Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
ఎటా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఎటా జిల్లాకు ముఖ్యపట్టణం. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్లో భాగం. ఎటా, కాన్పూర్- ఢిల్లీ హైవే [1] పై ఉంది, సమీప నగరాలు కస్గంజ్, అలీగఢ్. [2] ఉర్దూ కవి అమీర్ ఖుస్రో ఎటాలోని పాటియాలీలో జన్మించాడు
ఎటా | |
---|---|
పట్టణం | |
Coordinates: 27.63°N 78.67°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | ఎటా |
Founded by | రాజా దిల్ సుఖ్ రామ్ బహదూర్ |
జనాభా (2011) | |
• Total | 1,31,023 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP-82 |
Website | http://etah.nic.in/ |
7 వ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు జువాన్జాంగ్ ఎటా ప్రాంతాన్ని వర్ణిస్తూ, దేవాలయాలు మఠాలతో సమృద్ధిగా ఉందని పేర్కొన్నాడు. 8 వ శతాబ్దానికి ముందు బౌద్ధమతం అణచివేత, గిరిజనుల ఆధిపత్యం తరువాత, తూర్పు వైపుకు వలస వెళ్ళే యాదవులు ఈ ప్రాంతంపై పట్టు సాధించారు. మిగతా ఎగువ భారతదేశంతో పాటు ఇది కూడా 1017 లో ఘజనీ మహమూద్ ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తరువాత ఇది ముస్లిం సామ్రాజ్యంతో పాటు ఉత్థాన పతనాలను చూసింది. 18 వ శతాబ్దం చివరలో, వజీర్ అలీ ఖాన్ పాలించిన ప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. 1801 లో లక్నో ఒప్పందం ప్రకారం బ్రిటిష్ రాజ్యంలో చేరింది.
ఎటా 27.63°N 78.67°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 170 మీటర్ల ఎత్తున ఉంది. ఈసన్ నది పట్టణం గుండా ప్రవహిస్తుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఎటా పట్టణ సముదాయం జనాభా 1,31,023. వీరిలో పురుషులు 69,446, ఆడవారు 61,577. అక్షరాస్యత 85.62% [4]
2001 జనగణన ప్రకారం, [5] ఎటా జనాభా 107,098. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభా 10% పెరిగింది. అంతకుముందు దశాబ్దంలో 36%తో పోలిస్తే ఇది బాగా తక్కువ.[6] పట్టణంలో 20,303 గృహాలు ఉన్నాయి. మహిళల జనాభా 55,927 కాగా, మొత్తం జనాభాలో పురుషులు 62,590 మంది ఉన్నారు. జనాభాలో 11,786 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు కాగా, 65 మంది షెడ్యూల్డ్ తెగల వారున్నారు.
ఎటా అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీ అక్షరాస్యత 63%. ఎటా జనాభాలో 14% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
ఎటాలో రైలు మార్గాన్ని భారతదేశ మొదటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ 1959 లో ప్రారంభించాడు. [7] రైలు ఎటా నుండి తుండ్లా వరకు, అలాగే కస్గంజ్, అలీగఢ్ వరకు నడుస్తుంది. ఢిల్లీ, ఆగ్రా, అలీగఢ్ లకు ప్రత్యక్ష రైళ్ల కోసం సర్వేను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఎటా నుండి ఆగ్రా వరకు ఎటా-ఆగ్రా ఫోర్ట్ ప్యాసింజర్ స్పెషల్ నడవడం మొదలైంది. [8] [9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.