ఆజాదీ కా అమృత్ మహోత్సవం
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళైన సందర్భంగా ఏడాది పాటు జరిపిన ఉత్సవం From Wikipedia, the free encyclopedia
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (आजादि का अमृत महोतसव), ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది.[1] 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది.[2] జన-భాగీదారి స్ఫూర్తితో దీనిని జనోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార ప్రముఖులతో జాతీయ అమలు కమిటీ ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం) | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
రకం | జతీయ |
ప్రాముఖ్యత | భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్బంగా 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది |
ప్రారంభం | 12 మార్చ్ 2021 |
ముగింపు | 15 ఆగస్టు 2023 |
జరుపుకొనే రోజు | 15 ఆగష్టు 2022 |
ఉత్సవాలు | జెండా ఎగురవేయడం, కవాతు, బాణసంచా కాల్చడం, దేశభక్తి పాటలు పాడటం, జాతీయ గీతం జన గణ మన, భారత ప్రధాని, భారత రాష్ట్రపతి ప్రసంగం |
సంబంధిత పండుగ | స్వాతంత్ర్య దినోత్సవం |
ఆవృత్తి | వార్షిక |
ఈ మహోత్సవ్ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాతుంది. 2021 మార్చి 12 న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ లోని నవ్‌సారి జిల్లాలోని జలాల్‌పూర్ తాలూకాలో ఉన్న దండి వరకు 241 మైళ్ల దూరం పాదయాత్రను నిర్వహిస్తారు.ఈ పాదయాత్ర 25 రోజులు పాటు సాగి 2021 ఏప్రిల్ 5న దండిలో ముగుస్తుంది.
వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్ ప్రదేశ్ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు.[3]
తెలంగాణ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర భారత అమృతోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయించారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్కతిక శాఖ డైరక్టర్‌లుగా ప్రభుత్వం నియమించింది.[4] ఇందులో భాగంగా 2022లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగష్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు మొత్తంగా 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడకలను నిర్వహించబడుతున్నాయి. ఆగస్టు 15న గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలుతో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.
కార్యక్రమాలు
- స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా 2021, మార్చి 12న తొలి కార్యక్రమంగా హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించాడు.[5]
- 2021 మార్చి 24న రెండో వారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్‌ను నిర్వహించారు.[6][7]
- 2021, ఏప్రిల్ 3న మూడో వారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాన్ని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాస్థాయి కవి సమ్మేళనాలు నిర్వహించారు. కవి సమ్మేళనానికి "స్వాతంత్ర్య స్ఫూర్తి"ని "ధీమ్"గా నిర్వహించారు.[8]
- 2021, ఏప్రిల్ 9న నాల్గొవ వారం హైదరాబాదు తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ & రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్‌ఓబీ) సంయుక్త ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్య పోరాటంపై ఏడు రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహించారు.[9]
చిత్రమాలిక
భారతదేశ ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా 2021 ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది.
- కవి సమ్మేళనంలో పాల్గొన్న ముఖ్యఅతిథులు కేవీ రమణా చారి, మామిడి హరికృష్ణ తదితరులు
- కవులను సన్మానిస్తున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ
- కవి అనసూయ
- కవి అన్నవరం దేవేందర్
- కవి అన్వర్
- కవి అరుణ నాదరభట్ల
- కవి అవుసల భాను
- కవి ఆయాచితం నటేశ్వర శర్మ
- అయినంపూడి శ్రీలక్ష్మీ
- కవి బిల్లా మహేందర్
- కవి దొరవేటి
- కవి గాజోజు నాగభూషణం
- కవి ఘనపురం దేవేందర్
- కవి హరనాథ్ కొరుప్రోలు
- కవి జె. కొండన్న
- కవి జూకంటి జగన్నాథం
- కవి జూపాక సుభద్ర
- కవి జ్వలిత దెంచనాల
- కవి కాంచనపల్లి
- కవి కందాళై రాఘవాచార్య
- కవి కందుకూరి శ్రీరాములు
- కవి కసిరెడ్డి వెంకట్ రెడ్డి
- కవి కోటం చంద్ర శేఖర్
- కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి
- కవి ఎం. దత్తాత్రేయ శర్మ
- కవి మెర్సీ మార్గరెట్
- మౌనశ్రీ మల్లిక్
- కవి ఎన్. గోపి
- కవి నాళేశ్వరం శంకరం
- కవి నస్రీన్ ఖాన్
- నెల్లుట్ల రమాదేవి
- కవి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
- కవి పొన్నాల బాలయ్య
- కవి పొట్లపల్లి శ్రీనివాసరావు
- కవి రామా చంద్రమౌళి
- కవి రమేష్ కార్తీక్ నాయక్
- కవి రెడ్డి రత్నాకర్ రెడ్డి
- కవి రూపకార్ డబ్బికర్
- కవి సంగనభట్ల నర్సయ్య
- కవి షాజహానా
- కవి సిద్దెంకి యాదగిరి
- కవి తైదల అంజయ్య
- కవి తిరుమల శ్రీనివాసాచారి
- కవి వడ్డేపల్లి కృష్ణ
- వనపట్ల సుబ్బయ్య
- కవి వీణావాణి ద్యావనపల్లి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.