ఆడెల్లి పోచమ్మ దేవాలయం

From Wikipedia, the free encyclopedia

ఆడెల్లి పోచమ్మ దేవాలయంmap

ఆడెల్లి పోచమ్మ దేవాలయం, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆడెల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం. ఏకశిలపై వెలసిన అమ్మవారు నాలుగు చేతులలో త్రిశూలం, ఢమరుకం అభయహస్తం ,అక్షయపాత్రతో కుడికాలిని అసురుని పై ఉంచి దర్శనమిస్తూ, తనతో పాటు ఏడుగురు అక్కాచెల్లెళ్ళతో కలిసి పూజలందుకుంటున్న ఆడెల్లి పోచమ్మ, పెరుగన్నాన్ని నైవేద్యంగా స్వీకరిస్తూ భక్తుల కోర్కెలను తీరుస్తోంది.

త్వరిత వాస్తవాలు ఆడెల్లి పోచమ్మ దేవాలయం, భౌగోళికాంశాలు : ...
ఆడెల్లి పోచమ్మ దేవాలయం
Thumb
పోచమ్మ ఆలయం ఆడెల్లి
Thumb
ఆడెల్లి పోచమ్మ దేవాలయం
ఆడెల్లి పోచమ్మ దేవాలయం
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:ధర్మరాజు కొండ
పాండవుల క్షేత్రం
పెద్దయ్య క్షేత్రంగా
ప్రధాన పేరు :ఎల్లారం పోచమ్మ ఆలయం
దేవనాగరి :पोचम्म देवी देवस्थान आडेल्लि
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామంలో
ప్రదేశం:ఆడెల్లి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పోచమ్మ
ఉత్సవ దేవత:పోచమ్మ తల్లి
ముఖ్య_ఉత్సవాలు:గంగా నీళ్ళ జాతర
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి
మూసివేయి

ఈ అమ్మవారి దర్శనానికి తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్,మధ్యప్రదేశ్,ఒడిషా,మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ప్రతి ఆదివారం భక్తుల తాకిడితో ఇక్కడి వాతావరణం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను తలపిస్తుంది.[1]

Thumb
ఆడెల్లి పోచమ్మ తల్లి ఆడెల్లి సారంగాపూర్

చరిత్ర

పూర్వకాలంలో ఆడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితిలో అనారోగ్యాలతో ప్రజలు చనిపోవడంతో ఊర్లన్ని శ్మశానాలుగా మారిపోయాయి. దాంతో తమను కాపాడమని శివుడిని ప్రార్థించగా, తన కుమార్తె అయిన పోచమ్మను శివుడు ఈ ప్రాంతానికి రక్షకురాలిగా పంపించాడు. తండ్రి ఆదేశాలతో ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన పోచమ్మ, భక్తుల కోర్కెలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని స్థల పురాణం చెబుతోంది. పూర్వం నుంచి పసుపుతోనే పూజిస్తుండడంవల్ల, ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తుంటాయి. అమ్మవారిని దర్శించుకున్న తరువాత దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వంటలు చేసుకొని సహ [2]పంక్తి భోజనాలు చేస్తారు.[1]

ప్రత్యేకత

  • దేశంలో మరెక్కడా లేనివిధంగా శివపార్వతుల ఏడుగురు కుమార్తెలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ దేవాలయ గర్భగుడిలో ఉన్నాయి.
  • ఇక్కడి పోచమ్మ తల్లికి పెరుగన్నమంటే చాలా ఇష్టం. భక్తులు ఇక్కడి కోనేటి నీటితో అన్నం వండి పెరుగుతో కలిపి పోచమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
  • దేవాలయం ముందు రూపాయి బిల్లలను నిల్చునేలా పెడితే కిందపడకుండా ఉంటాయి.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులలో ఈ దేవాలయంలో గంగనీళ్ళ జాతర జరుగుతుంది. దసరాకు ముందు వచ్చే (అమావాస్య) తర్వాత శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. ఆందులో భాగంగా శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలనూ తీసుకుని సారంగాపూర్, యాకర్పల్లి, గొడిసెర, వంజర్, పియారామూర్, కదిలి, దిలావార్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర ప్రయాణించి సంగ్వీ సమీపంలోని గోదావరి నది తీరానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి, ఆదివారం వేకువ జామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేసి, ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకుని సాయంత్రానికి దేవాలయానికి తీసుకువస్తారు. అమ్మవారి ఆభరణాలను దర్శించుకోడానికి నిర్మల్, నిజామాబాదులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరువుతారు.[3]

పునర్నిర్మాణం

2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. 65 లక్షల రూపాయలతో దేవాలయ ప్రహరీగోడ, కోనేరు, సీసీ రోడ్లు నిర్మించబడ్డాయి. పోచమ్మతల్లి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 11 కోట్ల రూపాయలతో ఈ దేవాలయ పునర్నిర్మాణం చేపట్టనున్నారు. దేవాలయ విస్తరణ నిర్మాణంలో భాగంగా బాలాలయం నుంచి భక్తులకు అమ్మవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లుచేయనున్నారు. మొదటి దశలో 3 కోట్ల రూపాయలతో గర్భగుడి, అర్థ మండప, విమాన గోపురం నిర్మించనున్నారు.[4]

జాతర

ఆడెల్లి పోచమ్మ జాతర సెప్టెంబర్, అక్టోబరు నెలలో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.ఈ జాతరను గంగ నీళ్ళ జాతర అని అంటారు. శనివారం రోజున ఉదయం శ్రీ మహా పోచమ్మ తల్లి వారి ఆభరణాలతో సేవా దారులు గోదావరి నదికి బయలుదేరింది జరుగుతుంది. గోదావరి నది లో అమ్మా వారి ఆభరణాలైన శుద్ధి చేసుకోని గోదావరి నది నీళ్ళు తీసుకొని తిరిగి దేవాలయాలకు వచ్చి సాయింత్రం సమయంలో అమ్మవారిని గంగా జలంతో అభిషేకం చేసి పవిత్రోత్సవము నిర్వహిస్తారు.జాతరకు వచ్చిన భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జాతర చేసుకుని ఇంటికి ‌వేళ్ళుతారు[5].

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.