ఇలపావులూరి పాండురంగారావు

From Wikipedia, the free encyclopedia

ఇలపావులూరి పాండురంగారావు

ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.

త్వరిత వాస్తవాలు ఇలపావులూరి పాండురంగారావు, జననం ...
ఇలపావులూరి పాండురంగారావు
Thumb
వక్తగా ఇలపావులూరి
జననంఇలపావులూరి పాండురంగారావు
(1930-03-15)1930 మార్చి 15
ఇలపావులూరు గ్రామం,ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2011 డిసెంబరు 25
ఢిల్లీ
మరణ కారణంఅల్జీమర్స్ వ్యాధి
వృత్తిఉపాధ్యాయుడు
మతంహిందూ
భార్య / భర్తరాధామహాలక్ష్మి
పిల్లలుఐ.వి.సుబ్బారావు
తండ్రివెంకటసుబ్బయ్య
తల్లిసరస్వతి
మూసివేయి

జీవిత విశేషాలు

ఇతడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, ఇలపావులూరు గ్రామంలో 1930, మార్చి 15వ తేదీన సరస్వతి, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. బి.ఇడి చదివాడు. ఇలపావులూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా కొన్ని రోజులు పనిచేశాడు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరుగా పనిచేశాడు. భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి, భారతీయ జ్ఞానపీఠ్‌కు డైరెక్టరుగా పనిచేశాడు. ఇతనికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు.సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య, ఐతరేయ, కఠోపనిషత్తులను తెలుగులోనికి గేయాలుగా తర్జుమా చేశాడు. త్యాగరాజకీర్తనలను హిందీలో గేయరూపంలో అనువదించాడు. బలివాడ కాంతారావు నవల ఇదే స్వర్గం, ఇదే నరకం రంగనాయకమ్మ నవల పేకమేడలు మొదలైనవాటిని హిందీలోనికి అనువాదం చేశాడు. ఇతడు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతూ తన 81 యేట 2011, డిసెంబర్ 25న మరణించాడు.

రచనలు

  1. అనుదిన రామాయణము
  2. ఆది-అనాది[1]
  3. కామాయని (హిందీ నుండి అనువాదం)
  4. చిదంబర (హిందీ నుండి అనువాదం)
  5. కన్నీరు (హిందీ కవి జయశంకర ప్రసాద్ రాసిన ఆఁసూ కావ్యానికి అనువాదం)
  6. మెట్టుకు పై మెట్టు (తకళి శివశంకరపిళ్ళై మలయాళ నవలకు అనువాదం)
  7. సహస్రధార
  8. శ్రీ సహస్రిక
  9. ఆత్మానందలహరి
  10. శ్రీ విష్ణు సహస్రనామం (వ్యాఖ్యానం)
  11. బాబా ఫరీద్ సూక్తులు[2]
  12. ఇహం - పరం (కఠోపనిషత్తు కావ్యానువాదం)
  13. తులసీమంజరి
  14. మీరామాధురి
  15. ఉపనిషత్సుధ
  16. Valmiki - Makers Of Indian Literature
  17. The Art of Translation ( సహ రచయిత: ఉమాశంకర జోషి)
  18. The universe that is god
  19. Women in Valmiki
  20. vedamu venkataraya sastri
  21. रामायण के महिला पात्रा
  22. सत्य सती
  23. संत त्यागराज

పురస్కారాలు

  • 1966లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాదకుడుగా పురస్కారం
  • 1938లో కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద ప్రక్రియలో అవార్డు
  • 2003లో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిచే విశిష్ట పురస్కారం
  • ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ వారి సత్కారం మొదలైనవి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.