ఎం. ఎస్. రాజు
From Wikipedia, the free encyclopedia
ఎం. ఎస్. రాజు ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత,, దర్శకుడు. ఇతని తండ్రి రాయపరాజు కూడా నిర్మాతే. అతడు 'ప్రేమతరంగాలు', 'ప్రియ', 'ఎమ్ఎల్ఎ ఏడుకొండలు', 'దండయాత్ర' వంటి సినిమాలను నిర్మించాడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.[1] ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా తూనీగ తూనీగ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు.[2] ఆయన నిర్మించిన చిత్రాల్లో నటుడిగా చిన్న పాత్రలో కనిపించడం ఆయనకు అలవాటు.[3]
ఎం. ఎస్. రాజు | |
---|---|
వృత్తి | సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు |
పిల్లలు | సుమంత్ అశ్విన్ |
చిత్రాలు
నిర్మాతగా ఆయన మొదటి చిత్రం వెంకటేష్ కథానాయకుడిగా నటించిన శత్రువు.[4] మొదటి రెండు సినిమాలు విజయం సాధించినా మూడో సినిమాతో బాగా నష్టం చవిచూశాడు.
- శత్రువు
- పోలీస్ లాకప్
- స్ట్రీట్ ఫైటర్
- దేవి
- దేవీ పుత్రుడు
- ఒక్కడు
- వర్షం
- మనసంతా నువ్వే
- నీ స్నేహం
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- పౌర్ణమి
- ఆట
- వాన
- మస్కా
రచయితగా
దర్శకత్వం
- తూనీగ తూనీగ (2012)
- డర్టీ హరి (2020) [6]
- 7 డేస్ 6 నైట్స్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.