From Wikipedia, the free encyclopedia
ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3][4]
ఆలె వెంకటేశ్వర్ రెడ్డి | |||
పదవీ కాలం 2014 - 2018, 2018 - 2023 డిసెంబర్ 03 | |||
తరువాత | గవినోళ్ల మధుసూదన్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | దేవరకద్ర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 30 సెప్టెంబర్ 1968 అన్నాసాగర్, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రఘుపతి రెడ్డి, వరలక్ష్మి | ||
జీవిత భాగస్వామి | మంజుల | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు (ప్రీతి)[1] | ||
మతం | హిందూ |
వెంకటేశ్వర్ రెడ్డి 1968, సెప్టెంబరు 30న రఘుపతి రెడ్డి, వరలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, భూత్‌పూర్ మండలంలోని అన్నసాగర్ గ్రామంలో జన్మించాడు. బిఈ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.[5] తండ్రి రఘుపతి గ్రామ సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, జెడ్పీటిసిగా పనిచేశాడు.
వెంకటేశ్వర్ రెడ్డికి మంజులతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొంతకాలం కాంట్రాక్టర్ గా పనిచేసిన వెంకటేశ్వర్ రెడ్డి తన తండ్రి వారసత్వంతో 2002లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2006లో జెడ్పీటిసిగా ఎన్నికయ్యాడు.[6] 2011-2013 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ పై 16,922 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[7][8] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. పవన్ కుమార్ పై 34,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9][10] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో దేవరకద్ర నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[11][12]
చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
Seamless Wikipedia browsing. On steroids.