ఆలాపన (సినిమా) వంశీ దర్శకత్వంలో మోహన్, భానుప్రియ ప్రధానపాత్రల్లో నటించిన 1985 నాటి తెలుగు చలనచిత్రం

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ఆలాపన (సినిమా)
(1985 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం వంశీ
నిర్మాణం అమరేందర్ రెడ్డి
తారాగణం మోహన్ (నటుడు),
భానుప్రియ,
రూప
సంగీతం ఇళయరాజా
కూర్పు అనిల్ మల్నాడ్
భాష తెలుగు
మూసివేయి

కథ

ఉష (భానుప్రియ) ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. ఆమెకి నృత్యం అంటే చాలా ఇష్టం. ఆమె జీవితాశయం అన్ని నృత్య రీతులను మేళవించి, ఒక క్రొత్త రీతిని సృష్టిoచడం. బెనర్జీ (ప్రదీప్ శక్తి), ఒక చెడ్డ వ్యక్తి, మోసపూరితంగా ఉషని చిన్నప్పుడే పెళ్లి చేసుకుని, చాలా ఏళ్ల తరవాత వచ్చి తనను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ఉష తన స్నేహితురాలి సహాయంతో అతడినించి తప్పిచ్చుకోవడానికి ఒక ట్రైన్ ఎక్కి పారిపోతుంది. మార్గమధ్యంలో, ఒక అద్భుతమైన గొంతులో పాట విని, తన స్నేహితురాలితో సహా, ఆ స్టేషన్లో దిగుతుంది. ఆ పాట పాడింది శివుడు (మోహన్) అని తెలుసుకొని, కాలగమనంలో, శివుడితో ప్రేమలో పడుతుంది. అయితే, తన గురువైన దీక్షితులు వారించడంతో, ప్రేమని ప్రక్కనపెట్టి, మళ్లీ నృత్య సాధనలో నిమగ్నమవుతుంది. ఇంతలో బెనర్జీ ఉష ఉన్నచోటు తెలుసుకొని, తనను చంపడానికి వస్తాడు. శివుడు, ఉష, గ్రామస్థుల సహాయంతో బెనర్జీని చంపి, ఒక్కటవుతారు.[1]

సంగీతం

స్వరకల్పన, గీతరచన

సినిమాకు సంగీతాన్ని ఇళయరాజా అందించారు. పాటలు వేటూరి, సి.నారాయణ రెడ్డి రాశారు.

పాటలు

ఇళయరాజా.

మరింత సమాచారం క్రమసంఖ్య, పేరు ...
మూసివేయి

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.