From Wikipedia, the free encyclopedia
ఎయిర్ బెర్లిన్ అనేది జర్మనీ యొక్క రెండో అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థ. దీనికంటే ముందు ర్యాంకులో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఉంది. అంతేకాదు ప్రయాణికులను తీసుకెళ్లే అతి పెద్ద వైమానిక సంస్థల్లో యూరప్ ఖండంలో ఎనిమిదో అతి పెద్ద ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించింది.[2] ఈ ఎయిర్ లైన్ యొక్క నెట్ వర్క్ జర్మనీలోని 17 నగరాలతో పాటు అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు విస్తరించి ఉంది. [3]
| ||||
స్థాపితము | 1978 (as Air Berlin USA) | |||
---|---|---|---|---|
కార్యకలాపాల ప్రారంభం | 1979 | |||
Hubs |
| |||
దృష్టి సారించిన నగరాలు |
| |||
m:en:Frequent-flyer program | topbonus | |||
Alliance |
| |||
Subsidiaries |
| |||
Fleet size | 131 | |||
గమ్యస్థానములు | 171 | |||
సంస్థ నినాదము | Your Airline. | |||
మాతృసంస్థ | airberlin group | |||
ప్రధాన కార్యాలయము | Airport Bureau Center Charlottenburg-Wilmersdorf, Berlin, Germany | |||
కీలక వ్యక్తులు |
| |||
ఆదాయము | € 4.15 billion (2013)[1] | |||
Operating income | € -231.9 million (2013)[1] | |||
స్థూల ఆదాయమ్ | € -315.5 million (2013)[1] | |||
మొత్తం ఆస్తులు | € 1.89 billion (2013)[1] | |||
Total equity | € -186.1 million (2013)[1] | |||
ఉద్యోగులు | 8,905 (12/2013)[1] |
ఎయిర్ బెర్లిన్ అనేది ప్రధానంగా జర్మనీ వైమానిక సంస్థ. ఇది బెర్లిన్ ఆధారంగా పనిచేస్తుంది. 1978లో ఇది ఎయిర్ బెర్లిన్ యు.ఎస్.ఎ. పేరుతో ప్రారంభమైంది. దీని కార్యకలాపాలు 1979లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇది ప్రపంచస్థాయి ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించింది. 2001 నుంచి ఈ సంస్థ ఇథిహాద్ ఎయిర్ వేస్ తో భాగస్వామ్యం పొందింది. అంతేకాదు ఈ సంస్థ వన్ వరల్డ్ గ్లోబల్ సమూహంలో సభ్యత్వం కలిగి ఉంది. [4]
ప్రధాన వ్యాసం: ఎయిర్ బెర్లిన్ గమ్యాలు
ఈ వైమానిక సంస్థ యునైటెడ్ స్టేట్స్, కరేబియన్, సౌత్ ఈస్ట్ ఆసియాతో పాటు సెలవు విడిది ప్రాంతాలుగా పేరుగాంచిన మెడిటేరనియన్ ప్రాంతం, క్యానరీ దీవులు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల సహా మొత్తం 40 దేశాల్లోని 150 షెడ్యూలు గమ్యస్థానాలకు విమానాలు నడిపిస్తోంది.
ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్ బెర్లిన్ పలు విమానాలు నడిపిస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఎయిర్ బస్, బోయింగ్, క్యూ-400 రకాల విమానాలను ఈ సంస్థ నడిపిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సరికొత్త విమానాలను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది.
ఏప్రిల్-2015 నాటికి ఎయిర్ బెర్లిన్ విమానాల సముదాయంలో ఉన్న విమానాల వివరాలు [5]
బెర్లిన్ విమానాలు | ప్రయాణికులు[107] | సూచనలు | |||||
---|---|---|---|---|---|---|---|
విమానం | సేవలో | ఆర్డర్లు | ఆప్షన్లు | సి | వై | మొత్తం | |
ఎయిర్
బస్ ఎ319-100 |
5 | 4 | _ | _ | 150 | 150 | బెలైర్ నిర్వహిస్తోంది |
ఎయిర్
బస్ ఎ320-200 |
44 | 6 | _ | _ | 180 | 180 | బెలైర్ నిర్వహిస్తోంది |
ఎయిర్
బస్ ఎ321-200 |
16 | 14 | _ | _ | 210 | 210 | 2015
నాటికి రావాల్సి ఉంది |
ఎయిర్
బస్ ఎ330-200 |
14 | _ | _ | 19 | 279 | 298 | |
బోయింగ్
737-700 |
8 | _ | _ | _ | 144 | 144 | టి.యు.ఐ.ఫ్లై
నుంచి 6అద్దెకు, జెర్మనియా నుంచి మరో 2 అద్దెకు |
బోయింగ్
737-800 |
28 | 2 | _ | _ | 186 | 186 | టి.యు.ఐ.ఫ్లై
నుంచి 6అద్దెకు |
బాంబార్డియర్
డాష్ 8 క్యూ400 |
17 | _ | _ | _ | 76 | 76 | ఎల్.జి.డబ్ల్యూ
నిర్వహణ |
మొత్తం | 131 | 26 | — |
ఎయిర్ బెర్లిన్ వెబ్ చెక్ ఇన్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఎకానమీ తరగతిలో ప్రయాణించే వారికి కూడా సరికొత్త అనుభూతి కలిగించే సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన సీట్లు, టీవీ స్క్రీన్లు, పిల్లల కోసం వీడియో గేమ్స్ ఉంటాయి. వ్యాపార తరగతి లో పడుకోవడానికి వీలుగా ఉండే లై-ఫ్లాట్ బెడ్లతో పాటు అనేక వ్యక్తిగత సదుపాయాలు ఉంటాయి. ఎయిర్ బెర్లిన్ బ్యాగెజ్ అలవెన్స్ కింద ఉచితంగా 8 కిలోల బరువు వరకు ఒక ప్యాక్ ను అనుమతిస్తారు. కొన్ని తరగతుల్లో నిబంధనల మేరకు మరో ప్యాక్ ను కూడా అనుమతించవచ్చు. ఫీజు తీసుకుని అనుమతించే బ్యాగేజ్ ను 23 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. [6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.