Remove ads
ఉత్తరాఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉధంసింగ్ నగర్ జిల్లా (హింది:ऊधम सिंह नगर ज़िला) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిలాలలో ఒకటి. జిల్లాకు ప్రధానకేంద్రం రుద్రాపూర్. ఇది తెహ్రీ భూభాగంలో ఉంది. ఈ జిల్లాలో బజ్పూర్, గడర్పుర్, జాస్పుర్, కాశీపూర్, కిచ్చా, ఖతిమా, సితర్గని అని 7 తాలూకాలు (తెహ్సిల్స్) ఉన్నాయి. ఈ జిల్లా తెరియా ప్రాంతంలో కుమాన్ విభాగంలో ఉంది.జిల్లా ఉత్తరదిశలో నైనీతాల్, ఆగ్నేయదిశలో చంపావత్, తూర్పు దిశలో నేపాల్ దేశం, దక్షిణ, పడమర దిశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. 1995లో నైనీతాల్ నుండి కొంత భుభాగం తీసూని ఈ జిల్లా స్థాపించబడింది. 2011 గణాంకాలను అనుసరించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇది జనసంఖ్యలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానాలలో హరిద్వార్, డెహ్రాడూన్ ఉన్నాయి.[1] వ్యవసాయ పరిశోధకులకు, ఇంజనీర్లకు గుర్తింపు పొందిన " గోవింద వల్లభ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నలజీ " రుద్రాపూర్కు 5 కి.మీ దూరంలో ఉంది.
ఉధంసింగ్ నగర్ జిల్లా
ऊधम सिंह नगर ज़िला | |
---|---|
జిల్లా | |
Coordinates: 28.98°N 79.40°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
డివిజను | సబ్ డివిజను |
Seat | రుద్రాపూర్ |
విస్తీర్ణం | |
• Total | 2,908 కి.మీ2 (1,123 చ. మై) |
జనాభా | |
• Total | 12,35,614 |
• జనసాంద్రత | 425/కి.మీ2 (1,100/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
2011 గణాంకాలను అనుసరించి ఉద్దం సింగ్ నగర్ జనసంఖ్య 16,48,367.[1] ఇది దాదాపు గునియా-బిస్సు దేశ జనసంఖ్యతో సమానం.[2] లేక అమెరికా నగరమైన ఇదహో జనసంఖ్యకు సమానం.[3] భారతీయ జిల్లాలు (688) లో ఉధంసింగ్ నగర్ జిల్లా 303వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 648.[1] 2001-2011 జిల్లా కుటుంబ నియంత్రణ శాతం 33.4%.[1] ఉధంసింగ్ నగర్ జిల్లా స్త్రీపురుష నిష్పత్తి 919:1000.[1] అలాగే అక్షరాస్యత శాతం 74.44%.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.