scientific and Cultural Organization) |
Established | 1945 |
---|
రకం | ప్రత్యేకమైన సంస్థ |
---|
Legal status | క్రియాశీల |
---|
వెబ్‌సైటు | www.unesco.org |
---|
మూసివేయి
దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన విధి విధాన (పాలసీ) నిర్మాణం కొరకు, అధికార చెలామణి కొరకు,, దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి.
- సాధారణ సభ : దీని సభ్యులు, సహకార సభ్యుల సమావేశాలను ప్రతి రెండేండ్లకొకసారి నిర్వహిస్తుంది. తన విధివిధానాలను, కార్యక్రమాలను తయారు చేస్తుంది.
- కార్యనిర్వాహక సంఘం (బోర్దు) : కార్యనిర్వాహక సంఘం (బోర్దు), సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
- మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను,, దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి (డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఐక్య రాజ్య విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవి: విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్కృతి,, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్.
- విద్య : యునెస్కో, విద్య ద్వారా 'అంతర్జాతీయ నాయకత్వం' కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తున్నది.
- 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ (IIEP): దీని ప్రధాన ఉద్దేశం, వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్ లు చేపట్టడం.
- యునెస్కో 'ప్రజా ప్రకటన'లిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది.
- సాంస్కృతిక, శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది, ఉదాహరణకు:
- 'ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఆఫ్ జియోపార్క్స్'
- 'బయోస్ఫియర్ రిజర్వ్స్' 1971 నుండి.
- 'సిటీ ఆఫ్ లిటరేచర్'
- 'అపాయంలో పడ్డ భాషలు'.
- 'మాస్టర్ పీసెస్ ఆఫ్ ద ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ.
- 'మెమరి ఆఫ్ ద వరల్డ్'.
- 'వాటర్ రిసోర్స్ మేనేజ్ మెంట్' 1965 నుండి.
- ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
- 'ఉపాయాలను, చిత్రాలు, పదముల ద్వారా వ్యక్తీకరించడా'నికి ప్రోత్సహించడం.
- 'భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని' ప్రోత్సహించడం.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం.
- మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం.
- వివిధ ఈవెంట్ లను ప్రోత్సహించడము, ఉదాహరణకు:
- 'ఇంటర్నేషనల్ డికేడ్ ఫార్ ద ప్రమోషన్ ఆఫ్ ఎ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్-వయోలెన్స్ ఫార్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్, (ఐక్యరాజ్యసమితి చే 1998 లో ప్రకటింపబడింది.)
- 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే'.
- 'క్రియాంకా ఎస్పెరాంకా', బ్రెజిల్ లోని ఒక టీ.వీ. గ్లోబోతో పార్టనర్ షిప్.
- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
- ప్రాజెక్టుల సంస్థాపన, ఫండింగ్ సహాయ సహకారాలు, ఉదాహరణకు:
- 'మైగ్రేషన్ మ్యూజియం'లు.
- 'యునెస్కో-యూరోపియన్ సెంటర్ ఫార్ హైయర్ ఎడ్యుకేషన్' 1972 లో స్థాపించబడింది.
- 'ఫ్రీ సాఫ్ట్ వేర్ డైరెక్టరీ', ఉచిత సాఫ్ట్ వేర్ లకు సహాయం.
- 'ఫ్రెష్ యునెస్కో', పాఠశాలల ఆరోగ్యపథాకాలు. Archived 2009-10-06 at the Wayback Machine.
- 'ఆసియా పసిఫిక్ వార్తా ఏజెన్సీల సంస్థ'
- అంతర్జాతీయ సైన్స్ కౌన్సిల్
- 'యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్స్'
- 'ఏషియన్ సింపోజియం ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ స్పెసీస్', ఆసియాలో ఈ సమావేశాలు జరిగాయి.
- 'బాటనీ 2000', టాక్జానమీ, మెడిసినల్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇతర వాతావరణ కాలుష్య వ్యతిరేక కార్యక్రమాలు.
యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రదానము చేస్తుంది. ఉదాహరణకు :
- 'మైక్రో బయాలజీలో 'కార్లోస్' బహుమతి.'
- 'ఫెలిక్స్ హౌఫూట్-బాయినీ 'శాంతి బహుమతి'.'
- 'గ్రేట్ మాన్-మేడ్ రివర్ ఇంటర్నేషనల ప్రైజ్ ఫార్ వాటర్ రీసోర్సెస్ ఇన్ అరిడ్ అండ్ సెమి-అరిడ్ ఏరియాస్.'
- 'ఇంటర్నేషనల్ జోస్ మార్టి ప్రైజు.'
- 'ఇంటర్నేషనల్ సైమన్ బోలివర్ ప్రైజు.'
- 'జావేద్ హుసేన్ ప్రైజ్ ఫార్ యంగ్ సైంటిస్ట్.'
- 'జిక్జీ వరల్డ్ ప్రైజ్', వ్రాత ప్రతుల సంరక్షణల కొరకు.
- 'కళింగ ప్రైజ్', శాస్త్రాలను ప్రచారం చేసినందుకు.
- 'లోరియల్-యునెస్కో అవార్డు', శాస్త్రాలను శోధించినందుకు స్త్రీలకు ఇస్తారు.
- 'సెర్గీ ఐన్ స్టైన పతకం', సినిమాటోగ్రఫీ కళలలో.
- 'సుల్తాన్ ఖబూస్ ప్రైజ్ ఫార్ ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్.'
- 'యునెస్కో గ్యుల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజు.'
- 'యునెస్కో కింగ్ హమ్మాద్ బిన్ ఇసా అల్-ఖలీఫా ప్రైజ్ ఫార్ ద యూజ్ ఆఫ్ ఐ.సీ.టీ. ఇన్ ఎడ్యుకేషన్.'
- 'యునెస్కో మొజార్ట్ పతకం', ప్రపంచ శాంతి కొరకు సంగీతం, కళా రంగాలలో పనిచేసినందుకు.
- 'యునెస్కో ప్రైజ్ ఫార్ పీస్ ఎడ్యుకేషన్.'
- 'యునెస్కో ప్రైజ్ ఫార్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్.'
- 'యునెస్కో సైన్స్ ప్రైజ్.'
- 'యునెస్కో ఇన్స్టిట్యూట్ పాశ్చర్ పతకం.'
- 'యునెస్కో ఆర్టిస్ట్స్ ఫార్ పీస్.'
- 'క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్.'
- 'సీల్ ఆఫ్ ఎక్సల్లెన్స్ ఫార్ హ్యాండీక్రాఫ్ట్స్.'
యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో గలదు. దీని కార్యాలయాలు ప్రపంచంలోని అనేక దేశాలలో గలవు.