Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[2]
ఆరవల్లి జిల్లా
અરવલ્લી જીલ્લો | |
---|---|
జిల్లా | |
Coordinates: 24.0283°N 73.0414°E | |
ప్రధాన కార్యాలయం | మొడసా |
Named for | అరవల్లి హిల్స్ |
జనాభా (2013) | |
• Total | 1.024 Million [1] |
• Summer (DST) | IST (UTC+05:30) |
గుజరాత్, రాజస్థాన్ ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .[3] గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస, శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.[4]
2013లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[5] జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 2012లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[6]
బనస్ కాంతా జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద, భయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది. [1]
జిల్లాలోని మెఘరాజ్, మల్పూర్, భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.[4] జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.[1]
జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు, శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.[1]
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.[1] జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా, ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.