Remove ads
From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినుటవలన యూరినల్లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
[Grapes+Nutritional+value.jpg]
కిస్మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.
1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .
2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది . 3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది . 4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును . 5. జ్యరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది . 6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును . 7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును . 8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది . 9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.