డా. ఆరెకపూడి రమేశ్ చౌదరి (నవంబరు 28, 1922 - ఏప్రిల్ 30, 1983) ఆయన హిందీ, ఆంగ్ల భాషలలో సమ ప్రతిభ గలవారు. ఆకాశవాణిలో ఆయన డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.

జననం

1922, నవంబరు 28కృష్ణా జిల్లా ఉయ్యూరులో రమేశ్ చౌదరి జన్మించారు. పత్రికా రచయితగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. హిందూ, Free Press Journal, ఇండియన్ రిపబ్లిక్ పత్రికలలో ఆయన పనిచేశారు. హిందూస్తాన్ టైమ్స్, ఫోరమ్‌ పత్రికల కరస్పాండెంట్ గా వ్యవహరించారు.

హిందీలో దాదాపు పాతిక చక్కటి నవలలు వ్రాశారు. తెలుగు మాతృభాష అయినా తలస్పర్శిగా హిందీ భాషాభిమానుల ప్రశంసలు అందుకొన్నారు. ఆయన నవలలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏడు బహుమతులిచ్చింది. అది ఒక విశిష్ట గౌరవం 'సాఠ్‌గాంఠ్' నవల భారత ప్రభుత్వం బహుమతినందుకొంది. ఆయన రచనలు విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలుగా ఎంపిక చేయబడ్డాయి.

సారా సంసార్ మేరా, నిర్లజ్జ, ధన్యభక్షు, ఉధార్ కే పంఖ్, అప్నే పరాయ్ నదీ కా శోర్ వీరి నవలల్లో ప్రముఖాలు. వీరి నవల రష్యన్ భాషలోని అనువదించబడడం మరో విశేషం. అడవి బాపిరాజు 'నారాయణరావు ' నవలను వీరు హిందీలోంకి అనువదించారు.

చందమామ, దక్షిణ భారత్ పత్రికలకు ఆయన కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధులు కూడా. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రం ప్రభుత్వం నుండి పొందారు. 1980లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.

రమేశ్ చౌదరి ఆకాశవాణిలో హిందీ ప్రవచన శాఖ ప్రొడ్యూసర్గా చేరారు కొంతకాలానికి డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా ప్రొమోట్ అయి ఢిల్లీ బదలీ అయ్యారు. 1979లో ఆయన ఆ పదవితో పాటు మదరాసు బదలీ అయ్యారు. 1980 సం|| నవంబరులో మదరాసులో ఆయన పదవీ విరమణ చేశారు. ఆకాశవాణి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో రెండేళ్ళు పనిచేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.

మరణం

1983, ఏప్రిల్ 30 న రమేశ్ చౌదరి కాలధర్మం చెందారు.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.